E-Paper
Advertisement

BJP Solo Fight: ఒంటరిగానే వస్తాం.. కాషాయ జెండా ఎగరవేస్తాం! సాధ్యమయ్యే పనేనా..?

BJP Solo Fight: ఒంటరిగానే వస్తాం.. కాషాయ జెండా ఎగరవేస్తాం! సాధ్యమయ్యే పనేనా..?

BJP Solo Fight: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీలు ఎన్నో ఉంటాయి. ఎన్నికల సమయం అంటే ఒకరిపై ఒకరు నేతలు దుమ్మెత్తి పోసుకోవడాలు చూస్తూనే ఉంటాం. విమర్శలు ఉంటాయి, సద్వివిమర్శలు ఉంటాయి. ఎన్నున్నా సింగిల్ గానే పంచాయితీ ఎన్నికలకు వెళ్తాం, అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం, సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటుతాం అంటున్నారు కాషాయ నేతలు. గ్రామీణంలో కాషాయ జెండా ఎగరవేస్తాం అని చెపుతున్నారు. మరి బీజేపీ గాంభీర్యం..? సాధ్యమయ్యే పనేనా..?

పంచాయతీ ఎన్నికల్లో ఒంటరి పోరు అంటున్న బీజేపీ
తెలంగాణలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించింది. గ్రామీణ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో, ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా సింగిల్ గానే బరిలోకి దిగబోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇతర పార్టీలతో పొత్తుకు ఎలాంటి అవకాశం లేదని ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పలుమార్లు చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలంటే పార్టీని కింది స్థాయి నుంచి బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యంగా కాషాయ పార్టీ పావులు కదుపుతోంది.

సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటుకోవాలనుకుంటున్న బీజేపీ
స్థానిక సంస్థల ఎన్నికలే పార్టీల రాజకీయ భవిష్యత్తును డిజైన్ చేస్తాయి కాబట్టి, ఒంటరిగానే బరిలోకి దిగి, సర్పంచ్ ఎన్నికల్లో తమ సత్తా ఏంటో తేల్చుకోవాలనే ఆలోచనలో పార్టీ వర్గాలు ఉందంట. ఇతర పార్టీలతో పొత్తు ఉంటే గ్రామీణ స్థాయి నుంచి పార్టీకి డ్యామేజ్ చేస్తుందనే అంచనాలో నాయకత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే సింగిల్ గానే బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే గత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీడీపీ, జనసేన మద్దతుతో బరిలోకి దిగిన బీజేపీ, వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో సైతం అదే స్ట్రాటజీని అప్లయ్ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. జూబ్లీహిల్స్‌లో ఎదురైన చేదు అనుభవంతో మెజారిటీ నాయకత్వం దాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఏపీ పార్టీలతో పొత్తు పెట్టుకోకూడదని నేత అభిప్రాయం
తెలంగాణలో ఉనికి లేని ఏపీ పార్టీలతో పొత్తులు పెట్టుకుంటే, వాటి బలోపేతానికి సహాయపడటం తప్ప, బీజేపీకి ఎలాంటి లాభం ఉండదనే అభిప్రాయాలు ఆ పార్టీలో వ్యక్తమవుతున్నాయి. అందులో భాగంగానే తాజాగా జరిగిన పార్టీ సన్నాహక సమావేశంలో ఎట్టి పరిస్థితుల్లో పొత్తులు ఉండకూడదని, కీలక నేతలంతా ఒంటరిగానే సర్పంచ్ ఎన్నికలకు సన్నద్ధం కావాలనే అభిప్రాయాలను వ్యక్తపరిచినట్టుగా తెలుస్తోంది. ఒంటరిగా వెళ్ళడం వల్ల, లోకల్ స్థాయిలో పార్టీ పునాదులు మరింత స్ట్రాంగ్ అవ్వడంతో పాటు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి కూడా వచ్చినట్లవుతుందనే యోచనలో టీబీజేపీ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ అంచనాల ప్రకారమే స్థానిక ఎన్నికలకు కావలసిన కసరత్తులు చేసుకుంటుంది.

లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచుకున్న కాషాయ పార్టీ
గత లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అంచనా వేసిదాని కంటే అధికంగా ఓటింగ్ శాతం వచ్చిన నేపథ్యంలో అదే ప్రణాళికతో స్థానిక సంస్థల ఎన్నికలలో బలం పెంచుకోవాలని బీజేపీ ప్రతిష్టాత్మకంగా ఆలోచిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తమ ఉనికిని, బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది. ఇన్నాళ్లు కింది స్థాయిలో క్యాడర్ ఉన్న పట్టించుకొని నాయకత్వం, ఈ ఎన్నికల్లో క్యాడర్ ను అవసరానికి మించి ఉపయోగించుకోవాలని చూస్తోంది. ఈ ఎన్నిఅక్లో పార్టీ బలంగా ఉనికిని చాటుకొని, భవిష్యత్తులో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పునాది వేసుకోవాలనే సంకల్పంతో కాషాయ పార్టీ కనిపిస్తోంది.

