E-Paper
Advertisement

FSSAI On Herbal Infusions: ఇక వాటిని హెర్బల్ టీ అనొద్దు.. FSSAI కీలక ఆదేశాలు

FSSAI On Herbal Infusions: ఇక వాటిని హెర్బల్ టీ అనొద్దు.. FSSAI కీలక ఆదేశాలు
Advertisement

FSSAI On Herbal Infusions: మనం రోజూ తాగే టీల విషయంలో కస్టమర్లు అయోమయానికి గురి కాకుండా చూసేందుకు భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్‌లో లభించే వివిధ రకాల మూలికల మిశ్రమాలను (Herbal Infusions) ‘టీ’ పేరుతో ప్యాకేజింగ్ లేదా మార్కెటింగ్ చేయకూడదని డిసెంబర్ 24, 2025న స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

నిబంధన వెనక ఉన్నఅసలు కారణం:

FSSAI నిబంధనల ప్రకారం.. ‘టీ’ అనే పదాన్ని కేవలం ‘కామెల్లియా సినెన్సిస్’ అనే నిర్దిష్ట మొక్క నుంచి సేకరించిన ఆకులు, మొగ్గలు లేదా కాండం నుంచి తయారైన డ్రింక్స్‌కు మాత్రమే వాడాలి. ఈ మొక్క నుంచి లభించే పదార్థం లేని ఏ ఇతర డ్రింక్ అయినా ‘టీ’ అని లేబుల్ చేయడం చట్టరీత్యా నిబంధనల ఉల్లంఘనే అవుతుంది.

Advertisement

సమస్య ఏంటి ?

ప్రస్తుతం మార్కెట్‌లో చాలా కంపెనీలు చామంతి (Chamomile), రోజ్మెరీ, తులసి, పుదీనా, ఎండిన పండ్లు లేదా పువ్వులతో చేసిన ఇన్ఫ్యూషన్లను ‘హెర్బల్ టీ’ లేదా ‘ఫ్రూట్ టీ’ అనే పేరుతో అమ్ముతున్నారు. వాస్తవానికి వీటిలో అసలైన టీ ఆకులు ఉండవు. ఇలా టీ ఆకులు లేని ఉత్పత్తులకు ‘టీ’ అనే పేరును వాడటం వల్ల కస్టమర్లు అవి నిజంగానే టీలోని వివి రకాలని భావించి కొంటున్నా రు. ఇది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ ప్రకారం కస్టమర్లను తప్పుదోవ పట్టించడమే అని FSSAI పేర్కొంది.

FSSAI జారీ చేసిన ప్రధాన మార్గదర్శకాలు:

ప్యాకేజింగ్ సవరణ: ఆహార వ్యాపార సంస్థలు (FBOs) తమ ఉత్పత్తుల ప్యాకేజింగ్, లేబులింగ్, ప్రకటనలలో ‘టీ’ అనే పదాన్ని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వాడకూడదు.

తక్షణ అమలు: ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని.. ప్యాకర్లు, మార్కెటింగ్ సంస్థలు తమ వద్ద ఉన్న స్టాక్‌ను, భవిష్యత్తు లేబుల్స్‌ను ఈ నిబంధనలకు అనుగుణంగా మార్చుకోవాలని సూచించింది.

మినహాయింపు: కాంగ్రా టీ , గ్రీన్ టీ, బ్లాక్ టీ, వైట్ టీ, ఊలాంగ్ టీ వంటి రకాలు ఈ నిబంధన పరిధిలోకి రావు. ఎందుకంటే ఇవన్నీ ‘కామెల్లియా సినెన్సిస్’ మొక్క నుండే తయారవుతాయి.

Also Read: రక్తపోటు తగ్గడానికి నిమ్మరసం నిజంగా పనిచేస్తుందా? సైన్స్ ఏం చెబుతోంది ?

కస్టమర్లపై ప్రభావం:

ఈ కొత్త నిబంధన వల్ల మార్కెట్‌లో పారదర్శకత పెరుగుతుంది. ఆరోగ్యం కోసం లేదా రుచి కోసం మీరు కొనుగోలు చేసే టీ అసలైన టీ ఆకులతో తయారైందా లేదా కేవలం మూలికల మిశ్రమమా అనేది ప్యాకెట్ పై ఉండే పేరును బట్టే స్పష్టంగా తెలుస్తుంది. ఉదాహరణకు.. ఇకపై కంపెనీలు తమ ప్యాకెట్లపై “హెర్బల్ టీ” అని కాకుండా “హెర్బల్ ఇన్ఫ్యూషన్” అని లేదా ఆ మూలిక పేరుతో (ఉదాహరణకు: ‘తులసి ఇన్ఫ్యూషన్’) మాత్రమే ముద్రించాల్సి ఉంటుంది.

ఆహార భద్రతా ప్రమాణాలను కఠినతరం చేయడంలో భాగంగా FSSAI ఈ నిర్ణయం తీసుకుంది. వ్యాపార సంస్థలు ఈ నిబంధనలను పాటించకపోతే జరిమానాలు, లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉంది. కస్టమర్లు కూడా ప్యాకెట్ల వెనుక ఉన్న పదార్థాల లిస్ట్ కొనే ముందు చెక్ చేయడం మంచిది.

Related News

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

Big Stories

Advertisement
×