E-Paper
Advertisement

నోట్లో వేస్తే కరిగిపోయే గోధుమ హల్వా..ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా!

నోట్లో వేస్తే కరిగిపోయే గోధుమ హల్వా..ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా!
Advertisement

Godhuma halwa recipe: ఇండియన్ వంటకాల్లో..ముఖ్యంగా స్వీట్లలో ‘గోధుమ హల్వా’కు ఉండే క్రేజే వేరు. గోధుమ హల్వా పేరు వింటేనే నోట్లో నీళ్లు ఊరతాయి. పెళ్లిళ్లు, బారసాలలు, పండగలు వంటి ఏ వేడుకలోనైనా ఈ స్వీట్ ఉంటే.. ఆ సందడే వేరుగా ఉంటుంది. చాలా మంది ఈ హల్వాను చేయడం చాలా కష్టమని భావిస్తుంటారు. కానీ కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే.. ఇంట్లోనే ఎంతో ఈజీగా, అచ్చం హోటల్ స్టైల్‌లో.. ఈ అద్భుతమైన స్వీట్‌ను తయారు చేసుకోవచ్చు. గోధుమ హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు, దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం!

కావాల్సిన పదార్థాలు :

గోధుమలు: 1 కప్పు

Advertisement

చక్కెర: 1.5 నుంచి 2 కప్పులు

నెయ్యి : 1 కప్పు

Advertisement

జీడిపప్పు & కిస్మిస్: గుప్పెడు

యాలకుల పొడి: అర టీస్పూన్

ఫుడ్ కలర్ : చిటికెడు

తయారీ విధానం:

1. ముందుగా నానబెట్టిన గోధుమలను మిక్సీ జార్‌లో వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పలుచని.. కాటన్ వస్త్రం లేదా స్టైనర్ సహాయంతో ఆ మిశ్రమాన్ని వడకట్టి ‘గోధుమ పాలు’ వేరు చేసుకోవాలి. ఈ పాలను కొన్ని గంటలు పక్కన పెడితే అడుగున తెల్లటి చిక్కటి పదార్థం పేరుకుంటుంది.పైన ఉన్న నీటిని వంపేయాలి.తర్వాత ఒక గిన్నెలో కొద్దిగా నీరు, పంచదార వేసి పంచదార కరిగేలా చేసుకోవాలి. తీగ పాకం రానవసరం లేదు, పంచదార పూర్తిగా కరిగి నీరు కొద్దిగా చిక్కబడితే సరి పోతుంది.

Also Read: గుమగుమలాడే గుత్తి వంకాయ కూర..అన్నం,చపాతీలోకి అద్దిరిపోయే టేస్ట్!

2.మందపాటి కడాయిని స్టవ్‌పై పెట్టి, సిద్ధం చేసుకున్న గోధుమ పాలు, పంచదార పాకం కలపాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచుతూ గరిటెతో నిరంతరం కలుపుతూ ఉండాలి. లేదంటే ..అడుగు అంటుకునే అవకాశం ఉంది.మిశ్రమం కొద్దిగా చిక్కబడిన తర్వాత, మధ్యమధ్యలో కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తూ బాగా కలపాలి. నెయ్యిని పీల్చుకుంటూ హల్వా రంగు మారుతుంది. హల్వా పాన్‌కు అంటకుండా, చుట్టూ నెయ్యి వదిలే ..స్టేజ్‌కి వచ్చినప్పుడు యాలకుల పొడి, నెయ్యిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసి బాగా కలపాలి. అంతే..గుమగుమలాడే కమ్మని గోధుమ హల్వా రెడీ!

ఇంట్లో ఏదైనా ప్రత్యేక సందర్భం ఉన్నప్పుడు లేదా ఎప్పుడైనా తియ్యగా తినాలనిపించినప్పుడు ఈ ట్రెండీ గోధుమ హల్వాను ట్రై చేయండి. వేడి వేడిగా.. ఈ హల్వా తింటుంటే ఆ రుచి నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరూ ఈ రెసిపీని ట్రై చేసి మీ కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేయండి.

Related News

గుమగుమలాడే గుత్తి వంకాయ కూర..అన్నం,చపాతీలోకి అద్దిరిపోయే టేస్ట్!

మొబైల్ చూస్తుంటే కళ్లలో మంట, దురద, ఎర్రబడ్డాయా? దీని వెనుక కారణాలు ఇవే

మీ తప్పు లేకపోయినా సారీ చెబుతున్నారా.. ప్రతి విషయంలో మీరే తగ్గితే వచ్చే సమస్యలు ఇవే

రాత్రంతా ఇయర్‌బడ్స్ పెట్టుకుని నిద్రపోతున్నారా? చెవులకు జరిగే నష్టాలివే

తరచూ ఫిట్స్ వస్తున్నాయా? మూర్ఛ వ్యాధిని నియంత్రించడానికి డాక్టర్ సూచనలు

ప్రపంచంలో ఏ అధ్యక్షుడికి లేని రాజభోగాలు.. కిమ్ ఆస్తులు, విలాసాల చిట్టా ఇదే!

నాన్నమ్మల కాలం నాటి గోంగూర నిల్వ పచ్చడి రెసిపీ..ఎప్పుడు చేసినా కిరాక్ రుచి!

Big Stories

Advertisement
×