E-Paper
Advertisement

నియోజకవర్గాల పునర్విభజనతో యూపీకి లాభం.. సౌత్ కు నష్టం: సీఎం రేవంత్ రెడ్డి

నియోజకవర్గాల పునర్విభజనతో యూపీకి లాభం.. సౌత్ కు నష్టం: సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy: ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ సందర్భంగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జనాభా ప్రాతిపదికన లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచడం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు.. ముఖ్యంగా చిన్న రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే కేంద్రం ఈ దిశగా అడుగులు వేస్తోందని ఆయన విమర్శించారు. జనాభా నియంత్రణ పాటించి దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు ఇది రివార్డు కాదని.. ఒక రకమైన శిక్ష అని అభిప్రాయపడ్డారు.

నియోజకవర్గాల పెంపు వల్ల ఉత్తరప్రదేశ్.. బీహార్.. మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు రాజకీయంగా మరింత బలోపేతం అవుతాయని రేవంత్ రెడ్డి విశ్లేషించారు. “యూపీలో ప్రస్తుతం 80 సీట్లు ఉంటే అవి 120కి పెరుగుతాయి.. కానీ కేరళలో 20 స్థానాలు ఉంటే అవి కేవలం 30కి మాత్రమే పెరుగుతాయి. దీనివల్ల పెద్ద రాష్ట్రాల ఆధిపత్యం పెరిగి చిన్న రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుంది” అని వివరించారు. భవిష్యత్తులో దక్షిణాది రాష్ట్రాల మద్దతు అవసరం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నియోజకవర్గాల సంఖ్య పెరిగితే దక్షిణాది నేతలకు కేంద్రంలో గుర్తింపు ఉండదని.. చివరకు బండి సంజయ్.. కిషన్ రెడ్డి లాంటి వారికి కనీసం సాధారణ ఉద్యోగం కూడా దక్కని పరిస్థితి వస్తుందని ఎద్దేవా చేశారు.

Advertisement

దేశ ఆర్థిక వ్యవస్థలో 40 శాతం వాటా అందిస్తున్న దక్షిణ భారతదేశానికి రాజకీయాల్లో 40 శాతం సీట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు. “దక్షిణాది రాష్ట్రాలు ఆర్థిక రాష్ట్రాలు.. దేశాన్ని ఆదుకుంటున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలు పొలిటికల్ రాష్ట్రాలు.. అందుకే అక్కడి వారికే పెద్ద పదవులు దక్కుతున్నాయి” అని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇప్పటికే దక్షిణాది వారు రెండో శ్రేణి పౌరులుగా మిగిలిపోతున్నారని.. ఈ వివక్ష ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో తీవ్రమైన ప్రజా ఉద్యమాలు మొదలవుతాయని హెచ్చరించారు. వివాదాస్పద రైతు చట్టాలను కేంద్రం ఎలాగైతే వెనక్కి తీసుకుందో.. నియోజకవర్గాల బిల్లు విషయంలోనూ అదే పరిస్థితి వస్తుందని స్పష్టం చేశారు.

మహిళా రిజర్వేషన్ బిల్లుపై స్పందిస్తూ.. సీడబ్ల్యూసీ తీర్మానం మేరకు తాము మద్దతు ఇస్తున్నట్లు సీఎం తెలిపారు. అయితే సీట్లు పెంచినప్పుడు మహిళలకు కూడా 50 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కోరారు. సోనియా గాంధీ గారు సూచించినట్లుగా మహిళా కోటాలో ఓబీసీలకు కచ్చితంగా సబ్ కోటా కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న 543 స్థానాల్లోనే 181 రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యమైనప్పుడు.. నియోజకవర్గాల పెంపు ముసుగులో రాజకీయ కుట్రలు చేయడం తగదని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Advertisement

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీ మార్పుపై అడిగిన ప్రశ్నలకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానమిచ్చారు. ఆయన వ్యాఖ్యలపై తాను మాట్లాడనని చెబుతూనే.. బీఆర్‌ఎస్ తీరును తప్పుబట్టారు. కేటీఆర్ అధికారంలో ఉన్నప్పుడు దేవేందర్ గౌడ్.. ఈటెల రాజేందర్.. విజయశాంతి.. జూపల్లి కృష్ణారావు వంటి ఎందరో సీనియర్ నేతలను అవమానించి బయటకు పంపారని గుర్తు చేశారు. పదవులు ఆశించి వెళ్లే వారి గురించి కాకుండా.. ప్రజల సమస్యలపైనే తమ ప్రభుత్వం దృష్టి సారిస్తుందని స్పష్టం చేశారు.

Read Also: సీఎం రేవంత్ రెడ్డి ‘రూలర్’లా వ్యవహరిస్తున్నారు.. జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×