E-Paper
Advertisement

చిత్ర పరిశ్రమలో తీరని విషాదం.. గుండెపోటుతో 30 ఏళ్లకే ప్రముఖ నటి మృతి!

చిత్ర పరిశ్రమలో తీరని విషాదం.. గుండెపోటుతో 30 ఏళ్లకే ప్రముఖ నటి మృతి!
Advertisement

Divyanka Shirohi:

సినీ ఇండస్ట్రీలో వరుస మరణాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న వయో భారంతో ఆశా భోంస్లే మృతి చెందగా, తాజాగా మూడు పదులు కూడా దాటని దివ్యాంక శిరోహి తనువు చాలించడం గమనార్హం. తన అందం, అభినయంతో హర్యానా సినీ ఇండస్ట్రీపై తనదైన ముద్ర వేసిన దివ్యాంకకు మంగళవారం రాత్రి సడెన్‌గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయిందని డాక్టర్లు చెప్పడంతో అటు ఇండస్ట్రీలో, ఇటు సోషల్ మీడియా ప్రపంచం ఒక్కసారిగా షాక్‌కు గురయ్యింది.

Advertisement

తక్కువ కాలంలోనే స్టార్

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్లో 1996 నవంబర్ 19న జన్మించిన దివ్యాంక శిరోహికి తమ్ముడు హిమాంశు, చెల్లెల్లు దీపాంశు, జస్మీత్ ఉన్నారు. దివ్యాంక విద్యార్థిగానూ మంచి ప్రతిభ చూపడం విశేషం. మీరట్‌లోని చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయంలో బీసీఏ పూర్తి చేసిన ఆమె, సిక్కింలో ఎంబీఏ డిగ్రీను కూడా అందుకుంది. చదువులో టాపర్ అయినప్పటికీ నటిగా మంచి పేరు తెచ్చుకోవాలన్న లక్ష్యంతో మొదటగా టిక్‌టాక్‌లోకి అడుగుపెట్టి తక్కువ కాలంలోనే స్టార్ అయిపోయింది. ముఖ్యంగా పంజాబీ సింగర్ సునంద శర్మ పాడిన ‘మేరీ మమ్మీ ను పసంద్ నీ తూ’ అనే పాటకు దివ్యాంక చేసిన టిక్‌టాక్ వీడియో నేషనల్ వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసింది.

Advertisement

also read:విజయ్ వర్మ పక్కన ఆ బ్యూటీ ఎవరు? తమన్నాతో బ్రేకప్ తర్వాత కొత్త లవ్ స్టోరీ షురూ!

దాదాపు 2 కోట్ల వ్యూస్

కేవలం ఆ ఒక్క వీడియోనే ఆమెకు దాదాపు 2 కోట్ల వ్యూస్ తెచ్చిపెట్టిందంటే ఆ సాంగ్ ఏ రేంజ్‌లో వైరల్ అయిందో అర్థమవుతుంది. అక్కడి నుంచి ఆమె ఫాలోవర్స్ ఏకంగా 5 కోట్లకు చేరడంతో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇన్ఫ్లుయెన్సర్‌గా పేరు తెచ్చుకుంది. అంతేకాదు ఇండియాలో టిక్‌టాక్ బ్యాన్ చేసినప్పటికీ ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టిన దివ్యాంక అక్కడ కూడా 1.3 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకుని డిజిటల్ స్టార్‌గా వెలిగిపోయింది.

50కి పైగా హర్యానా పాటల్లో

అలా అని కేవలం ఇన్ఫ్లుయెన్సర్ గానే మిగిలిపోకుండా 50కి పైగా హర్యానా పాటల్లో నటించిన ఆమె, మాసూమ్ శర్మ, అమిత్ సైని రోహ్‌తకియా, కేడీ వంటి ప్రముఖలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇందులో ముఖ్యంగా మాసూమ్ శర్మతో కలిసి ఆమె చేసిన కవర్ సాంగ్స్‌కు యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ ఉండటం విశేషం.

ఏది ఏమైనా నటిగా వెలుగు వెలగాలన్న ఆమె కోరిక తీరకుండానే ఇలా అర్థాంతరంగా కన్నుమూయడం నిజంగా బాధాకరం.

also read :నాని ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ …‘బ్లడీ రోమియో 2026 టార్గెట్ మిస్.. అసలేం జరుగుతోంది?

Related News

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

టాక్సిక్ vs ఇరుముడి.. భారీ బడ్జెట్ సినిమాలకు ఇదో గుణపాఠమా?

Big Stories

Advertisement
×