E-Paper
Advertisement

ఏసీ Vs కూలర్ Vs ఫ్యాన్.. సమ్మర్‌కి మీ ఇంటి కోసం ఏది స్మార్ట్ ఛాయిస్?

ఏసీ Vs కూలర్ Vs ఫ్యాన్.. సమ్మర్‌కి మీ ఇంటి కోసం ఏది స్మార్ట్ ఛాయిస్?
Advertisement

AC vs Cooler vs Fan: వేసవి కాలం వచ్చేసింది! భానుడు భగభగలాడుతుంటే.. ఇళ్లలో ఏసీలు, కూలర్లు శబ్దాలు మొదలయ్యాయి. అయితే.. పెరుగుతున్న కరెంటు బిల్లులు, మారుతున్న వాతావరణ పరిస్థితుల మధ్య “ఏసీ కొంటే మేలా? కూలర్ సరిపోతుందా? లేక స్మార్ట్ ఫ్యాన్ బెస్టా?” అనే అయోమయం చాలా మందిలో ఒక్కరిలోనూ ఉంది. మీ బడ్జెట్, మీ ఊరి వాతావరణం , మీ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ మూడింటిలో ఏది మీకు పర్ఫెక్ట్ సెట్ అవుతుందో వివరించే స్మార్ట్ గైడ్ .

మీ ఇంటికి ఏది బెస్ట్ ?

1. ఎయిర్ కండీషనర్ (AC):
ఏసీల టెక్నాలజీ చాలా మారిపోయింది. ఇప్పుడు ‘AI ఇన్వర్టర్ ఏసీలు’ వాడుకలోకి వచ్చాయి. ఇవి గదిలో ఉన్న మనుషుల సంఖ్యను బట్టి కూలింగ్‌ను అడ్జస్ట్ చేస్తాయి.

Advertisement

ఎప్పుడు కొనాలి?: మీ ఊరిలో ఉక్కపోత ఎక్కువగా ఉంటే ఏసీ తప్పనిసరి. ఇది గదిలోని తేమను తీసేసి చల్లగా ఉంచుతుంది.

లాభాలు: బయట 45°C ఉన్నా గదిలో 24°C వద్ద ప్రశాంతంగా నిద్రపోవచ్చు. దుమ్ము, ధూళి లోపలికి రావు.

Advertisement

సమస్యలు: కొనేటప్పుడు ఖర్చు ఎక్కువ (రూ.30,000 పైన), కరెంటు బిల్లు నెలకు కనీసం రూ.2,000-4,000 అదనంగా వచ్చే అవకాశం ఉంది. ఏసీ కోసం క్లోజ్డ్ రూమ్ ఉండాలి.

2. ఎయిర్ కూలర్ (Air Cooler):
తక్కువ ఖర్చుతో చల్లదనం కోరుకునే వారికి కూలర్ ఎప్పటికీ బెస్ట్ ఆప్షన్.

ఎప్పుడు కొనాలి?: రాజస్థాన్ లేదా తెలంగాణ, రాయలసీమ లాంటి ఎండలు ఎక్కువగా ఉండి, గాలిలో తేమ తక్కువగా ఉన్న ప్రాంతాలకు కూలర్ అద్భుతంగా పని చేస్తుంది.

లాభాలు: ఏసీతో పోలిస్తే 10వ వంతు కరెంటు మాత్రమే ఇది వాడుకుంటుంది. కిటికీలు తెరిచి పెట్టుకోవచ్చు కాబట్టి తాజా గాలి వస్తుంది. ధర రూ.5,000 నుంచి రూ.15,000 లూపే ఉంటుంది.

సమస్యలు: గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు (కోస్తా తీర ప్రాంతాల్లో) కూలర్ వాడితే చిరాకుగా, జిగటగా అనిపిస్తుంది. రోజూ నీళ్లు నింపాలి. మెయింటెనెన్స్ కూడా ఎక్కువ.

