ముత్యం అందంగా కనిపించే రత్నం. వేలికి ఉంగరంలా పెట్టుకుంటే ఎంతో అందంగా ఉంటుందని భావిస్తారు. అందుకే ముత్యపు ఉంగరాలు నచ్చినట్టు కొని పెట్టేసుకుంటారు. ముత్యాన్ని జ్యోతిష్య శాస్త్రంలో చంద్ర గ్రహానికి చెందిన ముఖ్యమైన రత్నంగా భావిస్తారు. అందుకే అందరూ ఈ ముత్యపు ఉంగరం ధరించడం మంచిదికాదు. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఇది అనుకూలం కాకపోవచ్చు. ఆ రాశుల వారు ఎవరు? ఎందుకు ముత్యం ఉంగరానికి దూరంగా ఉండాలి? తెలుసుకోండి.
ముత్యంపై చంద్ర గ్రహ ప్రభావం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ముత్యం చంద్రుడిని బలపరుస్తుంది. చంద్రుడు మన భావోద్వేగాలు, మనసు, శాంతి, నిద్రను నియంత్రించే గ్రహం. అందుకే ముత్యం ధరించడం వల్ల మనసుకు ప్రశాంతత వస్తుందని చెబుతారు. కానీ చంద్రుడు ఎక్కువగా బలపడితే కొన్ని రాశుల వారికి సమస్యలు రావచ్చు.
Also read: Rice Water: అన్నం వండిన గంజిని పారేస్తున్నారా? ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చో తెలుసా?
వృషభ రాశి
వృషభ రాశి వారికి ముత్యం అనుకూలం కాదు. ఈ రాశికి చంద్ర ప్రభావం సరిగా సరిపోదు. ముత్యం ధరించడం వల్ల ఆలోచనల్లో గందరగోళం, నిర్ణయాల్లో తడబాటు రావచ్చు.
మిథున రాశి
మిథున రాశి వారు చాలా ఆలోచనలు చేసే స్వభావం కలిగి ఉంటారు. ముత్యం ధరించడం వల్ల భావోద్వేగాలు ఎక్కువై మానసిక ఒత్తిడి పెరగవచ్చు.
మకర రాశి
మకర రాశి వారికి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చంద్రుడి ప్రభావం పెరగడం వల్ల శని-చంద్ర వ్యతిరేక ప్రభావం ఏర్పడి జీవితంలో ఆటంకాలు రావచ్చు.
కుంభ రాశి
కుంభ రాశి వారికి కూడా శని ప్రభావం ఉంటుంది. ఈ రాశి వారు ముత్యం ధరించినట్లయితే భావోద్వేగ అస్థిరత, ఒత్తిడి, ఆందోళన పెరగవచ్చు.
తులా రాశి
తులా రాశి వారికి ముత్యం కొన్ని సందర్భాల్లో ప్రతికూలంగా పనిచేయవచ్చు. ముఖ్యంగా జాతకంలో చంద్రుడు బలంగా ఉన్నప్పుడు ముత్యం ధరించడం వల్ల మానసిక అసంతులనం ఏర్పడే అవకాశం ఉంది.
Also read: Sour Curd: వేసవిలో పెరుగు త్వరగా పులుస్తుందా? తాజాగా ఉండేందుకు ఇలా చిన్న పని చేయండి చాలు
ముత్యం ధరిస్తే వచ్చే సమస్యలు ఇవే
ఈ రాశుల వారికి ముత్యం సరిపోకపోవడానికి ప్రధాన కారణం గ్రహాల మధ్య అనుకూలత లేకపోవడం. చంద్రుడు ఎక్కువగా ప్రభావం చూపితే భావోద్వేగాలు అధికమై, మనసు స్థిరంగా ఉండకపోవచ్చు. దీని వల్ల రోజువారీ జీవితం, పనుల్లో కూడా ప్రభావం పడుతుంది. పైన చెప్పిన రాశుల వారు ముత్యం ధరించడం వల్ల ఆందోళన, టెన్షన్ పెరగడం, నిద్రలేమి సమస్యలు, చిన్న విషయాలకు ఎక్కువగా స్పందించడం, కుటుంబంలో కలహాలు, పనుల్లో ఫోకస్ తగ్గడం వంటివి కలుగుతాయి.