E-Paper
Advertisement

పేదరికంలో బతికే వ్యక్తికి భవిష్యత్తు ముందే తెలిసే వరం… రాత్రికి రాత్రే రచ్చ… తెలుగు సిరీస్ స్ట్రీమింగ్ షురూ

పేదరికంలో బతికే వ్యక్తికి భవిష్యత్తు ముందే తెలిసే వరం… రాత్రికి రాత్రే రచ్చ… తెలుగు సిరీస్ స్ట్రీమింగ్ షురూ
Advertisement

Supernatural Thriller Series: రేపు ఏం జరుగుతుందో ముందే తెలిస్తే జీవితం ఎంత సులభంగా మారిపోతుందో కదా. డబ్బు సంపాదించొచ్చు, కష్టాలను ముందే గుర్తించి తప్పించుకోవచ్చు.. మనకు ఎదురయ్యే సమస్యలకు ముందుగానే పరిష్కారం వెతుక్కోవచ్చు. కానీ భవిష్యత్తు గురించి తెలిసే శక్తి చేతిలో ఉంటే దాన్ని ఎప్పుడూ మంచికే ఉపయోగించగలమా ? అదే శక్తి మన జీవితాన్ని ప్రమాదంలోకి నెడితే పరిస్థితి ఏంటి ? ఇలాంటి ఆసక్తికరమైన ఆలోచనతో రూపొందిన సిరీస్ ‘వరం’ (Varam ). ఓ సాధారణ వ్యక్తికి దక్కిన అసాధారణ శక్తి అతడి జీవితాన్ని ఎలా మార్చిందనేదే ఇందులో ప్రధాన అంశం. ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన సిరీస్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? అంటే…

కథలోకి వెళ్తే…

పేదరికంలో జీవించే ఓ వ్యక్తి తన జీవితాన్ని మార్చుకోవాలని కలలు కంటుంటాడు. రోజువారీ అవసరాలు తీర్చుకోవడానికి కూడా కష్టపడాల్సిన పరిస్థితి అతడిది. డబ్బు సమస్యలు, జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులు అతడిని నిరంతరం వెంటాడుతుంటాయి. ఎప్పుడు మంచి రోజులు వస్తాయో తెలియని పరిస్థితుల్లో బతుకుతున్న అతడి జీవితంలో అనుకోని సంఘటన జరుగుతుంది. మరుసటి రోజు వార్తల్లో ఏం రాబోతోందో ముందుగానే తెలుసుకునే శక్తి అతడికి లభిస్తుంది.

Advertisement

మొదట ఈ శక్తి అతడికి ఓ వరంలా కనిపిస్తుంది. భవిష్యత్తులో జరగబోయే విషయాలను ముందే తెలుసుకోవడం ద్వారా తన జీవితాన్ని మార్చుకోవచ్చని భావిస్తాడు. సాధారణంగా ఇతరులకు తెలియని సమాచారాన్ని ఉపయోగించుకుని డబ్బు సంపాదించాలని, పేదరికం నుంచి బయటపడాలని ప్రయత్నిస్తాడు. అతడి ప్రయత్నాలు ఫలించడంతో జీవితంలో మార్పులు మొదలవుతాయి. ఇన్నాళ్లూ తనను వెంటాడిన సమస్యలకు పరిష్కారం దొరుకుతున్నట్లు అనిపిస్తుంది.

అయితే భవిష్యత్తు గురించి ముందే తెలుసుకోవడం వల్ల అన్ని సమస్యలూ తీరిపోవు. ఒక విషయం తెలుసుకున్న తర్వాత దాని ఆధారంగా తీసుకునే నిర్ణయాలు మరో సమస్యకు కారణం కావచ్చు. తనకు తెలిసిన సమాచారంతో ఇతరుల జీవితాల్లో జోక్యం చేసుకోవాల్సి వచ్చినప్పుడు పరిస్థితులు మరింత కష్టంగా మారతాయి. రాత్రికి రాత్రే జీవితంలో ఎదగాలనే ఆశతో అతడు ఈ శక్తిని ఎక్కువగా ఉపయోగించుకుంటున్న కొద్దీ దాని వెనుక ఉన్న ప్రమాదాలు బయటపడతాయి.

Advertisement

తనకు దక్కిన శక్తిని ఎక్కడ ఆపాలిv? భవిష్యత్తును మార్చడానికి ప్రయత్నిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి ? మొదట వరంలా కనిపించిన ఈ శక్తి చివరకు శాపంగా మారుతుందా ? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సిరీస్ పై ఒక లుక్కేయాల్సిందే.

ఓటీటీలో తెలుగు స్ట్రీమింగ్ ?

‘వరం’ (Varam) అనే టైటిల్ తో రూపొందిన ఈ తెలుగు సిరీస్ అక్టోబర్ 22న విడుదల అయ్యింది. ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌ (JioHotstar)లో స్ట్రీమింగ్‌కు అందుబాటు ఉంది. ప్రస్తుతం మొదటి రెండు ఎపిసోడ్లు విడుదలయ్యాయి. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ భాషల్లో ఆడియో అందుబాటులో ఉంది. భవిష్యత్తులో ఏం జరగబోతోందో ముందే తెలుసుకునే శక్తి ఒక సాధారణ వ్యక్తి జీవితాన్ని ఎలా మార్చేస్తుందో చూడాలనుకునే వారికి ఈ సూపర్‌ నేచురల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ఖచ్చితంగా నచ్చుతుంది. కాబట్టి ఈ వీకెండ్ ఒక లుక్కేయండి.

Read Also: డేంజరస్ యాక్షన్ థ్రిల్లర్… ఈసారి రక్తపాతమే… ఓటీటీలోకి మోస్ట్ అవైటెడ్ సిరీస్

Tags

Related News

భార్య మిస్సయ్యిందని వెళ్తే పోలీసులకే దిమ్మతిరిగే షాక్… 18 ఏళ్ల తర్వాత వరుణ్ సందేశ్ – శ్వేత బసు జంటగా నటించిన సిరీస్ స్ట్రీమింగ్

రామాయణ సినిమాకు హాట్ స్టార్ బిగ్ షాక్.. ఇంట్లో చూడాలన్న డబ్బులు కట్టాల్సిందే?

థియేటర్లలో 170 కోట్లు కొల్లగొట్టిన నాని ఊచకోత… ఐదు భాషల్లో ఓటీటీలోకి

ఆ ఇంట్లో చిక్కుకుంటే ప్రాణాలు దక్కవు… ఒళ్లు గగుర్పొడిచే సర్వైవల్ థ్రిల్లర్

కూతురి జాడ వెతికితే షాకింగ్ ట్విస్ట్… మైండ్ బ్లాక్ చేసే మర్డర్ మిస్టరీ

బోల్డ్ అవతార్ లో కీర్తి సురేష్.. రాధిక ఇంటెన్స్ పర్ఫార్మెన్స్.. ‘అక్క’ ట్రైలర్ రిలీజ్!

డేంజరస్ యాక్షన్ థ్రిల్లర్… ఈసారి రక్తపాతమే… ఓటీటీలోకి మోస్ట్ అవైటెడ్ సిరీస్

Big Stories

Advertisement
×