E-Paper
Advertisement

Kiwi Fruits: ఆకుపచ్చ కివీ లేదా గోల్డెన్ కివీ… ఈ రెండింటిలో ఏది తింటే మంచిది?

Kiwi Fruits: ఆకుపచ్చ కివీ లేదా గోల్డెన్ కివీ… ఈ రెండింటిలో ఏది తింటే మంచిది?
Advertisement

కివీ పండు తింటే ఎంతో ఆరోగ్యమని వైద్యులు కూడా చెబుతున్నారు. ముఖ్యంగా శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండటంతో దీనిని సూపర్ ఫ్రూట్ గా చెప్పుకుంటారు. అయితే మార్కెట్‌లో గ్రీన్ కివీ (పచ్చ), గోల్డెన్ కివీ (పసుపు) అనే రెండు రకాల కివీలు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండింటిలో ఏది మంచిది? ఏది ఎంచుకోవాలి? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఈ రెండు కివీలకు తమ తమ ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి.

ఆకుపచ్చ కివీ పండు
గ్రీన్ కివీ బయట గోధుమ రంగులో ఉండి లోపల పచ్చగా ఉంటుంది. దీనికి కొద్దిగా పులుపు, తీపి కలిసిన రుచి ఉంటుంది. ఈ కివీలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియకు చాలా మేలు చేస్తుంది. పేగులు సరిగ్గా పనిచేయడానికి ఇది సహాయపడుతుంది. మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉన్నవారికి గ్రీన్ కివీ మంచి పరిష్కారం అవుతుంది. అలాగే బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది. తక్కువ క్యాలరీలతో ఎక్కువసేపు తృప్తిగా ఉంచే లక్షణం ఉండటంతో డైట్‌లో గ్రీన్ కివీని చేర్చాలని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Also read: Pearl Ring: ఈ రాశుల వారు ముత్యపు ఉంగరం ధరించడం ఏమాత్రం మంచిది కాదు

గోల్డెన్ కివీ
ఇక గోల్డెన్ కివీ విషయానికి వస్తే ఇది లోపల పసుపు రంగులో ఉండి గ్రీన్ కివీ కంటే తీపిగా ఉంటుంది. ఇందులో విటమిన్ C అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. జలుబు, దగ్గు వంటి సమస్యలు తరచూ వచ్చే వారికి గోల్డెన్ కివీ ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే చర్మం ఆరోగ్యంగా, మెరిసేలా ఉండేందుకు కూడా ఇది సహాయపడుతుంది. తక్కువ ఆమ్లత్వం ఉండటం వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు కూడా సులభంగా తినగలరు. అందువల్ల ఇమ్యూనిటీ పెంచుకోవాలనుకునే వారు గోల్డెన్ కివీని ఎంచుకోవచ్చు.

Advertisement

Also read: Rice Water: అన్నం వండిన గంజిని పారేస్తున్నారా? ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చో తెలుసా?

గ్రీన్ కివీ, గోల్డెన్ కివీ రెండూ ఆరోగ్యానికి మంచివే. అయితే మీ అవసరాన్ని బట్టి వాటిని ఎంపిక చేసుకోవాలి. జీర్ణక్రియ సమస్యలు ఉంటే గ్రీన్ కివీ, రోగనిరోధక శక్తి పెంచుకోవాలనుకుంటే గోల్డెన్ కివీ తీసుకోవడం మంచిది. అలాగే మార్కెట్‌లో కివీ కొనుగోలు చేసే సమయంలో కొద్దిగా మెత్తగా ఉండే పండ్లను ఎంచుకోవాలి. చాలా గట్టిగా ఉన్నవి పండకపోవచ్చు, చాలా మెత్తగా ఉన్నవి పాడై ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తూ కివీని మీ ఆహారంలో చేర్చుకుంటే మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు.

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×