Remove White Hair: ఎంత ప్రయత్నించిన తెల్లజుట్టు రావడం ఆగడం లేదా..? ఎన్ని రకాల హెయిర్ మాస్క్‌లు ట్రై చేసినా ఫలితం లేదా..? అయితే ఒక్కసారి ఈ హెయిర్ మాస్క్ అప్లై చేయండి. వయసు పైబడినా కూడా తెల్లజుట్టు అనేది ఉండదు. సాధారణంగా వైట్ హెయర్ కొన్ని కారణాల వల్ల వస్తుంది. బయట కాలుష్యం, దుమ్మూ, ధూళి, ఒత్తిడి, ముఖ్యంగా పోషకాహారం తినకపోవడం. కొంత మందికి వంశపార్యపరంగా, వయసుతో సంబంధం లేకుండానే వచ్చేస్తుంటుంది. అయితే చాలా మంది వైట్ హెయిర్‌ను కనపడకుండా చేసేందుకు రకరకాల హెయిర్ కలర్స్, హెయిర్ డైలు, షాంపులు ఉపయోగిస్తుంటారు.
ఇవి కొద్దిరోజులు మాత్రమే పనిచేస్తాయి. అంతే కాదు వీటివల్ల భవిష్యత్తులో అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. తలలో ఇన్ఫెక్షన్లు, జుట్టు రాలిపోవడం, చుండ్రు ఎక్కువగా కూడా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కాబట్టి మన ఇంట్లోనే దొరికే సహజ పదార్ధాలతో హెయిర్‌కి అప్లై చేశారంటే ఉత్తమ ఫలితాలు ఉంటాయి. పైగా వీటివల్ల జుట్టుకు హాని కలగదు. హెయిర్ పొడవుగా, ఒత్తుగా పెరుగుతుంది కూడా.. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
☀ కావాల్సిన పదార్ధాలు
⦿ టీపొడి
⦿ బీట్‌రూట్
⦿ హెన్నా
⦿ పెరుగు
⦿ కోడిగుడ్డు
⦿ నిమ్మకాయ
☀ తయారు చేసుకునే విధానం..
ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని అందులో గ్లాస్ వాటర్, టీ పొడి, బీట్‌రూట్ ముక్కలు వేసి డికాషన్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ఆఫ్ చేసి వీటిని వేరే గిన్నెలోకి వడకట్టుకోవాలి. ఈ డికాషిన్‌లో గోరింటాకు పొడి, పెరుగు, నిమ్మకాయ రసం, ఒక కోడిగుడ్డు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేయండి. గంట తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చెయ్యండి. ఇలా నెలకు ఒకసారి పెట్టుకుంటే సరిపోతుంది. ఇందులో ఉపయోగించే పదార్దాలన్ని జుట్టును నల్లగా మార్చేందుకు, హెయిర్ పొడవుగా ఒత్తుగా పెరిగేందుకు అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
జుట్టుకు నల్లగా మార్చేందుకు కొబ్బరి, ఉసిరి పొడితో ఈ చిట్కా ట్రై చేయండి. ఇది కూడా చక్కగా పనిచేస్తుంది. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
☀ కావాల్సిన పదార్ధాలు
⦿ మెంతులు
⦿ కళోంజీ సీడ్స్
⦿ కొబ్బరి నూనె
⦿ ఉసిరిపొడి
☀ తయారు చేసుకునే విధానం
ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో రెండు కప్పుల కొబ్బరి నూనె, అరకప్పు కళోంజీ సీడ్స్, నాలుగు టేబుల్ స్పూన్ మెంతులు, కప్పు ఉసిరిపొడిని తీసుకుని బాగా నల్లగా మరేంత వరకు మరిగించండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి.. అరగంట తర్వాత తలస్నానం చెయ్యండి. ఇలా నెలకు ఒకసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది. జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడంతో పాటు.. తెల్లజుట్టు క్రమంగా ఆగిపోయేలా చేస్తుంది.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.