E-Paper
Advertisement

చిన్న వయసులోనే ముసలితనం లక్షణాలు.. ఈ ఆహారాలు తినడమే కారణం

చిన్న వయసులోనే ముసలితనం లక్షణాలు.. ఈ ఆహారాలు తినడమే కారణం
Advertisement

Anti Aging Diet| మీ చర్మ ఆరోగ్యం, వృద్ధాప్య వేగాన్ని నేరుగా ప్రభావితం చేసేది మీరు రోజూ తినే ఆహారమే. కొన్ని ఆహారాలు తింటే చర్మంపై వేగంగా ముడతలు, చర్మం నిర్జీవంగా ఉండడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. నిపుణుల ప్రకారం.. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు.. శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని తగ్గించి, చర్మ సాగదీత గుణాన్ని దెబ్బతీస్తాయి. దీంతో చర్మం త్వరగా ముడతలు పడడం, అలసిపోయినట్లు కనిపిస్తాయి.

స్వీట్స్, షుగర్ డ్రింక్స్ చర్మాన్ని ఎలా హాని చేస్తాయి?

ఆహారంలో చక్కెర ఎక్కువగా తింటే త్వరగా వృద్ధాప్యానికి కారణమవుతుంది. ఎందుకంటే ఆహారంలో ఎక్కువ చక్కెర ఉంటే కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీంతో చర్మలో కొత్త సెల్స్ నిర్మాణం బలహీనంగా జరుగుతాయి. ఐస్ క్రీం, స్వీట్లు, భోజనం తరువాత తినే తీపి వంటకాలు, అధిక చక్కెరను కలిగి ఉంటాయి. ఈ ఆహారాలు తినడం వల్ల చర్మం లూజుగా మారుతుంది. కూల్ డ్రింక్స్‌లో చక్కెర, కెఫిన్ ఉంటాయి. అవి శరీరంలో నీరు తగ్గించి చర్మాన్ని నీర్జీవంగా మాడ్చేస్తాయి. ప్యాకెట్ ఫ్రూట్ జ్యూస్‌లలో కూడా షుగర్ ఉంటుంది.

ప్రాసెస్ చేసిన ఆహారం, బేకరీ ఫుడ్స్ ఎందుకు ప్రమాదకరం?

Advertisement

ప్రాసెస్ చేసిన ఆహారాలలో అనారోగ్యకరమైన కొవ్వులు, మైదా పిండి ఉంటాయి. ఈ పదార్థాలు చర్మ ఆరోగ్యాన్ని హాని చేస్తాయి, శరీరంలో వాపుని కలిగిస్తాయి. కేక్స్, మఫిన్స్ వంటి బేకరీ ఫుడ్స్ తినడానికి తేలికగా, రుచికరంగా అనిపిస్తాయి. కానీ అవి శరీరంలో కొల్లాజెన్‌ని బలహీనపరిస్తాయి. ప్యాకెట్ స్నాక్స్ లో ప్రిజర్వేటివ్స్ కెమికల్స్, ఉప్పు కూడా ఉంటాయి. ఈ రసాయనాలు చర్మాన్ని దెబ్బతీస్తాయి.

మద్యం, డీహైడ్రేషన్ సమస్యలు

మద్యం తాగడం వల్ల చర్మ ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. మద్యం వల్ల చర్మంలో తేమ తొలగించి, పొడిగా మారుతుంది. పొడి చర్మం ఉంటే ముఖంలో ముసలితనం లక్షణాలు, అలసిపోయినట్లు కనిపిస్తుంది. మద్యం ప్రభావం కారణంగా చర్మం సహజంగా మరమ్మత్తు కావడం కూడా ఆలస్యమవుతుంది.

ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు

Advertisement

ఎక్కువ ఉప్పుగల ఆహారం తినడం వల్ల శరీరంలో నీరు తగ్గిపోతుంది. చర్మం త్వరగా పొడిబారడం, చర్మంపై పలచని గీతలు పడతాయి. నీరు తగ్గిపోవడం వల్ల తక్కవు వయస్సులోనే చర్మంపై ముడతలు పడతాయి.

Also Read: ఎంత సంపాదించినా డబ్బు మిగలడం లేదా? ఈ నాలుగు అలవాట్లే కారణం..

చర్మం యవ్వనంగా కనిపించేందుకు చిట్కాలు

రోజూ ఎక్కువ చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకోవడం మానుకోవాలి. మీ చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి తగినంత నీరు తాగండి. భోజనంలో తాజా కూరగాయలు తీసుకోవాలి. తాజా పండ్లలో చర్మానికి కావాల్సిన పోషకాలు ఎక్కువగా ఉంటాయి. మద్యం, కెఫిన్ పానీయాలను క్రమం తప్పకుండా పరిమితం చేయండి. ప్యాకెట్ ఆహారాల కంటే సహజ ఆహారాలను ఎంచుకోండి.

చర్మం ఆరోగ్యంగా ఉండడానికి మీరు తీసుకునే ఆహారం ప్రధాన కారణం. అందుకే ఆరోగ్యకరమైన ఆహారం తింటే మెరిసిపోయే చర్మం మీరు యవ్వనంగా కనిపించేందుకు సాయపడుతుంది.

Related News

సింపుల్, డౌన్ టు అర్త్.. ఈ తేదీల్లో పుట్టినవారు సాదాసీదా జీవనం ఇష్టపడతారు

మీ పిల్లలతో ఫ్రెండ్‌షిప్ చేయాలనుకుంటున్నారా? బలమైన బంధం కోసం తల్లిదండ్రులకు 5 ఈజీ టిప్స్

వర్షాకాలంలో రోడ్డు ప్రమాదాలు జరగడం ఎక్కువ.. స్కూటీ నడిపే సమయంలో ఈ 10 జాగ్రత్తలు పాటించాలి

తొలిప్రేమ ఎప్పటికీ మర్చిపోలేం.. దీనికి నాలుగు కారణాలు ఇవే

మహాశివుడి ప్రియమైన మొక్కలు.. శ్రావణ మాసంలో ఇంట్లో ఈ మొక్కలతో ప్రశాంతత, పచ్చదనం

చిన్న కిచెన్‌ను పెద్దదిలా చూపించే సింపుల్ ట్రిక్స్!

టీవీని పక్కన పెట్టేసిన జెన్‌జీ.. అంతా ఓటీటీ మాయే!

భార్యాభర్తల మధ్య దూరం అక్రమ సంబంధాలకు దారితీస్తుందా?

Big Stories

Advertisement
×