E-Paper
Advertisement

Lemon Water: రక్తపోటు తగ్గడానికి నిమ్మరసం నిజంగా పనిచేస్తుందా? సైన్స్ ఏం చెబుతోంది ?

Lemon Water: రక్తపోటు తగ్గడానికి నిమ్మరసం నిజంగా పనిచేస్తుందా? సైన్స్ ఏం చెబుతోంది ?
Advertisement

Lemon Water: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో హైబీపీ అనేది సాధారణ సమస్యగా మారింది. చాలా మంది దీనిని సహజ పద్ధతుల్లో తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. వీటి వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇదిలా ఉంటే లైఫ్ స్టైల్ మార్పుల వల్ల కూడా హైబీపీ సమస్య నుంచి బయటపడొచ్చు. ఇదిలా ఉంటే లెమన్ జ్యూస్ తాగడం వల్ల కూడా హైబీపీ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

నిమ్మరసం రక్తపోటును ఎలా ప్రభావితం చేస్తుంది ?

కార్డియాలజిస్టుల అభిప్రాయం ప్రకారం.. నిమ్మరసం నేరుగా రక్తపోటును తగ్గించకపోయినా.. శరీరంలోని కొన్ని వ్యవస్థలను మెరుగు పరచడం ద్వారా బీపీ నియంత్రణకు సహకరిస్తుంది.

Advertisement

విటమిన్ C పుష్కలం:

నిమ్మకాయలో విటమిన్ C అధికంగా ఉంటుంది. ఇది ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది రక్త నాళాల్లోని వాపును తగ్గింస్తుంది. దీని వల్ల రక్త ప్రసరణ సాఫీగా సాగి రక్తపోటు తగ్గే అవకాశం ఉంటుంది.

పొటాషియం :

నిమ్మకాయలో ఉండే పొటాషియం శరీరంలోని సోడియం (ఉప్పు) ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఉప్పు రక్తపోటును పెంచుతుందనే విషయం మనకు తెలిసిందే. పొటాషియం రక్తనాళాల గోడలను సడలించడం ద్వారా బీపీని నియంత్రిస్తుంది.

డీహైడ్రేషన్ నివారణ:

శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు రక్తనాళాలు కుంచించుకుపోతాయి. దీని వల్ల రక్తపోటు పెరుగుతుంది. లెమన్ జ్యూస్ తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. ఇది పరోక్షంగా బీపీని అదుపులో ఉంచుతుంది.

శాస్త్రీయ అధ్యయనాలు ఏం చెబుతున్నాయి ?

కొన్ని పరిశోధనల ప్రకారం.. ప్రతి రోజూ నిమ్మరసం తాగుతూ.. క్రమం తప్పకుండా వాకింగ్ చేసే వారిలో సిస్టోలిక్ రక్తపోటు.. తగ్గు ముఖం పట్టినట్లు తేలింది. నిమ్మకాయలో ఉండే ‘ఫ్లేవనాయిడ్స్’ గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

కార్డియాలజిస్టుల సలహా.. ఇది మందులకు ప్రత్యామ్నాయమా ?

నిపుణులు ఇచ్చే అతి ముఖ్యమైన సూచన ఏమిటంటే.. నిమ్మరసం అనేది కేవలం ఒక సహాయకారి మాత్రమే.. ఇది మందులకు ప్రత్యామ్నాయం కాదు.

మందులు ఆపకూడదు:

మీకు ఇప్పటికే అధిక రక్తపోటు ఉండి.. డాక్టర్లు మందులు సూచించినట్లయితే.. నిమ్మరసం తాగుతున్నాం కదా అని మందులను ఆపకూడదు.

అదనపు ఉప్పు వద్దు: నిమ్మరసం తాగేటప్పుడు.. అందులో ఉప్పు కలపడం వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ. హైబీపీ రోగులు కేవలం నిమ్మరసం, నీటిని మాత్రమే తీసుకోవాలి.

యాసిడ్ రిఫ్లక్స్: గ్యాస్ట్రిక్ సమస్యలు లేదా అసిడిటీ ఉన్నవారు ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగే ముందు జాగ్రత్త వహించాలి.

Also Read: కొరియన్ల లాగా స్లిమ్‌గా మారాలా ? బెల్లీ ఫ్యాట్ తగ్గించే 7 అద్భుతమైన మార్గాలు

రక్తపోటు తగ్గడానికి ఇతర మార్గాలు:

కేవలం నిమ్మరసం మీదనే ఆధారపడకుండా, కార్డియాలజిస్టులు సూచించే ఈ పద్ధతులను కూడా పాటించాలి.

రోజూ కనీసం 30 నిమిషాల వ్యాయామం.

ఆహారంలో ఉప్పు పరిమాణాన్ని తగ్గించడం (DASH డైట్).

ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా లేదా ధ్యానం చేయడం.

తాజా పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం.

నిమ్మరసం కలిపిన నీరు ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్‌లో ఒక భాగం మాత్రమే. ఇది గుండె ఆరోగ్యానికి, రక్తనాళాల పని తీరుకు మేలు చేస్తుంది. అయితే.. బీపీ తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా డాక్టర్లను సంప్రదించి, సరైన చికిత్స తీసుకోవడం ఉత్తమం. 

Related News

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

ఒక్క పన్ను పీకడానికి రూ.2.25 లక్షలా.. అదే ఇండియాలో అయితే?

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

తగ్గేదెలే.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆత్మగౌరవం విషయంలో అసలు రాజీపడరు

స్కూల్‌కు వెళ్లే సమయం అయినా పిల్లలు నిద్రలేవడం లేదా? ఈ 5 టిప్స్‌తో మార్నింగ్ రొటీన్ మార్చండి

గుండెపోటు ముప్పును 30 శాతం తగ్గించగల పిల్.. తాజా అధ్యయనంలో అద్భుత ఫలితాలు

వర్షాకాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఈ పుడ్స్

రక్తంలో చక్కెర పెరగకుండా ఉండాలంటే ఆపిల్ తినాలా? పియర్ తినాలా?

Big Stories

Advertisement
×