E-Paper
Advertisement

Diet Tips: ఆరోగ్యకరమైన డైట్ అంటే అన్నం మానేయడమేనా ? నిపుణులు ఏం చెబుతున్నాంటే ?

Diet Tips: ఆరోగ్యకరమైన డైట్ అంటే అన్నం మానేయడమేనా ? నిపుణులు ఏం చెబుతున్నాంటే ?
Advertisement

Diet Tips: ఆరోగ్యంగా ఉండటం కోసం పోషకాలు ఉన్న ఆహారాన్ని తినడం చాలా అవసరం. శరీరానికి అత్యంత అవసరమైన పోషకాలను సులభంగా అందించే ఆహార పదార్థాల పరిమాణాన్ని మన ఆహారంలో పెంచాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినే వ్యక్తులకు ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు, బలహీనత వంటి సమస్యలు వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని తేలింది. అయితే.. ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకునే అలవాటు ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. ప్రతి ఒక్కరూ దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి.

మీ భోజనంలో తగినంత మొత్తంలో ప్రోటీన్, విటమిన్లు, కార్బో హైడ్రేట్లు ఉండాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కండరాలను బలోపేతం చేయడంలో.. కణాలను మరమ్మతు చేయడంలో అంతే కాకుండా ఆరోగ్య కరమైన రోగ నిరోధక శక్తిని నిర్వ హించడంలో ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. కళ్ళు, గుండె, కాలేయం, ఎముకల నుంచి ప్రతి దానికీ వివిధ విటమిన్లు అవసరం. కానీ మనం తీసుకునే ఆహారంలో కార్బో హైడ్రేట్లు మాత్రమే ఎక్కువగా ఉంటే ఏం జరుగుతుంది ? బియ్యం వంటి కార్బో హైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాలు తినడం ఆరోగ్యకరమా ? అనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

రైస్ తినడం ఆరోగ్యకరమా ?

రైస్‌ కార్బో హైడ్రేట్లకు ప్రధాన వనరు. అన్నం తినడం వల్ల శరీరానికి కేలరీలు లభిస్తాయి. ఇది అలసటను తగ్గించడంలో సహాయ పడుతుంది. అంతే కాకుండా రోజంతా పని చేసే సామర్థ్యాన్ని నిర్వహిస్తుంది. బియ్యంలో తక్కువ మొత్తంలో ప్రోటీన్, విటమిన్ బి కాంప్లెక్స్ , ఖనిజాలు కూడా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన జీవ క్రియను నిర్వహించడానికి సహాయ పడతాయి. కానీ దీనిని ఎక్కువగా తీసు కోవడం అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Advertisement

రైస్  తినడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి ?

తెల్ల బియ్యంలో ఫైబర్ తక్కువగా ఉంటుందని.. గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంటే ఇది రక్తంలో చక్కెరను వేగంగా పెంచుతుంది. తెల్ల బియ్యం ఎక్కువగా తినడం వల్ల టైప్- 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇంకా..తరచుగా అన్నం తినడం వల్ల వీటిలో కేలరీలు ఎక్కువగా ఉండటం వల్ల త్వరగా బరువు పెరుగుతారు. కొన్ని అధ్యయనాలు కూడా అన్నం ఎక్కువగా తినడం వల్ల బెల్లీ ఫ్యాట్ పెరుగుతుందని కనుగొన్నాయి. ప్రోటీన్, ఫైబర్ కార్బోహైడ్రేట్లతో కలిపి తీసుకోకపోతే.. అది పోషకాహార లోపాలకు కూడా కారణం అవుతుంది.

Also Read: బొప్పాయిని ఉదయాన్నే ఎందుకు తినాలి ? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు ?

అన్నం వదులుకోవాలా ?
బరువు తగ్గడానికి లేదా షుగర్ కంట్రోల్ అవడానికి అన్నం తినకూడదని చాలా మంది భావిస్తారు. కానీ నిపుణులు ఇది అవసరం లేదని అంటున్నారు. బ్రౌన్ రైస్ తెల్ల బియ్యం కంటే చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే ఇందులో ఎక్కువ ఫైబర్ , పోషకాలు ఉంటాయి. మితంగా తీసుకుంటే.. రైస్ హానికరం కాదు. అంతే కాకుండా దీని వల్ల బరువు పెరిగే అవకాశాలు కూడా చాలా తక్కువ.

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×