3. స్మార్ట్ ఫ్యాన్స్ (BLDC Fans):
సాధారణ ఫ్యాన్ల స్థానంలో BLDC ఫ్యాన్లు వచ్చేశాయి. ఇవి కేవలం 28-35 వాట్ల కరెంటును మాత్రమే వాడుకుంటాయి.

ఎప్పుడు కొనాలి?: ఎండలు మరీ ఎక్కువగా లేని సమయాల్లో లేదా ఏసీతో కలిపి వాడుకోవడానికి ఇవి బెస్ట్.

లాభాలు: ఇన్వర్టర్ మీద కూడా చాలా సేపు తిరుగుతాయి. రిమోట్ కంట్రోల్, స్మార్ట్ యాప్ ఫీచర్లు ఉంటాయి. కరెంటు బిల్లు కూడా చాలా తక్కువ.

ప్రతికూలతలు: ఇవి గాలిని మాత్రమే తిప్పుతాయి తప్ప, గాలిని చల్లబరచలేవు. ఎండలు ముదిరితే.. వీటి వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు.

Also Read: మీ ఇల్లు, ఆఫీస్ సేఫ్టీకి ఏది బెస్ట్? సీసీటీవీ సిస్టమ్స్ కొనే ముందు తెలుసుకోవాల్సిన నిజాలు!

ఏది బెస్ట్?
మీరు నిర్ణయం తీసుకునే ముందు ఈ మూడు విషయాలు గమనించండి.

వాతావరణం: మీ ఏరియాలో ‘ఉక్కపోత’ ఎక్కువగా ఉంటే కళ్ళు మూసుకుని ఏసీ తీసుకోండి. కేవలం ఎండ ఎక్కువగా ఉండి గాలి పొడిగా ఉంటే కూలర్ చాలు.

బడ్జెట్: మీ బడ్జెట్ రూ.10వేలలోపు ఉంటే.. హనీకోంబ్ ప్యాడ్లు ఉన్న పర్సనల్ కూలర్ బెస్ట్. బడ్జెట్ ఎక్కువ ఉంటే 5-స్టార్ ఇన్వర్టర్ ఏసీ తీసుకోండి.

వాడకం: కేవలం రాత్రి పూట నిద్ర కోసం అయితే ఏసీ బెటర్. రోజంతా చల్లగా ఉండాలి. కరెంటు బిల్లు తక్కువ రావాలి అంటే కూలర్ నయం.

ప్రస్తుతం చాలా మంది ‘Hybrid’ పద్ధతి పాటిస్తున్నారు. రాత్రి పడుకునే ముందు ఒక గంట ఏసీ వేసి, ఆ తర్వాత BLDC Fan స్లోగా వేసుకోవడం వల్ల గది చల్లగా ఉంటుంది. అంతే కాకుండా కరెంటు బిల్లు 50% వరకు ఆదా అవుతుంది. ఏది కొన్నా సరే, దాన్ని ఎలా మెయింటెయిన్ చేస్తున్నారనేది ముఖ్యం. ఏసీ ఫిల్టర్లు క్లీన్ చేయడం, కూలర్ ప్యాడ్లు మార్చడం లాంటివి చేస్తేనే.. అవి మీకు సరైన కూలింగ్ ఇస్తాయి.

Also Read: ఇల్లే ఏసీలా మారుతుంది! లివింగ్ రూమ్ కోసం.. తక్కువ ధరలో సీలింగ్ ఫ్యాన్లు

Related News

ఏంది భయ్యా ఇది.. జియోలో రూ.350 లోపు.. ఇంత మంచి ప్లాన్స్ ఉన్నాయా!

గూగుల్ డ్రైవ్‌లో ఫైళ్లు వెతకలేక విసుగొస్తుందా? ఈ సూపర్ ట్రిక్స్ వాడితే క్షణాల్లో పని పూర్తి!

కన్నుల పండుగే.. ఏకంగా రూ.18,000 తగ్గింది, ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ బంపర్ డిస్కౌంట్!

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

Big Stories

Advertisement
×