E-Paper
Advertisement

9 మందితో ఎఫైర్స్.. ఐఏఎస్ ఆఫీసర్‌తో పెళ్లి.. వెండితెర ‘రెండో భార్య’ రియల్ లైఫ్ విషాదం!

9 మందితో ఎఫైర్స్.. ఐఏఎస్ ఆఫీసర్‌తో పెళ్లి.. వెండితెర ‘రెండో భార్య’ రియల్ లైఫ్ విషాదం!
Advertisement

Poojitha controversy :సినిమా ఇండస్ట్రీ… ఇదో రంగుల ప్రపంచం. బయట నుండి చూడటానికి చాలా బాగుంటుంది. కానీ లోపలికి తొంగి చూస్తేనే ఆ అసలు రంగు బయటపడుతుంది. ఇదిగో ఇండస్ట్రీ వెనుక ఉన్న ఆ నిజాన్ని మరోసారి బయటపెట్టేసింది నటి పూజిత.పూజిత అనగానే మనకి గుర్తొచ్చే సినిమా ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్ . ఆ సినిమాలో రెండో భార్యగా చేసిన పూజితకి, జంద్యాల  దర్శకత్వంలో వచ్చిన లేడీస్ స్పెషల్  సినిమా మంచి గుర్తింపు తెచ్చింది. ఇక బుల్లితెరపై సెన్సేషన్ క్రియేట్ చేసిన రుతు రాగాలులో కూడా నటించి మెప్పించింది. తెలుగు మాత్రమే కాకుండా తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి దాదాపు 140 సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ వెటరన్ హీరోయిన్, తన జీవితంలో భర్త ద్వారా ఎదురైన చేదు అనుభవాలను బయటపెట్టింది.

పెళ్లయి దాదాపు 14 ఏళ్లు గడిచాకే

Advertisement

కెరీర్‌లో యమా బిజీగా ఉన్న సమయంలోనే విజయ్ గోపాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వారిద్దరికీ ఒక కొడుకు ఉన్నాడు. పెళ్లయి దాదాపు 14 ఏళ్లు గడిచాకే తన భర్త అసలు స్వరూపం బయటపడిందని ఆవేదన వ్యక్తం చేసింది.పూజిత మాట్లాడుతూ..తన భర్త విజయ్ గోపాల్‌కు తొమ్మిది మందితో అక్రమ సంబంధాలు ఉన్నాయని, కొడుకు ఉన్న కారణంగా అవన్నీ భరించానని చెప్పింది. కానీ చివరకు తనకు విడాకులు ఇవ్వకుండానే 28 ఏళ్ల కొడుకు ఉన్న ఒక మహిళా ఐఏఎస్ అధికారి ని పెళ్లి చేసుకున్నాడని ఆరోపించింది. అతను మీడియా రంగంలో ఉండటంతో ఒక్క ఆధారం కూడా దొరకకుండా తప్పించుకున్నాడని తన మనసులోని బాధని వెళ్ళగక్కింది పూజిత.

also read :27 ఏళ్ల తర్వాత వెండితెరపై మ్యాజిక్.. నాగార్జున ‘కింగ్ 100’లో టబు రీ-ఎంట్రీ ఫిక్స్!

Advertisement

ఒకరికొకరు ఇష్టంతోనే సహజీవనం

అయితే పూజిత ఈ ఆరోపణలు చేస్తూ రోడ్డుకెక్కడంతో అసలు మామధ్య పెళ్లి అనేదే జరగలేదని,కేవలం ఒకరికొకరు ఇష్టంతోనే సహజీవనం చేశామని చెప్పడం గమనార్హం.ఒక రకంగా పూజితని కోలుకోలేని దెబ్బ తీసింది ఈ కామెంట్స్ అనే చెప్పాలి.అయితే పూజిత ఎక్కడా తగ్గకుండా తన ఆధార్ కార్డ్ మరియు ఓటర్ ఐడి (EPIC) కార్డులను పోలీసులకు ఎవిడెన్స్ గా సమర్పించగా అందులో భర్తగా విజయ్ గోపాల్ పేరు భర్తగా ఉండటం విశేషం.

ఎక్కడున్నాడో తెలియక ఏడాదిన్నర పాటు

తనను పక్కకు పెట్టాలని నిర్ణయించుకున్న విజయ్ గోపాల్, ఇంట్లో ఉన్న బంగారు నగలు మరియు విలువైన వస్తువులతో పారిపోయాడని, అతను ఎక్కడున్నాడో తెలియక ఏడాదిన్నర పాటు వెతికానని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది.ఇక అతను పెళ్లి చేసుకున్న ఐఏఎస్ అధికారి పేరు రేఖా రాణి అని, వారి వివాహం 2016 ఏప్రిల్ 28న హైదరాబాద్‌లోని పోలీస్ ఆఫీసర్స్ మెస్‌లో జరిగిందని సమాచారం. ఈ పెళ్లికి ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి సాక్షిగా సంతకం చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి

ఇక ప్రస్తుతం తను  తన కొడుకుతో కలిసి జీవిస్తున్న పూజిత ఏ మాత్రం బెదురులేకుండా తన జీవితంలో జరిగిన మోసాలని ధైర్యంగా పంచుకోవడం మెచ్చుకో తగ్గ విషయమే . మొత్తానికి పై పూజిత తన భర్తపై చేస్తున్న పోరాటం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది

also read :యశ్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. మళ్ళీ వాయిదా పడనున్న ‘టాక్సిక్’? 250 కోట్ల డీలే కొంపముంచుతోందా!

Related News

ఆగస్టు 9న వైజాగ్‌లో బన్నీ హంగామా.. అభిమానులకు గుడ్ న్యూస్!

మృణాల్ ఠాకూర్ ఫైర్.. ఇక షేర్ చేసినా కేసులే!

నిఖిల్ ‘స్వయంభు’లో శక్తిమాన్.. టాప్ సీక్రెట్ రివీల్ చేసిన హీరో!

ఎన్టీఆర్ లేకుండానే ‘డ్రాగన్’ షూటింగ్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్!

శూర్పణఖ పాత్రపై రకుల్ షాకింగ్ కామెంట్స్!

ఆటా సందీప్ దూకుడు.. జానీ, శేఖర్ మాస్టర్లకి ఇక కష్టమేనా ?

జయం రవి విడాకుల కేస్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఆర్తి తల్లి!

త్రిషపై ఉదయనిధి అసభ్యకర వ్యాఖ్యలు.. కుష్బూ సంచలన ట్వీట్!

Big Stories

Advertisement
×