E-Paper
Advertisement

Action thriller OTT : ఓటీటీలో దుమ్మురేపుతున్న హాలీవుడ్ రివేంజ్ యాక్షన్ డ్రామా… కానీ చిన్న ట్విస్ట్

Action thriller OTT : ఓటీటీలో దుమ్మురేపుతున్న హాలీవుడ్ రివేంజ్ యాక్షన్ డ్రామా… కానీ చిన్న ట్విస్ట్

Action thriller OTT : Mad Max Fury Road, John Wick వంటి హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్లకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక ఇలాంటి సినిమాల టైపులో వచ్చే ప్రతీ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ ఉంటుంది. అచ్చం అలాంటి మూవీనే ఒకటి ఓటీటీలో సందడి చేస్తోంది. అయితే ఆ మూవీని చూడాలంటే మాత్రం చిన్న ట్విస్ట్ ఉంది. అదేంటి? మూవీ స్టోరీ ఏంటి? అన్నది తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఫిన్నిష్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా Sisu: Road to Revenge (2025). ఇది 2022లో వచ్చిన Sisu అనే సినిమాకు సీక్వెల్. జల్మారి హెలాండర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు ఇండియన్ OTTలలోకి ప్రవేశించింది. జోర్మా టామిలా హీరోగా నటించిన ‘సిసు: రోడ్ టు రివెంజ్’ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది. కానీ ట్విస్ట్ ఏంటంటే ఈ మూవీని సబ్స్క్రయిబర్లు సైతం ఫ్రీగా చూడలేరు. ఎందుకంటే మూవీ రెంట్ లేదా బై ఆప్షన్ లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. వీక్షకులు ఈ సినిమాను చూడటానికి రూ. 249 పే చేయాల్సిందే. ఈ సినిమా తెలుగు-డబ్బింగ్ వెర్షన్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. జోర్మా టొమ్మిలా – అతామి కొర్పి పాత్రలో నటించారు. “ది ఇమ్మార్టల్” అని పిలుచుకునే మాజీ కమాండో అతను. స్టీఫెన్ లాంగ్ – ఇగోర్ డ్రాగనోవ్ అనే పాత్రలో రెడ్ ఆర్మీ కమాండర్ గా కన్పించారు. రిచర్డ్ బ్రేక్, టామ్మి కొర్పెలా మొదలైనవారు ఇందులో కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని పెట్రి జోకిరాంటా నిర్మించారు. యాక్షన్, వార్ థ్రిల్లర్, రివెంజ్ వంటి అంశాలన్నీ కలగలిపి ఉన్న డ్రామా ఇది. 88-90 నిమిషాలు రన్‌టైమ్ ఉన్న ఈ మూవీలో బ్లడీ బ్లడ్ బాత్ ఘోరంగా ఉంటుంది. ఈ ఏడాది 2025 నవంబర్ 21న థియేటర్స్‌లో రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. IMDbలో ఈ మూవీకి 7.0 రేటింగ్ ఉండడం విశేషం.

Read Also : ‘లిటిల్ హార్ట్స్’ నుంచి ‘రాజు వెడ్స్ రాంబాయి’ వరకు… 2025 టాలీవుడ్ సైలెంట్ హిట్స్ స్ట్రీమింగ్ ఈ ఓటీటీలోనే

స్టోరీ వివరాలు

1946లో వరల్డ్ వార్ II తర్వాత ఫిన్‌లాండ్-సోవియట్ బార్డర్‌లో యుద్ధం జరుగుతుంది. ఫిన్‌లాండ్ లో కొంత భూభాగం సోవియట్ యూనియన్‌కు ఇవ్వాల్సి వచ్చిన నేపథ్యం అది. మాజీ కమాండో అతామి కొర్పి తన ఫ్యామిలీ (వైఫ్, పిల్లలు)ని రెడ్ ఆర్మీ చంపేసిన పాత ఇంటికి తిరిగి వెళ్తాడు. ఆ ఇంటిని కూలగొట్టి, ట్రక్‌లో లోడ్ చేసి ఫిన్నిష్ సైడ్‌కు తీసుకెళ్లి రీబిల్డ్ చేయాలని ప్లాన్ చేస్తాడు. ఫ్యామిలీ మెమరీస్ సేఫ్ చేయాలన్నది అతని ఆలోచన. కానీ ఆ ఫ్యామిలీని చంపిన రెడ్ ఆర్మీ కమాండర్ ఇగోర్ డ్రాగనోవ్ అతన్ని ట్రాక్ చేసి, చంపడానికి వస్తాడు. ఇక్కడి నుంచి కథ నాన్‌స్టాప్ క్రాస్-కంట్రీ చేజ్‌గా మారుతుంది. అతామి ఇంటి పార్ట్స్ తో లోడై ఉన్న ట్రక్‌ను డ్రైవ్ చేస్తూ సోవియట్ సోల్జర్స్, ట్యాంక్స్, హెలికాప్టర్స్ వంటి చేజింగ్ ఫైట్ లో పాల్గొంటాడు. మరి హీరో వాళ్ళందరి నుంచి ఎలా తప్పించుకున్నాడు ? ఎక్స్‌ట్రీమ్ వయొలెన్స్ ఉంటుంది కాబట్టి చిన్న పిల్లలతో చూడకపోతే బెటర్.

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×