E-Paper
Advertisement

డేటింగ్‌కు మొదటిసారి వెళ్లినప్పుడు మీరు గమనించాల్సిన మంచి విషయాలు.. మీ సంబంధానికి ఇవే పునాది

డేటింగ్‌కు మొదటిసారి వెళ్లినప్పుడు మీరు గమనించాల్సిన మంచి విషయాలు.. మీ సంబంధానికి ఇవే పునాది
Advertisement

Green flags on a first date| మీరు ఒకరిని ఇష్టపడుతున్నట్లు అనిపిస్తే ఆ వ్యక్తిని ప్రేమించడానికి, జీవితాంతం ఆ వ్యక్తితో మీరు సంతోషంగా ఉండగలరా అని అంచనా వేయడానికి, పూర్తిగా తెలుసుకోవడానికి చేసే ప్రయత్నమే డేటింగ్. అయితే ప్రారంభంలో డేటింగ్ అంటే మొదటి డేట్ ఉత్సాహంగా, గందరగోళంగా రెండూ అనిపిస్తుంది. చాలామంది మొదటి డేట్ కు వెళ్లినప్పుడు ఎదుటి వ్యక్తిలో ఉన్న సమస్యలు, చెడు సంకేతాలపై ఎక్కువ దృష్టి పెడతారు. కానీ వాటి కంటే ఆ వ్యక్తిలో ఉన్న మంచి విషయాలను గమనించడం అంతకంటే ఎక్కువ ముఖ్యం.

అతను లేదా ఆమెలో మీరు చూడాల్సింది.. ఎదుటివ్యక్తి మంచి భాగస్వామి కాగలడని చూపించే సానుకూల సంకేతాలు. మానసిక నిపుణుల ప్రకారం.. ఈ సంకేతాలు మీకు అతనిలోని ఒక పాజిటివ్ ఎనర్జీ, మానసిక ఆరోగ్యాన్ని అర్థం చేసుకోవడానికి తోడ్పడతాయి.

1. వారు మీ పట్ల నిజమైన ఆసక్తి కలిగి ఉన్నారా?

Advertisement

ఒక వ్యక్తితో మొదటిసారి డేటింగ్ కోసం వెళ్లినప్పుడు.. ఎదుటి వ్యక్తి మీ మాటలను శ్రద్ధగా వింటారు. ప్రశ్నలు అడుగుతారు. మాటల మధ్యలో ఆపడం చేయరు. లేదా తమ గురించే మాట్లాడుకుంటూ ఉండరు. ఇవి ఆ వ్యక్తిలో ఓర్పు, సంస్కారానికి సూచనలు మాత్రమే కాదు ఒక ఆరోగ్యకరమైన సంబంధానికి మంచి సూచన.

2. దయాభావం, గౌరవంగా ప్రవర్తిస్తారు

మీ డేటింగ్ సమయంలో ఆ వ్యక్తి తన కంటే ఆర్థికంగా కిందస్థాయి వ్యక్తులతో ఎలా మాట్లాడుతారో గమనించండి. సానుభూమి, దయ, గౌరవంగా మాట్లాడటం ఆ వ్యక్తి భావపరిపక్వతను చూపిస్తుంది.

3. మీరు అసౌకర్యంగా ఉంటే అర్థం చేసుకుంటారు

Advertisement

మొదటి డేట్లో మీరు సురక్షితంగా, చాలా రిలాక్స్ అయి ఉండాలి. ఎలాంటి ఒత్తిడి లేదా భయం ఉండకూడదు. ప్రశాంతమైన అనుబంధమే నిజమైన బంధానికి నాంది. కానీ చాలామంది వెళ్లగానే గందరగోళానికి గురై, ఆందోళన చెందుతారు. అలాంటి సమయంలో ఆ వ్యక్తి మీ మానసిక స్థితిని అర్థం చేసుకొని సౌకర్యంగా ఉండాలని చెబితే అతను పరిపక్వ స్వభావం కలవాడని అర్థం. ఇది కూడా మంచి సంకేతమే.

4.స్పష్టంగా మాట్లాడతారు

నిజాయితీగా, స్పష్టంగా మాట్లాడటం మంచి సంకేతం. వారు తమ గురించి చెప్పుకుంటారు కానీ అతిగా చెప్పరు. సమతుల్య సంభాషణ అంటే హద్దులను గౌరవిస్తూ మాట్లాడడం.

5. మీ హద్దులను గౌరవిస్తారు

ప్రతి వ్యక్తికీ తమ వ్యక్తిగత పరిమితులు ఉంటాయి. డేటింగ్ సమయంలో ఆ వ్యక్తి మిమ్మల్ని ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టరు. హద్దులను గౌరవించడం భావపరిపక్వతకు గుర్తు.

6.గత సంబంధాల గురించి సానుకూలంగా మాట్లాడతారు

తమ మాజీ ప్రేయసి, ప్రియుడి గురించి గురించి గౌరవంగా చెప్పుకోవడం మంచి సంకేతం. అది వారిలో నిషేధ భావాలు లేవని, స్థిరత్వం ఉందని చూపిస్తుంది.

7. విశ్వసనీయత, నిబద్ధత

సమయానికి రావడం, మాట ప్రకారం నడుచుకోవడం, డేట్ ప్లాన్ చేయడం.. ఇవన్నీ నమ్మకాన్ని పెంచే చిన్న చర్యలు.

Also Read: మత్తెకించే సువాసన.. మంచి నిద్ర కోసం బెడ్‌రూంలో ఈ మొక్కలు పెంచండి

మంచి సంకేతాలు ఎందుకు ముఖ్యం?

ఒక కొత్త సంబంధంలో చెడు సంకేతాలను కూడా చూడాలి. కానీ మంచి విషయాలకు ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వాలి. ప్రశాంతమైన, స్థిరమైన అనుబంధమే ఆరోగ్యకరమైన సంబంధానికి పునాది.

Related News

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

Big Stories

Advertisement
×