E-Paper
Advertisement

ఒక్కటి కాదు.. ఏకంగా 8 సినిమాలు! జంధ్యాలతో నరేష్ జర్నీమామూలుది కాదుగా !

ఒక్కటి కాదు.. ఏకంగా 8 సినిమాలు! జంధ్యాలతో నరేష్ జర్నీమామూలుది కాదుగా !
Advertisement

Naresh:సీనియర్ నటుడు నరేష్ తన జీవితంలో జరిగిన పలు ఆసక్తికరమైన విశేషాలని ఒక ఇంటర్వ్యూలో ఇలా బయటపెట్టాడు.ముఖ్యంగా హీరో కావాలన్న తన కలకు కృష్ణ ఎలా సపోర్ట్ చేశారు? తనను హీరోగా ఇంట్రొడ్యూస్ చేసే సమయంలో విజయనిర్మల ఏమన్నారు? దీంతోపాటు తన కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమాలు, జంధ్యాలతో అనుబంధం, అలాగే ప్రస్తుతం మారుతున్న సినిమా ఇండస్ట్రీ పై తన అభిప్రాయాన్ని ఇలా చెప్పుకొచ్చారు.

హీరో కావాలనుకున్నప్పుడు నిరాశ..

Advertisement

తన కెరీర్ ప్రారంభంలో ‘సీతాకోకచిలుక’ అవకాశం విషయంలో తనకు డిసప్పాయింట్ ఎదురైందని,తన ప్లేస్ లో మరో వ్యక్తిని తీసుకోబోతున్నారని తెలిసి చాలాబాధపడ్డానని గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో తన పరిస్థితిని గమనించిన కృష్ణ..వెంటనే స్పందించి రాజేంద్రకుమార్‌కు ఫోన్ చేసి మాట్లాడేందుకు ప్రయత్నించారని గుర్తుచేసుకున్నారు.ఇప్పటిలా మొబైల్ ఫోన్లు లేని రోజుల్లో ట్రంక్ కాల్స్, లైట్నింగ్ కాల్స్ బుక్ చేసుకుని మాట్లాడాల్సి వచ్చేది. అలాంటి సమయంలో తన కోసం కృష్ణ అంత శ్రమించడాన్నిప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు.

కొడుకును హీరోగా పరిచయం చేయని విజయనిర్మల

Advertisement

అయితే తన తల్లి విజయనిర్మల తన కుమారుడిని తానే హీరోగా పరిచయం చేయాలని కాకుండా ఇతరుల ద్వారానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలని కోరుకున్నారని తెలిపారు.ఇక తనకు హీరోగా ఛాన్స్ ఇచ్చినవారికి ఆమె కృతజ్ఞతలు తెలిపిన విషయాన్ని కూడా నరేష్ గుర్తుచేసుకున్నారు.

‘ప్రేమ సంకెళ్లు’తో లవర్‌బాయ్ ఇమేజ్!

ఇక తన కెరీర్‌లో ‘ప్రేమ సంకెళ్లు’ సినిమాకు కూడా ప్రత్యేకమైన స్థానం ఉందని ఈ సినిమా తనకు లవర్‌బాయ్ తరహా గుర్తింపు తెచ్చిందని చెప్పారు. ఈ సందర్భంగా సినిమాలోని సుందరరామమూర్తి రాసిన పాటలు, రమేష్ నాయుడు అందించిన సంగీతాన్ని గుర్తుచేసుకున్నారు. అప్పట్లో సంగీత దర్శకులు తమదైన శైలిలో సరికొత్త ట్యూన్స్ ఇచ్చేందుకు కష్టపడేవారని ముఖ్యంగా ‘దేవదాస్’, ‘మేఘసందేశం’ వంటి సినిమాల్లోని సంగీతాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

జంధ్యాల దర్శకత్వంలో ఎనిమిది సినిమాలు!

మరీ ముఖ్యంగా తన నరేష్ కెరీర్‌లో జంధ్యాలతో ఉన్న అనుబంధం ప్రత్యేకమైనదని ‘నాలుగు స్తంభాలాట’, ‘రెండు జెళ్ల సీత’, ‘శ్రీవారికి ప్రేమలేఖ’, ‘మొగుడు పెళ్లాలు’, ‘చూపులు కలిసిన శుభవేళ’, ‘బావా బావా పన్నీరు’ అంటూ మొత్తంగా ఎనిమిది సినిమాలను ఆయన దర్శకత్వంలో చేయడం మర్చిపోలేని అనుభవమని ఆనాటి రోజులని గుర్తు చేసుకున్నారు.
అలా జంధ్యాల తర్వాత ఈవీవీ సత్యనారాయణ వంటి దర్శకులతో కలిసి పనిచేయడం తన కెరీర్‌లో మరో టర్నింగ్ పాయింట్ అని చెప్పారు. ఇక ‘జంబలకడిపంబ’ వంటి సినిమాలను గుర్తుచేస్తూ, అప్పట్లో కొత్తగా అనిపించిన కథలు ప్రేక్షకులను ఎలా ఆకట్టుకున్నాయో వివరించారు.

55 ఏళ్ల నటనా ప్రయాణం.. ఇప్పటికీ కొత్తగా నేర్చుకోవాల్సిందే!

దాదాపు 55 ఏళ్ల నటనా ప్రయాణంలో ఎంతో మంది దర్శకులతో కలిసి పనిచేసిన అనుభవాన్ని నరేష్ పంచుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు మార్పులు వస్తుంటాయని, నటులు కూడా వాటికి తగ్గట్టుగా మారాలని చెప్పారు.సినిమా ఒక ప్రవహించే నదిలాంటిదని పాత నీరు వెళ్లిపోతూ కొత్త నీరు వస్తున్నట్లే, ఇండస్ట్రీలో కూడా కొత్త దర్శకులు, కొత్త కథలు, కొత్త ఆలోచనలు వస్తుంటాయని వివరించారు.

ALSO READ :స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చా.. కానీ సక్సెస్ అంత ఈజీ కాదు!

Tags

Related News

సన్‌ఫ్లవర్‌లా మారాలంటున్న రితికా నాయక్.. అసలు మ్యాటర్ ఏంటంటే!

కొత్త బంగారులోకం 2 పై వరుణ్ సందేశ్ బిగ్ అప్డేట్.. సీక్వెల్ సినిమా రాబోతోందా?

స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చా.. కానీ సక్సెస్ అంత ఈజీ కాదు!

ప్లీజ్ సినిమా టికెట్ల రేట్లు పెంచొద్దు.. ప్రభుత్వాలను వేడుకున్న నిర్మాత!

పెద్ద సినిమాలదే పెత్తనమా? చిన్న సినిమాల గోడు పట్టదా?

అవును నేను పెళ్లి చేసుకుంటున్నాను.. పెళ్లి వార్తలపై తేజ సజ్జ క్లారిటీ!

గురూజీ మార్క్ కనిపించడం లేదే.. ఆదర్శ కుటుంబం విషయంలో ఏమైంది?

Big Stories

Advertisement
×