E-Paper
Advertisement

2026 Budjet : బడ్జెట్ బొనాంజ?.. ఏపీ, తెలంగాణలో చిగురిస్తున్న ఆశలు!

2026 Budjet : బడ్జెట్ బొనాంజ?.. ఏపీ, తెలంగాణలో చిగురిస్తున్న ఆశలు!
Advertisement

వచ్చె నెల ఒకటో తేదీన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. దీంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ప్రస్తుతం రెండు రాష్ట్రాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం అందించే నిధులు చాలా ముఖ్యం. అందుకే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విన్నివించేందుకు తెలంగాణ సర్కార్ తరఫు న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఇవాళ ఢిల్లీకి వెళ్లారు.బడ్జెట్ ప్రిపరేషన్‌లో భాగంగా అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ ముఖ్యకార్శులు, మంత్రులతో కేంద్రమంత్రి ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ సందర్భంగా బడ్జెట్‌లో తమ రాష్ట్రానికి కేటాయింపులు అధికంగా చేయాలని రిక్వెస్ట్ చేసేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ ఢిల్లీకి వెళ్లారు.

ఏపీ నుంచి సీఎం చంద్రబాబు..

ఇక ఏపీ సీఎం చంద్రబాబు సైతం రెండ్రోజుల ముందే ఢిల్లీ పర్యటనకు వెళ్లారు.ఈసారి బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీకి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఆర్థికంగా ఏపీ చాలా వెనుకబడి ఉన్నది. రాష్ట్ర విభజన అంశాలతో పాటు పెండింగ్ పనుల అభివృద్ధికి ఈ బడ్జెట్‌లో నిధులు చాలా కీలకం కానుంది. ఈ క్రమంలోనే చంద్రబాబు ముందే వెళ్లి అమిత్ షాను కలిసినట్టు సమాచారం. ప్రస్తుతం ఎన్డీయేలో చంద్రబాబు కీలక భాగస్వామిగా ఉన్నందున నిధుల కేటాయింపుల్లో ఎలాంటి నిరాశ ఉండకపోవచ్చని చర్చ జరుగుతున్నది.

ఆశలన్నీ నిర్మలమ్మ పద్దుపైనే..

Advertisement

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మ పద్దుపై రెండు తెలుగు రాష్ట్రాలు గంపెడాశలు పెట్టుకున్నట్టు తెలుస్తున్నది. ఏపీ, తెలంగాణ విడిపోయిన సమయంలో నేటికి కొన్నిపరిష్కారం కానీ అంశాలున్నాయి.వాటికి జాతీయ హోదా, నిధుల కేటాయింపులు ఈసారైనా ఉంటాయా? అని రెండు రాష్ట్రాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. ముందుగా ఏపీ విషయానికొస్తే పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినందున దానికి పూర్తికి నిధులు, మరోవైపు రాజధాని అమరావతి అభివృద్ధికి సైతం నిధులు చాలా అవసరం. దీనికి తోడు జాతీయ రహదారులు, కేంద్ర చేపట్టే ప్రాజెక్టులు, విశాఖ మెట్రో, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి ప్రత్యేకంగా నిధులు అవసరం అవుతాయి. దీనిపై చంద్రబాబు ఇప్పటికే కేంద్ర హోంమంత్రికి విన్నవించి అత్యధిక నిధులు కేటాయించాలని కోరినట్టు సమాచారం.

తెలంగాణకూ నిధులు అవసరమే..

గతేడాది సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. యంగ్ ఇండియా స్కూల్స్, ఫ్యూచర్ సిటీ, ట్రిపుల్ ఆర్, మెట్రో రెండో దశ విస్తరణ, వరంగల్‌ ఎయిర్ పోర్టు పనులు, రైల్వే, రోడ్డు ప్రాజెక్టులు, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా, నిధుల కేటాయింపు వంటి అంశాలపై తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేయనున్నట్టు తెలిసింది. పైన పేర్కొన్న వాటి అభివృద్ధికి బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కేంద్ర ఆర్థిక మంత్రికి రిక్వెస్ట్ చేయనుంది. దీనికి తోడు జీఎస్టీ శ్లాబుల మార్పుల వలన రాష్ట్రానికి కలిగే నష్టాన్ని కేంద్రమే సర్దుబాటు చేయాలని కోరనున్నట్టు సమాచారం. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి 2026 ఆర్థిక బడ్జెట్ కీలకం కానుంది. మరి ఎవరికి ఎన్నినిధులు దక్కుతాయనేది తెలియాలంటే ఫిబ్రవరి 2వ తేదీ వరకు ఎదురు చూడాల్సిందే.

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×