Meenakshi Chaudhary Photos (Source: Instagram)
Meenakshi Chaudhary: హీరోయిన్ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ జాబితా చేరింది.

Meenakshi Chaudhary Photos (Source: Instagram)
ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన ఈ భామ వెండితెరపై అందం, అభినయంతో ఆడియన్స్‌ని ఆకట్టుకుంది.

Meenakshi Chaudhary Photos (Source: Instagram)
ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా అంతగా హిట్ అవ్వకపోయినప్పటికీ, ఈ బ్యూటీకి మాత్రం మంచి క్రేజ్ వచ్చింది.

Meenakshi Chaudhary Photos (Source: Instagram)
దీంతో అడవి శేష్ హిట్ 2 మూవీలో ఛాన్స్ కొట్టేసింది. ఇక ఈ మూవీతో ఈ అమ్మ డుకు వరసగా అవకాశాలు దక్కాయి. ఇక ఈ సినిమా తర్వాత గుంటూరు కారం, లక్కీ భాస్కర్ , సంక్రాంతికి వస్తు్న్నాం వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.

Meenakshi Chaudhary Photos (Source: Instagram)
ముఖ్యంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ గర్ల్ ఫ్రెండ్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ మూవీ తర్వాత అమ్మడుకు వరసగా అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తుంది.

Meenakshi Chaudhary Photos (Source: Instagram)
దీంతో ప్రస్తుతం ఈ చిన్నది వరసగా సినిమాలు చేస్తూ, ఫుల్ బిజీ అయిపోయింది. ప్రస్తుతం నాగచైతన్య సరసన పాన్ ఇండియా చిత్రంలో నటిస్తుంది. ఇచ్చట విరూపాక్ష ఫేం కార్తిక్ వర్మ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న వృషకర్మ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది.

Meenakshi Chaudhary Photos (Source: Instagram)
దీనితో పాటు నవీన్ పోలిశెట్టి అనగనగ ఒక రాజు చిత్రంలోనూ హీరోయిన్గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ రెండు సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్న మీనాక్షి మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.

Meenakshi Chaudhary Photos (Source: Instagram)
తాజాగా ఈ భామ గ్రీన్ ఎథినిక్ వేర్ డ్రెస్‌లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అచ్చ తెలుగు అమ్మాయిల క్యూట్ స్మైల్‌తో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.