E-Paper
Advertisement

Hair Fall In Winter: చలికాలంలో జుట్టు రాలుతోందా ? అసలు కారణం ఇదేనట

Hair Fall In Winter: చలికాలంలో జుట్టు రాలుతోందా ? అసలు కారణం ఇదేనట
Advertisement

Hair Fall In Winter: చలికాలం వచ్చిందంటే చాలు, వాతావరణంలో వచ్చే మార్పులు మన ఆరోగ్యంపైనే కాదు, మన జుట్టుపైనా తీవ్ర ప్రభావం చూపుతాయి. సాధారణంగా ఏడాది పొడవునా కొంతవరకు జుట్టు రాలడం సహజమే అయినప్పటికీ.. చలికాలంలో ఈ సమస్య మరింత ఎక్కువవుతుంది. చల్లటి, పొడి గాలి కారణంగా జుట్టు రాలడం పెరిగి, ఇది చాలా మందికి పెద్ద ఆందోళనగా మారుతుంది.

చలికాలంలో జుట్టు ఎందుకు రాలుతుంది ?
చలికాలంలో జుట్టు ఎక్కువగా రాలడానికి అనేక కారణాలు ఉన్నాయి.

Advertisement

తేమ కొరత: చలికాలంలో గాలిలో తేమ శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఈ పొడి గాలి మన తలపై చర్మం (స్కాల్ప్), జుట్టులోని సహజమైన తేమను లాగేసుకుంటుంది. దీని వల్ల జుట్టు పొడిబారి, బలహీనపడి, సులభంగా చిట్లిపోవడం, రాలడం జరుగుతుంది.

చుండ్రు సమస్య : చలికాలంలో స్కాల్ప్ పొడిగా మారడం, అలాగే వేడి నీటితో తలస్నానం చేయడం వంటి అలవాట్ల వల్ల చుండ్రు సమస్య పెరుగుతుంది. చుండ్రు పెరిగితే.. అది స్కాల్ప్ ఆరోగ్యాన్ని దెబ్బతీసి, జుట్టు కుదుళ్లను బలహీనపరుస్తుంది. దీంతో జుట్టు రాలడం పెరుగుతుంది.

Advertisement

రక్త ప్రసరణ తగ్గడం: చల్లటి ఉష్ణోగ్రతల వల్ల స్కాల్ప్‌లోని రక్తనాళాలు సంకోచించి, రక్త ప్రసరణ తగ్గుతుంది. జుట్టు కుదుళ్లకు పోషకాలు అందక అవి బలహీనపడి రాలడానికి దారితీస్తుంది.

వేడి నీటి స్నానం: చలి కారణంగా చాలామంది వేడి నీటితో తలస్నానం చేస్తారు. వేడి నీరు స్కాల్ప్‌లోని సహజ నూనెలను తొలగిస్తుంది. దీని వల్ల జుట్టు మరింత పొడిగా, పెళుసుగా మారుతుంది.

జుట్టు రాలడాన్ని తగ్గించడానికి చిట్కాలు:
ఈ చలికాలపు జుట్టు రాలడాన్ని ఎదుర్కోవడానికి కొన్ని ప్రభావవంతమైన చిట్కాలు:

నూనెతో మసాజ్ : వారానికి కనీసం రెండు సార్లు కొబ్బరి నూనె, బాదం నూనె లేదా ఆలివ్ నూనె వంటి గోరువెచ్చని నూనెతో స్కాల్ప్‌ను మసాజ్ చేయండి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచి, కుదుళ్లకు తేమను అందించి.. వాటిని బలోపేతం చేస్తుంది.

తలస్నానం : తరచుగా తలస్నానం చేయడం మానుకోండి. వారానికి రెండు సార్లు తలస్నానం చేయడం మంచిది. గోరు వెచ్చని లేదా చల్లటి నీటిని మాత్రమే ఉపయోగించండి.

కండిషనింగ్ తప్పనిసరి: జుట్టుకు తేమను అందించడానికి ప్రతీసారి షాంపూ చేసిన తర్వాత కండిషనర్ ఉపయోగించడం, వారానికి ఒకసారి డీప్ కండిషనింగ్ ప్యాక్‌లు వేసుకోవడం చాలా ముఖ్యం.

ఆరోగ్యకరమైన ఆహారం: జుట్టు ఆరోగ్యానికి లోపలి నుండి పోషణ అవసరం. ప్రోటీన్లు (గుడ్లు, నట్స్), విటమిన్లు (క్యారెట్, పాలకూర), మినరల్స్ పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారాలు జుట్టుకు మేలు చేస్తాయి.

హైడ్రేటెడ్‌గా ఉండటం: చలికాలంలో దాహం తక్కువగా అనిపించినా.. రోజుకు కనీసం 2-3 లీటర్ల నీరు తాగడం ద్వారా శరీరం, జుట్టు హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకోవాలి.

హీటింగ్ టూల్స్ దూరం: హెయిర్ డ్రైయ్యర్, స్ట్రెయిటనర్ వంటి హీటింగ్ టూల్స్‌ను వీలైనంత వరకు ఉపయోగించకుండా ఉండటం ఉత్తమం. ఎందుకంటే అవి జుట్టును మరింత పొడిగా, నిర్జీవంగా మారుస్తాయి.

ట్రోపీ/స్కార్ఫ్ వాడకం: బయటకు వెళ్లినప్పుడు చల్లటి గాలి, దుమ్ము నుంచి జుట్టును రక్షించుకోవడానికి స్కార్ఫ్ లేదా టోపీ ధరించడం మంచిది.

Related News

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

Big Stories

Advertisement
×