Jagan Mohan on SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025 ప్రారంభ సమయం దగ్గర పడుతుంది. దాదాపు మరో 10 రోజుల్లో ఈ మెగా లీగ్ గ్రాండ్ గా ప్రారంభం కానుంది. మొత్తం 10 జట్లు తెలపడే ఈ ప్రతిష్టాత్మక టోర్నీ మార్చ్ 22 న ప్రారంభమై.. మే 25న జరిగే ఫైనల్ తో ముగుస్తుంది. మొత్తం 13 వేదికలలో 74 మ్యాచ్ లు 65 రోజులపాటు జరుగుతాయి. తొలి మ్యాచ్ కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ టోర్నీ ప్రారంభం అవుతుంది.
లీగ్ దశలో ఒక్కో జట్టు 14 మ్యాచ్ లలో తలపడుతుంది. ఇందులో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సంబంధించి ఏడు హోమ్ గ్రౌండ్ అయిన ఉప్పల్ స్టేడియం వేదికగా.. మరో ఏడు మ్యాచ్ లు ప్రత్యర్థి వేదికలలో జరగనున్నాయి. ఇక ఈ సీజన్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఈ సీజన్ లో హైదరాబాద్ జట్టును పాట్ కమీన్స్ నడిపించనున్నాడు. మరోవైపు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఈ ఐపీఎల్ సీజన్ కి ముందు పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అర్శణపల్లి జగన్మోహన్ రావు స్టేడియంలో మెరుగైన సౌకర్యాలను సమకూర్చుతామని హామీ ఇచ్చారు. అలాగే ప్రాక్టీస్ క్యాంప్ ప్రారంభం కావడంతో స్టేడియంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. మార్చి 23న హైదరాబాద్ – రాజస్థాన్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగబోతూ ఉండగా.. స్టేడియం కొత్త రూపాన్ని సంతరించుకుంటుంది.
అయితే స్టేడియం పునరుద్ధరణ పనులు జరుగుతున్న సందర్భంగా.. ఈ పనులను పర్యవేక్షించిన హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావు మాట్లాడుతూ.. ఈ ఏడాది ఐపీఎల్ పండగ వాతావరణంలా జరగబోతుందని అన్నాడు. 2024లో హైదరాబాద్ జట్టు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరుని నమోదు చేసిందని.. ఈసారి మాత్రం ఏకంగా 300కు పైగానే అత్యధిక స్కోరుని నమోదు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2024 మార్చి 27న హైదరాబాద్ జట్టు 277/3 పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరుని నమోదు చేసింది.
ఆ తరువాత ఏప్రిల్ 15న తన రికార్డును తానే బద్దలు కొడుతూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుపై 287 పరుగులు చేసింది. ఇక ఈ ఐపీఎల్ 2025 సీజన్ లో కూడా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో భయంకరమైన బ్యాటర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో 300కు పైగా అత్యధిక స్కోరుని నమోదు చేస్తుందని చెబుతున్నారు హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్రావు. SRH రిటైన్డ్ ఆటగాళ్ల జాబితాలో పాట్ కమిన్స్ (రూ. 18 కోట్లు), అభిషేక్ శర్మ (రూ. 14 కోట్లు), నితీష్ రెడ్డి (రూ. 6 కోట్లు), హెన్రిచ్ క్లాసెన్ (రూ. 23 కోట్లు), మరియు ట్రావిస్ హెడ్ (రూ. 14 కోట్లు) ఉన్నారు.
కొనుగోలు చేసిన ఆటగాళ్లు: మహ్మద్ షమీ (రూ. 10 కోట్లు), హర్షల్ పటేల్ (రూ. 8 కోట్లు), ఇషాన్ కిషన్ (రూ. 11.25 కోట్లు), రాహుల్ చాహర్ (రూ. 3.2 కోట్లు), ఆడమ్ జంపా (రూ. 2.40 కోట్లు), అధర్వ తైదే (రూ. 30 లక్షలు), సిమ్‌ఆర్. 3 ఆర్. కోటీశ్వరులు. 1.50 కోట్లు), జీషన్ అన్సారీ (రూ. 40 లక్షలు), జయదేవ్ ఉనద్కత్ (రూ. 1 కోటి), బ్రైడన్ కార్స్ (రూ. 1 కోటి), కమిందు మెండిస్ (రూ. 75 లక్షలు), అనికేత్ వర్మ (రూ. 30 లక్షలు), ఎషాన్ మలింగ (రూ. 1.20 కోట్లు), సచిన్ బేబీ (రూ. 1.20 కోట్లు).
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">