E-Paper
Advertisement

Nail Biting Side Effects: సైలెంట్ ఎనిమీ.. గోర్లు కొరకడం వల్ల శరీరంలోకి చేరే వేలకోట్ల బ్యాక్టీరియా గురించి మీకు తెలుసా?

Nail Biting Side Effects: సైలెంట్ ఎనిమీ.. గోర్లు కొరకడం వల్ల శరీరంలోకి చేరే వేలకోట్ల బ్యాక్టీరియా గురించి మీకు తెలుసా?
Advertisement

Nail Biting Side Effects: చాలామందికి ఉండే కామన్ అలవాటు గోర్లు కొరకడం. ఏదైనా ఆలోచనలో పడినప్పుడు, టెన్షన్‌లో ఉన్నప్పుడు, ఖాళీగా కూర్చున్నా కూడా చేతివేళ్లు నేరుగా నోట్లోకి వెళ్తుంటాయి. అయితే, ఈ గోర్లు కొరికే చిన్న హాబిట్ వల్ల మన ఆరోగ్యానికి ఎంతో హాని తలపెడుతున్నామనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. దీనినే వైద్య పరిభాషలో ‘ఒనికోఫాగియా’ (Onychophagia) అని పిలుస్తారు. ఇది కేవలం ఒక అలవాటు అలవాటు మాత్రమే కాదు.. స్వయంగా మనమే మన శరీరంలోకి రోగాలను ఆహ్వానించే ఒక మార్గం. ఈ నేపథ్యంలో గోర్లు కొరకడం వలన కలిగే నష్టాలేమిటో తెలుసుకుందాం.

కంటికి కనిపించని విషం:

మన చేతులు రోజంతా రకరకాల వస్తువులను తాకుతుంటాయి. దానివల్ల గోళ్ల కింద వేల సంఖ్యలో బ్యాక్టీరియా, వైరస్‌లు తిష్ట వేస్తాయి. ఈ విషయంలో వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే.. మనం గోర్లు కొరికిన ప్రతిసారీ, ఆ మురికి నేరుగా మన కడుపులోకి వెళ్తుందని, ఇది ఒక రకంగా విషాన్ని మన చేతుల ద్వారా మనమే తిన్నట్లు అవుతుందని హెచ్చరిస్తున్నారు.

Advertisement

Also Read: వీలైతే ఈ పండును రోజూ తినండి.. ఎంతటి మొండి వ్యాధులైనా పారిపోవాల్సిందే!

పొట్ట సంబంధిత సమస్యలు:

గోళ్ల ద్వారా శరీరంలోకి చేరే ‘కోలిఫామ్’ వంటి ప్రమాదకర బ్యాక్టీరియా వల్ల వికారం, వాంతులు, కడుపునొప్పి, అతిసారం వంటి సమస్యలు తలెత్తుతాయి. గోర్లు కొరికే అలవాటు అలాగే కొనసాగితే.. జీర్ణవ్యవస్థ శాశ్వతంగా దెబ్బతినే అవకాశం ఉంది. అంతేకాదు.. గోళ్ల చుట్టూ ఉండే చర్మం ఎర్రగా కమిలిపోయి, చీము పట్టి ‘పరోనిచియా’ అనే ఇన్ఫెక్షన్‌కు కూడా దారితీయొచ్చు.

అనేక సమస్యలకు దారి తీయొచ్చు:

Advertisement

గోర్లు కొరకడం వలన కేవలం చేతి వేళ్లే కాదు.. మీ పళ్లు కూడా పాడవుతాయి. ఈ చిన్న అలవాటు మీ పళ్లపై ఉండే రక్షణ కవచాన్ని దెబ్బతీడమే కాకుండా.. పళ్ల అమరికను వంకరగా మార్చే ప్రమాదం కూడా ఉంటుంది. అలాగే చిగుళ్లలో వాపు, రక్తస్రావంతో పాటు నోటి దుర్వాసనకు కూడా కారణమవుతుంది.

ఈ అలవాటును మానేయాలంటే?

⇒ మీరు ఒత్తిడితోనా లేదా ఖాళీగా ఉన్నప్పుడు గోర్లు కొరుకుతున్నారా అనేది ఒకసారి గమనించుకోండి. దానికి తగ్గట్టుగా మెడిటేషన్ లేదా ఏదైనా పనిలో బిజీ అవ్వండి.

⇒ గోర్లను ఎప్పుడూ చిన్నగా కత్తిరించుకోండి. కొరకడానికి గోరు అందుబాటులో లేకపోతే ఆటోమేటిక్‌గా అలవాటు తగ్గుతుంది.

⇒ వేళ్ల చివరలకు చేదుగా ఉండే పదార్థాలు రాసుకోవడం లేదా బ్యాండేజ్ వేసుకోవడం వల్ల నోట్లో పెట్టుకున్న వెంటనే ఆ చేదు వల్ల అలవాటు గుర్తుకొస్తుంది.

⇒ పిల్లలు గోర్లు కొరుకుతుంటే.. వారిని తిట్టకుండా, అలా చేయడం వల్ల వచ్చే అనారోగ్యాల గురించి ప్రేమగా వివరించండి.

⇒ అందం కోసం మాత్రమే కాదు.. మీ ఆరోగ్యం కోసం కూడా గోళ్లను శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం.

Also Read: ప్రతిరోజూ నెయ్యి తింటున్నారా? అయితే ఈ ఆరోగ్య సమస్యలు మీ దరిచేరవు!

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×