111 Portal 2026: కొత్త సంవత్సరం 2026 మన జీవితాల్లోకి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తిని తీసుకురాబోతోంది. జనవరి 1వ తేదీని న్యూమరాలజిస్టులు ‘111 పోర్టల్’ అని పిలుస్తున్నారు. ఇది కేవలం క్యాలెండర్ మారే రోజు మాత్రమే కాదు, మన కలలను నిజం చేసుకునేందుకు ప్రకృతి తెరిచిన ఒక శక్తివంతమైన ద్వారం లాంటిదని అంటున్నారు. ఈ రోజు మన ఆలోచనలకు, సంకల్పాలకు విశ్వం నుంచి గొప్ప మద్దతు లభిస్తుందని నమ్మకం. ఈ ప్రత్యేకమైన రోజు విశిష్టతను, మన జీవితాన్ని మార్చుకునేందుకు దీనిని ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఏమిటీ 111 పోర్టల్? దీని ప్రాముఖ్యత ఏంటి ?
సంఖ్యాశాస్త్రం (Numerology) ప్రకారం.. అంకెలకు మన జీవితాలను ప్రభావితం చేసే శక్తి ఉంటుంది. ఇంతకీ 2026 జనవరి 1వ తేదీ ఎందుకు ప్రత్యేకం అంటే…
తేదీ: 1
నెల: 1 (జనవరి)
సంవత్సరం: 2026 (దీనిని 2+0+2+6గా కూడితే ’10’ వస్తుంది. 10ని మళ్ళీ 1+0గా కూడితే ‘1’ వస్తుంది).
ఇలా తేదీ, నెల, సంవత్సరం అన్నీ కలిపి 1-1-1 అనే శక్తివంతమైన వరుసను ఏర్పరుస్తాయి. ఆధ్యాత్మికంగా ‘1’ అనే సంఖ్య కొత్త ఆరంభాలకు, ఆత్మవిశ్వాసానికి, సృజనాత్మకతకు సంకేతం. ఇలాంటి అరుదైన అవకాశం కొత్త ఏడాది తొలి రోజే రావడం మన అదృష్టం.
ఈ రోజు ఎందుకు అంత శక్తివంతమైంది ?
ఆధ్యాత్మిక వేత్తల ప్రకారం కూడా.. ‘111 పోర్టల్’ తెరుచుకున్నప్పుడు భూమికి.. విశ్వానికి మధ్య ఉన్న అడ్డుగోడలు తొలగిపోతాయట. అందుకే ఈ సందర్భంలో మన మనసులో బలంగా అనుకునే కోరికలు చాలా వేగంగా వాస్తవ రూపం దాల్చుతాయి.
ఆలోచనలే పునాది: ఈ రోజు మనం చేసే ప్రతి ఆలోచన ఒక విత్తనం లాంటిది. అది ఎంత సానుకూలంగా ఉంటే మన భవిష్యత్తు అంత బాగుంటుంది. మన మనసు లోతుల్లో ఉండే మాటలను అర్థం చేసుకోవడానికి, మనం ఏ దిశలో వెళ్లాలో నిర్ణయించుకోవడానికి ఇది సరైన సమయం.
మ్యానిఫెస్టేషన్ (సంకల్ప సిద్ధి) పద్ధతులు:
ఈ అద్భుతమైన శక్తిని మనం మనకు అనుకూలంగా మార్చుకోవడానికి కొన్ని సులభమైన పద్ధతులు పాటించవచ్చు.
డైరీలో రాసుకోవడం: జనవరి 1వ తేదీ ఉదయాన్నే ఒక తెల్లని కాగితం లేదా డైరీ తీసుకుని మీ లక్ష్యాలను రాయండి. “నాకు మంచి ఉద్యోగం రావాలి” అని కాకుండా “నాకు మంచి ఉద్యోగం వచ్చింది, నేను సంతోషంగా ఉన్నాను” అని ఇప్పటికే జరిగినట్లుగా రాయండి. ఇది మీలో సానుకూలతను పెంచుతుంది.
కళ్లారా చూడటం: మీ లక్ష్యాలు నెరవేరితే మీరు ఎంత సంతోషంగా ఉంటారో ఊహించుకోండి. మీకు కావాల్సిన వస్తువులు లేదా స్థలాల ఫోటోలను ఒక బోర్డుపై పెట్టుకుని వాటిని తరచూ చూస్తూ ఉండండి.
ధ్యానం, ప్రశాంతత: ఉదయం సూర్యోదయ సమయంలో కనీసం 10 నిమిషాలు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కూర్చోండి. గడిచిన ఏడాదిలో మీకు సహాయం చేసిన వారికి, భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పండి. మనసు ప్రశాంతంగా ఉంటేనే విశ్వం నుంచి శక్తిని అందుకోగలం.
సానుకూల దృక్పథం: ఈ రోజంతా ఎవరితోనూ గొడవ పడకండి. కోపం, ద్వేషం వంటి నెగటివ్ ఆలోచనలకు చోటు ఇవ్వకండి. కేవలం మీ ఎదుగుదల గురించి మాత్రమే ఆలోచించండి.
మనం ఎందుకు వదులుకోకూడదు ?
సాధారణంగా మనం కొత్త ఏడాది తీర్మానాలు (తీసుకుంటాం కానీ.. వారం తిరగకముందే వాటిని మర్చిపోతాం. కానీ ‘111 పోర్టల్’ రోజున చేసే సంకల్పం మన అంతరాత్మపై బలమైన ముద్ర వేస్తుంది. ఇది కేవలం మూఢనమ్మకం కాదు.. మన ఆలోచనలను ఒక క్రమపద్ధతిలో పెట్టి, మన జీవితాన్ని మనమే నిర్మించుకోవడానికి ప్రకృతి ఇచ్చే గొప్ప అవకాశం.
2026 జనవరి 1వ తేదీని కేవలం పార్టీలు, వేడుకలకే పరిమితం చేయకుండా.. కాసేపు మీ గురించి మీరు ఆలోచించండి. ఈ ‘111 పోర్టల్’ శక్తిని ఉపయోగించుకుని మీ జీవితాన్ని కొత్త పుంతలు తొక్కించండి. స్పష్టమైన లక్ష్యం, దృఢమైన సంకల్పం ఉంటే ఈ ఏడాది మీ కలలన్నీ నిజమవుతాయి.