ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరోసారి పీక్ లెవల్ కు చేరుకున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యక్తిగత నివాసమే లక్ష్యంగా ఉక్రెయిన్ భారీ స్థాయిలో డ్రోన్ దాడులకు పాల్పడిందని ఆ దేశ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. నోవ్‌గొరొడ్ ప్రాంతంలోని పుతిన్ నివాసంపై ఏకకాలంలో 91 డ్రోన్లతో ఉక్రెయిన్ దాడికి ప్రయత్నించిందని రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. అయితే, రష్యా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఈ డ్రోన్లన్నింటినీ గాలిలోనే కూల్చివేసి.. భారీ ప్రమాదాన్ని తప్పించాయని తమ దేశ అధికారులు పేర్కొన్నారు.
రష్యా ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తోంది. దీనిని కేవలం సైనిక దాడిగానే కాకుండా.. దేశాధినేత ప్రాణాలకు ముప్పు తలపెట్టే ఉగ్రవాద చర్యగా అభివర్ణించింది. ఈ పరిణామం నేపథ్యంలో అంతర్జాతీయంగా జరుగుతున్న శాంతి చర్చల ప్రక్రియకు విఘాతం కలిగే అవకాశం ఉందని రష్యా హెచ్చరించింది. తాము శాంతి చర్చలపై తమ వైఖరిని పునఃసమీక్షిస్తామని.. అవసరమైతే తగిన రీతిలో ప్రతీకారం తీర్చుకుంటామని రష్యా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ పరిణామం యుద్ధం మరో ప్రమాదకర మలుపు తిరుగుతుందన్న ఆందోళనలను పెంచుతోంది.
మరోవైపు.. రష్యా చేస్తున్న ఈ ఆరోపణలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్రంగా ఖండించారు. ఇవన్నీ రష్యా సృష్టించిన కట్టు కథలని ఆయన కొట్టిపారేశారు. అంతర్జాతీయ సమాజం దృష్టి మళ్లించడానికి.. రాబోయే రోజుల్లో ఉక్రెయిన్‌పై మరిన్ని క్రూరమైన దాడులు చేసేందుకు రష్యా ఈ డ్రామా ఆడుతోందని జెలెన్‌స్కీ విమర్శించారు. తాము కేవలం తమ భూభాగాన్ని రక్షించుకోవడానికే పోరాడుతున్నామని.. ఇటువంటి ఉగ్రవాద చర్యలకు పాల్పడాల్సిన అవసరం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రష్యా గగనతలంలో డ్రోన్లను కూల్చివేస్తున్న దృశ్యాలు అందులో కనిపిస్తున్నాయి. అయితే, ఈ వీడియోల ప్రామాణికతపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య మాటల యుద్ధం ముదురుతుండటంతో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఉద్రిక్తతలు అణ్వాయుధ యుద్ధానికి దారితీయకుండా చూడాలని ఐక్యరాజ్యసమితి మరియు ఇతర దేశాలు కోరుతున్నాయి.
పుతిన్ నివాసంపై దాడి.. వీడియో విడుదల చేసిన రష్యా
రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసమే లక్ష్యంగా ఉక్రెయిన్ 91 డ్రోన్లతో దాడికి యత్నించిందని రష్యా సంచలన ఆరోపణ చేసింది. నోవ్గొరొడ్లోని పుతిన్ వ్యక్తిగత నివాసంపై జరిగిన ఈ దాడిని రష్యా సైన్యం విజయవంతంగా అడ్డుకుంది. దీనిని "ఉగ్రవాద చర్య"గా… pic.twitter.com/HYaPpS2Lsa
— ChotaNews App (@ChotaNewsApp) December 31, 2025