E-Paper
Advertisement

Hair Serum For White Hair: తెల్లజుట్టు సమస్యలతో విసిగిపోయారా? అయితే ఒక్కసారి ఈ హెయిర్ సీరమ్ ట్రై చేయండి..

Hair Serum For White Hair: తెల్లజుట్టు సమస్యలతో విసిగిపోయారా? అయితే ఒక్కసారి ఈ హెయిర్ సీరమ్ ట్రై చేయండి..
Advertisement

Hair Serum For White Hair: ఇప్పుడున్న రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా తెల్లజుట్టు సమస్యతో చాలామంది ఇబ్బందిపడుతున్నారు. ఇక వైట్ హెయిర్‌ను కవర్ చేసేందుకు నానా తంటాలు పడుతుంటారు. ఓ వైపు వైట్ హెయిర్‌ను తొలగించలేరు. మరోవైపు కెమికల్స్‌తో కూడిన హెయిర్ ఆయిల్స్ హెన్నాలు, హెయిర్ డైలు, షాంపులు వాడలేరు. పైగా ఇవి కెమికల్స్‌తో తయారు చేసి ఉంటాయి కాబట్టి జుట్టు పాడైపోయే ప్రమాదం ఉంది. అంతే కాదు వీటివల్ల భవిష్యత్తులో కంటి సమస్యలు, తలలో ఇన్ఫెక్షన్లు, చర్మసంబధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మనం ఎంత  ఆరోగ్యంగా ఉంటామో.. జుట్టు కూడా అంతే ఆరోగ్యంగా ఉంటుంది. ఇందుకోసం తప్పనిసరిగా రోజూ వారి డైట్‌లో జుట్టుకు కేర్ తీసుకోవాల్సిందే.. ముఖ్యంగా సరైన ఆహారం తీసుకోవడంతో పాటు, ప్రతిరోజు వ్యాయామం చెయ్యాలి. ఒత్తిడిని తగ్గించుకుంటే మంచిది. వీటన్నిటికి చెక్ పెట్టే మార్గం ఒకటి ఉంది. తెల్లజుట్టును నల్లగా మార్చేందుకు ఈ హెయిర్ సీరమ్ ట్రై చేయండి. జీవితంలో తెల్లజుట్టును దరిచేరకుండా ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Advertisement

కావాల్సిన పదార్ధాలు
కరివేపాకు
మెంతులు
బ్లాక్ సీడ్స్
వాటర్
మస్టర్డ్ ఆయిల్

తయారు చేసుకునే విధానం
ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో కరివేపాకు, మెంతులు, బ్లాక్ సీడ్స్, వాటర్ పోసి 10 నిమిషాల పాటు మరిగిచండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి స్ప్రే బాటిల్‌లో వడకట్టుకోవాలి. అందులో మస్టర్డ్ ఆయిల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పెట్టుకుని, కొద్దిసేపటి వరకు మసాజ్ చేసి, అరగంట తర్వాత తలస్నానం చెయ్యండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. క్రమంగా తెల్లజుట్టు నల్లబడుతుంది. ఈ హెయిర్ సీరమ్ వల్ల జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.

Advertisement

వైట్ హెయిర్‌ను తొలగించేందుకు కొబ్బరి నూనెతో వీటిని కలిపి ఒక్కసారి ట్రై చేయండి. తెల్లజుట్టును నల్లగా మార్చేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్దాలు
అలోవెరా జెల్
కొబ్బరి నూనె
పెరుగు, విటమిన్ ఇ క్యాప్సూల్స్

తయారు చేసుకునే విధానం
ముందుగా చిన్న గిన్నె తీసుకుని అందులో కొబ్బరి నూనె, రెండు టేబుల్ స్పూన్ పెరుగు, అలోవెరా జెల్, రెండు విటమిన్ ఇ క్యాప్సూల్స్ కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసి గంట తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చెయ్యండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారేందుకు సహాయపడుతుంది. అంతేకాదు.. ఈ హెయిర్ మాస్క్ వల్ల జుట్టు చాలా సిల్కీగా, ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. ఇందులో ఉపయోగించే పదార్ధాలు జుట్టును నల్లగా మార్చేందుకు అద్భుతంగా పనిచేస్తాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.

Also Read: ఒక్కసారి ఇలా ట్రై చేయండి.. తెల్లజుట్టు కనిపించదిక

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్ని ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

Big Stories

Advertisement
×