E-Paper
Advertisement

Grapes on New year: న్యూ ఇయర్‌లో ద్రాక్ష పండ్లకు భలే డిమాండ్ ? ఆ దేశంలో ఏకంగా ప్లేట్లు పగలగొట్టి సెలబ్రేషన్స్!

Grapes on New year: న్యూ ఇయర్‌లో ద్రాక్ష పండ్లకు భలే డిమాండ్ ? ఆ దేశంలో ఏకంగా ప్లేట్లు పగలగొట్టి సెలబ్రేషన్స్!
Advertisement

Grapes on New year: ప్రపంచ వ్యాప్తంగా కొత్త సంవత్సరాన్ని అనేక రకాలుగా జరుపుకుంటారు. కొన్ని రకాల ఆచారాలు, వింత నమ్మకాలు కూడా ఈ సమయంలో ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇదిలా ఉంటే గత ఏడాది అంటే 2025లో మనదేశంలో వివిధ డెలివరీ యాప్లలో డిసెంబర్ 31 సాయంత్రం నాటికి నల్ల ద్రాక్షలు హాల్ కేకుల్లా అమ్ముడయ్యాయి. దీనికి కారణం 12 ద్రాక్ష పండ్లను అర్థ రాత్రి తినే విదేశీ సంప్రదాయాన్ని మన దగ్గర కూడా ఫాలో అవ్వడమే.. కేవలం ద్రాక్ష పండ్లే కాదు ప్రపంచ వ్యాప్తంగ అదృష్టం కలసి రావడం కోసం న్యూ ఇయర్ రోజు పాటించే ఆచారాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

1.12 ద్రాక్ష పండ్లుస్పెయిన్:

స్పెయిన్‌లో అర్థరాత్రి 12 గంటలు కొట్టే లోపు ప్రతి గంటకు ఒకటి చొప్పున 12 ద్రాక్ష పండ్లను తింటారు. ఒక్కో పండు రాబోయే ఏడాదిలో ఒక్కో నెలకు ప్రతీక అని నమ్ముతారు. ఇలా చేయడం వల్ల ఏడాది పొడవునా అదృష్టం వరిస్తుందని నమ్ముతారు. ఇదిలా ఉంటే 19వ శతాబ్దంలో మిగిలిపోయిన ద్రాక్ష దిగుబడిని అమ్ముకోవడానికి ఈ పద్దతి మొదలైందని కానీ ఇది ఇప్పుడు సాంప్రదాయంగా మారిపోయిందని కొందరు చెబుతున్నారు.

Advertisement

2. దానిమ్మ పగలగొట్టడం- గ్రీస్:

దానిమ్మ పండును గ్రీస్ దేశంలో అదృష్టం కోసం ఇంటి గుమ్మం కింద బలంగా నేలకోసి కొడతారు. ఆ తర్వాత పండు పగిలి ఎంత ఎక్కువగా గింజలు బయటపడితే.. ఆ ఇంట్లోకి అంత సంపద, సంతోషం వస్తాయని నమ్ముతారు. గింజల రసం వారిపై పడితే అత్యంత అదృష్టంగా భావిస్తారు.

3. తోషి కోషి నూడుల్స్ – జపాన్ :

నూతన సంవత్సరం సందర్భంగా తోషి కోషి సోబా అనే పొడవైన నూడిల్స్ ను జపాన్ ప్రజలు తప్పకుండా తింటారు. ఎందుకంటే ఇది పొడవాటి జీవితానికి సంకేతంగా వారు భావిస్తారు. నూడిల్స్ ఉన్న గిన్నెను మొత్తం ఖాళీ చేస్తే కొత్త ఏడాది ప్రశాంతంగా మొదలవుతుందని వారు నమ్ముతారు.

4. చుక్కల బట్టలు – ఫిలిప్పీన్స్:

ఫిలిప్పీన్స్ లో న్యూ ఇయర్ రోజు చుక్కల డిజైన్ ఉన్న బట్టలను తప్పకుండా ధరిస్తారు. ఆ చుక్కలు నాణాలను పోలి ఉంటాయి అందుకే వాటిని ధరిస్తే ఇంట్లోకి డబ్బు లభిస్తుందని వారు నమ్ముతారు. అంతే కాకుండా న్యూ ఇయర్ రోజు గుండ్రంగా ఉండే పండ్లను ఇంట్లోని టేబుల్ పై ఉంచుతారు.

Also Read: 1-1-1.. జనవరి 1వ తేదీ అంత మంచిదా ? ఇలా చేస్తే 2026లో అంతా శుభమే!

5. పాత ప్లేట్లను పగలగొట్టడం- డెన్మార్క్:

న్యూ ఇయర్ రోజు డెన్మార్క్ లో వింత ఆచారం పాటిస్తారు. పనికి రాని పాత ప్లేట్లను న్యూ ఇయర్ రోజు రాత్రి స్నేహితులు , బంధువుల ఇంటి తలుపుల దగ్గర పగలగొడతారు. పొద్దున్నే ఎవరి ఇంటి ముందు ఎక్కువ పెంకులు ఉంటే వారికి అంత ఎక్కువ మంది స్నేహితులు ఉన్నారని, వారు సంతోషంగా ఉంటారని నమ్ముతారు.

6. కిటికీలు తెరవడం- ఐర్లాండ్:

న్యూ ఇయర్ రోజు అర్థరాత్రి 12 గంటలు కాగానే ప్రతి ఒక్కరూ ఇంటి తలుపులు, కిటికీలు తెరచి ఉంచుతారు. ఇలా చేయడం వల్ల ఏడాదంతా ఉన్న దురదృష్టం వాటి ద్వారా బయటకు వెళ్లిపోయి.. అదృష్టం లోపలికి వస్తుందని నమ్ముతారు. గాలిని శుద్ది చేయడమే కాకుండా ఆలోచనలను శుద్ది చేసుకోవడానికి ఇది కూడా ఒక సంకేతం.

Related News

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

Big Stories

Advertisement
×