E-Paper
Advertisement

లారీలో వంట.. గ్యాస్ సిలిండర్ పేలి వాహనం దగ్ధం!

లారీలో వంట.. గ్యాస్ సిలిండర్ పేలి వాహనం దగ్ధం!
Advertisement

Lorry Fire: చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో శనివారం ఒక ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. రోడ్డు పక్కన ఆపి ఉన్న ఒక లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగి, వాహనం పూర్తిగా దగ్ధమైంది. లారీ డ్రైవర్, క్లీనర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెద్ద ప్రాణనష్టం తప్పించుకోగలిగారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. టైల్స్ తయారికీ వాడే పౌడర్ ముడి పదార్థాన్ని తీసుకొని వెళ్తున్న లారీని జాతీయ రహదారిపై నిలిపి ఉంచారు. లారీ క్యాబిన్ లోపలే చిన్న గ్యాస్ సిలిండర్ సహాయంతో డ్రైవర్,క్లీనర్ వంట చేసుకుంటుండగా.. ఊహించని విధంగా సిలిండర్ లీకై ఒక్కసారిగా పేలిపోయింది. క్షణాల్లోనే మంటలు లారీ మొత్తానికి వ్యాపించాయి. లోపల ఉన్న డ్రైవరు, క్లీనరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కిందకు దూకేయడంతో స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు.

Advertisement

చుట్టుపక్కల వారు వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. లారీ లోపల వంట చేయడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి హెచ్చరించింది.

Also Read: రైల్వే పట్టాలు కోసేయమంటే అరెస్ట్ చేయక హారతి ఇస్తారా? బాల్క సుమన్‌పై శివసేన రెడ్డి ఫైర్!

Advertisement

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×