E-Paper
Advertisement

Ginger For Migraine: మైగ్రేన్‌తో ఇబ్బంది పడుతున్నారా ? అల్లం ఇలా వాడితే క్షణాల్లోనే ప్రాబ్లమ్ సాల్వ్

Ginger For Migraine: మైగ్రేన్‌తో ఇబ్బంది పడుతున్నారా ? అల్లం ఇలా వాడితే క్షణాల్లోనే ప్రాబ్లమ్ సాల్వ్
Advertisement

Ginger For Migraine: ప్రస్తుతం చాలా మంది మైగ్రేన్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి వెంటనే పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. వీటి అవసరం లేకుండా వంటింట్లో దొరికే అల్లం ఈ సమస్యకు శక్తివంతమైన సహజ సిద్ధమైన పరిష్కారం అని అనేక పరిశోధనల్లో రుజువైంది. ఇంతకీ అల్లం మైగ్రేన్ తగ్గడానికి ఎలా ఉపయోగపడుతుంది. దీని వల్ల కలిగే ఇతర ప్రయోజనాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పరిశోధనలు ఏం చెబుతున్నాయి ?
అల్లం ఆహార పదార్థాల రుచిని పెంచడం కోసం మాత్రమే ఉపయోగపడదు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మైగ్రేన్ నివారణలో అల్లం చాలా బాగా ఉపయోగపడుతుంది. తాజా అధ్యయనం ప్రకారం.. మైగ్రేన్ కోసం వాడే సుమట్రిప్టాన్ అనే మందులతో సమానంగా అల్లం పొడి పని చేస్తుందని తేలింది. చాలా మందిలో ఇది అల్లోపతి మందుల కంటే వేగంగా కూడా ఎలాంటి తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మైగ్రేన్ తగ్గిస్తుంది.

Advertisement

అల్లం ఎలా పనిచేస్తుంది ?

అల్లం మైగ్రేన్ తగ్గించడంలో చాలా బాగా ఉపయోగ పడటానికి కారణం అందులో ఉండే జింజెరోల్స్, ఫోగోల్స్ అనే సమ్మేళనాలు . అల్లంలో ఉండే వాపును తగ్గించే గుణాలు కూడా మొదడులో రక్తనాళాల వల్ల కలిగే వాపును తగ్గిస్తాయి.

Advertisement

రక్త ప్రసరణ: అల్లం రక్త నాళాలను శాంతింప చేసి రక్త ప్రసరణ కూడా సజావుగా సాగేలా చేస్తుంది. అంతే కాకుండా దీని వల్ల తల ప్రాంతంలో కలిగే ఒత్తిడి కూడా తగ్గుతుంది.

సెరోటోనిన్: అల్లం మెదడులోని సెరోటోనిన్ అనే రసాయనాన్ని ప్రభావితం చేస్తుంది. అంతే కాకుండా ఇది తలనొప్పితో సిగ్నల్స్ అడ్డుకోవడంలో కూడా చాలా బాగా ఉపయోగ పడుతుంది.

అల్లం ప్రభావం కూడా మనకు పూర్తిగా లభించాలంటే దీనిని తీసుకునే సమయం కూడా చాలా ముఖ్యం. తలనొప్పి తీవ్రత పెరిగినప్పుడు కాకుండా మొదలైన సమయంలో అల్లం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతే కాకుండా మైగ్రేన్ బాధితులు తమకు నొప్పి రాబోతోందని ముందుగానే గుర్తిస్తారు. ఆ సమయంలోనే అల్లం తీసుకుంటే మాత్రం నొప్పి తీవ్రత పెరగకుండా కూడా అడ్డుకోవచ్చు.

ఎలా ఉపయోగించాలి ?

మైగ్రేన్ తగ్గడానికి అల్లం వివిధ రూపాల్లో తీసుకోవచ్చు.

అల్లం టీ: తాజా అల్లం ముక్కలను నీటిలో మరిగించి కొద్దిగా నిమ్మరసం అంతే కాకుండా టీ స్పూన్ తేనె కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. నొప్పి తక్కువ సమయంలోనే తగ్గుతుంది.

అల్లం నీరు: గోరు వెచ్చటి నీటిలో అల్లం రసం లేదా పొడి కలిపి వాడటం వల్ల తక్షణ ఉపశమనం లభిస్తుంది.

నిత్యం తినే ఆహార పదార్థాల్లో కూడా అల్లం ఎక్కువగా వాడటం మంచిది.

డాక్టర్ సలహా మేరకు కూడా వివిధ రకాలుగా అల్లం క్యాప్యూల్స్ లేదా పొడి కూడా వాడొచ్చు.

Also Read: ఆరోగ్యకరమైన డైట్ అంటే అన్నం మానేయడమేనా ? నిపుణులు ఏం చెబుతున్నాంటే ?

ఇదిలా ఉంటే సాధారణ పెయిన్ కిల్లర్స్ తరచుగా వాడటం వల్ల కడుపులో మంట, ఎసిడిటీ అంతే కాకుండా జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. కానీ అల్లం దీనికి విరుద్దం. ఇది కేవలం నొప్పిని తగ్గించడం మాత్రమే కాకుండా జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది అంతే కాకుండా మైగ్రేన్ సమయంలో వచ్చే వాంతులు, వికారం వంటి సమస్యలను తగ్గించడంలో కూడా మెరుగైన సహజ ఔషధం మరొకటి లేదు.

మన వంటింట్లో ఉండే చిన్న అల్లం ముక్కకు అద్భుతమైన శక్తి కూడా ఉంది. సహజమైన పద్దతిలో ఆరోగ్యాన్ని కాపాడు కోవాలనుకునే వారికి అల్లం గొప్ప వరం. కొన్ని సార్లు మనం వెతికుతున్న సంక్లిష్టమైన సమస్యలకు పరిష్కారం మన కళ్ల ముందే ప్రకృతిలో ఉంటుంది.

Related News

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

Big Stories

Advertisement
×