E-Paper
Advertisement

Manchu Lakshmi: వాళ్లు లేకపోతే నేను లేను…ఎమోషనల్ అయిన మంచు లక్ష్మీ!

Manchu Lakshmi: వాళ్లు లేకపోతే నేను లేను…ఎమోషనల్ అయిన మంచు లక్ష్మీ!
Advertisement

Manchu Lakshmi: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu)వారసురాలుగా ఇండస్ట్రీకి పరిచయమైన మంచు లక్ష్మి(Manchu Lakshmi) ప్రస్తుతం ఇండస్ట్రీలో నటిగా నిర్మాతగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. ఒకానొక సమయంలో ఈమె యాంకర్ గా కూడా ఎన్నో కార్యక్రమాలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇటీవల దక్ష అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇండస్ట్రీలో తనని తాను నిరూపించుకోవడం కోసం విభిన్నమైన సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న మంచు లక్ష్మి మాత్రం సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు లక్ష్మి తన వ్యక్తిగత విషయాల గురించి అభిమానులతో పంచుకున్నారు.

కష్టమొస్తే ఫ్రెండ్స్ ఉంటారు..

మంచు లక్ష్మి తన కుటుంబానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో తన ఫ్రెండ్స్ కి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తుంది. తనకు అబ్బాయిలు, అమ్మాయిలు అని తేడా లేదని జెండర్ గురించి ఆలోచించనని తెలిపారు. అందుకే తన ఫ్రెండ్స్ సర్కిల్ లో అబ్బాయిలు కూడా ఎక్కువగా ఉంటారని తెలిపారు. తాను తన జీవితంలో ఇలా ఉన్నాను అంటే అందుకు కారణం తన స్నేహితులేనని మంచు లక్ష్మి వెల్లడించారు. నాకు ఏదైనా ఒక సలహా కావాలన్నా నేను ఏదైనా ఇబ్బందులలో ఉన్న నా ఫ్రెండ్స్ నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుందని ఈమె తెలిపారు. ఇక నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఇంటికి వస్తున్నామని చెబితే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుందని వెల్లడించారు.

ముంబై వెళ్లి బాధపడ్డాను..

Advertisement

ఒకప్పుడు తాను ముంబై వెళ్ళినప్పుడు చాలా బాధపడ్డాను ఇక్కడ ఎవరు లేరా? అనే భావన తనకు కలిగింది కానీ ఇప్పుడు ముంబై ఎవరు వచ్చినా వెంటనే నాకు ఫోన్ చేసి మీ ఇంటికి వస్తున్నాం అంటూ మాట్లాడుతారు. అలా ఫోన్ చేసినప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుందని మంచు లక్ష్మి వెల్లడించారు. ఇలా ఫ్రెండ్స్ గురించి ఈమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి అయితే హైదరాబాదులో స్థిరపడిన మంచు లక్ష్మి ఉన్నఫలంగా ముంబై వెళ్లి అక్కడే స్థిరపడిన సంగతి తెలిసిందే.

అమెరికా వదిలి రాకుండా ఉండాల్సింది..

Advertisement

ఇక ముంబైకి వెళ్లడానికి గల కారణాలను కూడా పలు సందర్భాలలో ఈమె తెలియజేశారు .తన కెరియల్ అలాగే తన కుమార్తె కెరియర్ కోసమే ముంబై వెళ్లానని ఈమె తెలియజేశారు. ఇక ముంబై వెళ్ళినా ప్రతి వీకెండ్ తాను హైదరాబాద్ వచ్చి ఇక్కడ వారందరితో సరదాగా గడుపుతానని మంచు లక్ష్మి ఈ సందర్భంగా తెలిపారు. కెరియర్ గురించి కూడా ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఎన్నో విషయాలను అందరితో పంచుకున్నారు . తన జీవితంలో ఏదైనా రిగ్రేట్ గా ఫీల్ అయ్యే సంఘటనలు ఉన్నాయా అనే ప్రశ్న కూడా ఎదురవడంతో ఈమె అమెరికా వదిలి ఇండియా రావడమే నేను చేసిన తప్పు అని అలా చేయకుండా ఉంటే బాగుండేదని ఇప్పటికి కూడా ఫీలవుతుంటాను అంటూ మంచు లక్ష్మి తెలియజేశారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళిన మంచు లక్ష్మి ఇండియా వచ్చి ఇక్కడే స్థిరపడడంతో ఇండియా వచ్చి తప్పు చేశానని పలు సందర్భాలలో మాట్లాడుతూ ఉంటారు..

Also Read: Manchu Lakshmi: మా కుటుంబం మొత్తం కలిసే ఉండాలి.. మంచు ఫ్యామిలీలో విభేదాలు తొలగి పోలేదా? 

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×