కేంద్రం ఇస్తున్న నిధులపై కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టే ఆలోచన
అంతేకాదు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు, సంక్షేమ పథకాలు వంటి అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని బీజేపీ భావిస్తోంది. స్థానిక సంస్థల్లో అభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యం అనే నినాదంతో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతో పాటు, కేంద్రం నుంచి గ్రామ పంచాయతీలకు వచ్చిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరిని ఎండగట్టాలని పార్టీ నేతలు భావిస్తున్నారు.

క్యాడర్ పెద్దపీట వేయడానికి ప్రణాళికలు
సర్పంచ్ ఎన్నికలు మొదలుకుని ఎంపీటీసీ, జెడ్పీటీసీ వరకు అన్ని స్థానాల్లోనూ ఒంటరిగానే పోటీ చేయాలని, ముఖ్యంగా పార్టీ కేడర్‌కు స్పష్టమైన సందేశం ఇవ్వాలని, వారిలో ఆత్మవిశ్వాసం నింపాలనే యోచనలో పార్టీ నాయకత్వం ఉన్నట్టు కనిపిస్తోంది. కిందస్థాయి క్యాడరే లేకపోతే 8 ఎమ్మెల్యేలు,
8 మంది ఎంపీలు, 2 ఎమ్మెల్సీలు వచ్చేవి కాదన్నది తెలిసిన విషయమే. క్యాడరే ప్రధానం కాబట్టి, వారికే పెద్ద పీటవేసి ప్రణాళికలు రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే రామచందర్రావు ఆధ్వర్యంలో సర్పంచ్ ఎన్నికల సన్నాహక కీలక సమావేశానికి ఎంపీలు, ఎమ్మిల్యేలతో పాటు, కీలక నేతలoతా డుమ్మా కొట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని నేతలు లైట్ తీసుకుంటున్నారా?
కీలక సమావేశానికి నేతలంతా డుమ్మా కొట్టడానికి నేతల మధ్య తగవులు కారణమనే చర్చ సైతం నడుస్తోంది. దీంతో అధ్యక్షుడినీ నేతలంతా లైట్ తీసుకున్నారనే టాక్ నడుస్తోంది. ఇట్లా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉండటంతో మొత్తం జిల్లాల అధ్యక్షులు, స్థానిక కమిటీల సహకారంతో సమన్వయంతో క్షేత్రస్థాయి సమావేశాలు నిర్వహించి గెలుపునకు వ్యూహాత్మకంగా ప్రణాళికను రచించాలని కమలం పార్టి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

బీసీ అభ్యర్థులకు పార్టీ తరపున 42 శాతం రిజర్వేషన్లు..
ఇక నేతల పంచాయతీలు అటుంచితే, గెలుపు గుర్రాలనే రంగంలోకి దించాలని పార్టీ భావిస్తోంది. ఈ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించి తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనే లక్ష్యంతో బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని ప్రణాళికలు సిద్ధం చేసుకునే పనిలో పడిందట. తెలంగాణలో మొత్తం 12,733 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఏ పార్టీలో పొత్తు లేకుండా అన్ని స్థానాల్లో బీజేపీ అభ్యర్థులనే నిలబెట్టేందుకు పార్టీ సిద్ధం అవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ అభ్యర్థులకు పార్టీ తరపున 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి, తగిన ప్రాధాన్యత కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని రాష్ట్ర నేతలు ఇప్పటికే స్పష్టం చేస్తున్నారు. దీంతో బీసీలకు అధికంగా సీట్లు దక్కే అవకాశాలున్నాయి.

Also Read: యాంకర్ శివజ్యోతికి బిగ్‌షాక్.. ఆధార్ కార్డు బ్లాక్ చేసిన టీటీడీ..?

స్థానిక సమస్యలను, కేంద్ర ప్రభుత్వ నిధులను వినియోగించుకున్న తీరును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై వ్యవహరించిన తీరును కూడా ఎండగట్టాలని నిర్ణయించారు. లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ వ్యూహాత్మకంగా ముందకు వెళ్తున్నప్పటికీ నేతల మధ్య పొంచి ఉన్న విభేదాలో నిర్దేశించుకున్న లక్ష్యాలను బీజేపీ ఎలా అధిగమిస్తుందనేది సస్పెన్స్ గా ఉంది.

Story By Apparao, Bigtv

Related News

Iran Conflict: ఇజ్రాయెల్‌తో రాజీ.. ఇరాన్‌తో రాజకీయం.. ట్రంప్ ఆడుతున్న ఇంటర్నేషనల్ గేమ్ ఇదే!

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

Big Stories

×