E-Paper
Advertisement

రాత్రి నిద్ర పట్టడం లేదా? ఈ 7 ఆహారాలు తింటే గుర్రు పెట్టి పడుకుంటారు!

రాత్రి నిద్ర పట్టడం లేదా? ఈ 7 ఆహారాలు తింటే గుర్రు పెట్టి పడుకుంటారు!
Advertisement

Foods For Better Sleep: రోజంతా కష్టపడి పనిచేశాక, రాత్రి హాయిగా నిద్రపోవాలని ఎవరికి ఉండదు? కానీ చాలా మందికి అర్ధరాత్రి మెలకువ రావడం లేదా అసలు నిద్ర పట్టకపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. దీనికి కారణం ఒత్తిడి మాత్రమే కాదు.. మనం పడుకునే ముందు తీసుకునే ఆహారం కూడా కావచ్చు. కొన్ని రకాల ఆహారాలు మన మెదడును ప్రశాంతపరిచి, నిద్రను ప్రేరేపించే హార్మోన్లను విడుదల చేస్తాయి. రాత్రిపూట అంతరాయం లేని గాఢ నిద్ర కోసం మీరు తినాల్సిన ఆ 7 అద్భుతమైన ఆహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రాత్రి పూట ప్రశాంతమైన నిద్ర కోసం 7 బెస్ట్ ఆహారాలు:

Advertisement

1. బాదం పప్పులు :
బాదంలో ‘మెలటోనిన్’ అనే హార్మోన్ ఉంటుంది. ఇది నిద్ర చక్రాన్ని క్రమబద్ధీకరిస్తుంది. ఇందులో ఉండే మెగ్నీషియం కండరాలను రిలాక్స్ చేసి, ఒత్తిడిని తగ్గిస్తుంది. పడుకునే ముందు 4-5 నానబెట్టిన బాదం తింటే నిద్ర బాగా పడుతుంది. దీని వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి.

2. గోరు వెచ్చని పాలు:
చిన్నప్పటి నుంచి అమ్మ చెప్పే మాట ఇది. పాలలో ‘ట్రిప్టోఫాన్’ అనే అమినో యాసిడ్ ఉంటుంది. ఇది మెదడులో సెరోటోనిన్‌ను ఉత్పత్తి చేసి, మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. ఒక గ్లాసు గోరు వెచ్చని పాలు తాగితే నిద్ర గ్యారెంటీ. అందుకే పడుకునే ముందు చాలా మంది గోరు వెచ్చటి పాలు తాగాలని చెబుతుంటారు.

Advertisement

3. అరటిపండు :
అరటిపండులో పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాలు పట్టేయకుండా చేసి.. శరీరాన్ని నిద్రకు సిద్ధం చేస్తాయి. అలాగే ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు మీకు త్వరగా నిద్ర పట్టేలా చేస్తాయి. అరటి పండు బరువు పెరగాలని అనుకున్న వారు రాత్రి పూట తినడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.

4. వాల్ నట్స్ :
వాల్ నట్స్‌లో నిద్రను కలిగించే మెలటోనిన్ అధికంగా ఉంటుంది. వీటిలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, నిద్రలో అంతరాయాలు కలగకుండా చూస్తాయి. వాల్ నట్స్ తినడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఎన్నో సమస్యలు రాకుండా చేయడంలో కూడా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.

Also Read: అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్.. ఎండాకాలంలో ఈ ‘ గోంద్ కతీరా’ అస్సలు మిస్ అవ్వకండి!

5. కివీ ఫ్రూట్:
నిద్రలేమితో బాధపడేవారికి కివీ ఒక వర ప్రసాదం. పడుకోవడానికి గంట ముందు రెండు కివీ పండ్లు తింటే నిద్ర నాణ్యత పెరుగుతుందని పరిశోధనల్లో తేలింది. ఇందులో ఉండే సెరోటోనిన్ నిద్ర పట్టేలా చేస్తుంది.

6. ఓట్స్ :
ఓట్స్ కేవలం బ్రేక్‌ఫాస్ట్ మాత్రమే కాదు. డిన్నర్‌కు కూడా మంచి ఆప్షన్. ఇందులో ఉండే ఫైబర్ , మెగ్నీషియం రక్తంలో చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచి.. రాత్రిపూట ఆకలి వల్ల మెలకువ రాకుండా చూస్తాయి.

7. చమోమిలే టీ :
కెఫీన్ ఉండే కాఫీ, టీలకు బదులుగా చమోమిలే టీ తాగండి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆందోళనను తగ్గించి.. సహజ సిద్ధమైన నిద్ర ట్యాబ్లెట్ లాగా పని చేస్తాయి.

Related News

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

సాయంత్రం పూట వేడి వేడిగా ఇలా చేసి పెట్టండి ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!

హోటల్ స్టైల్ క్రిస్పీ ఇన్‌స్టంట్ రవ్వ దోశ.. 15 నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి!

పిల్లల చేతి నుంచి ఫోన్ తీసుకోగానే ఏడుస్తున్నారా? ఇలా చేస్తే స్వయంగా ఇచ్చేస్తాడు

మన రక్తంలో ప్లాస్టిక్ విధ్వంసం.. తాజా రీసెర్చ్‌లో తేలిన సంచలన విషయాలు!

ఈ నవరాత్రులకు 3 స్పెషల్ డిషెస్.. ప్రసాదంగానూ పెట్టొచ్చు, రుచికి తిరుగే ఉండదు!

Big Stories

Advertisement
×