E-Paper
Advertisement

MLA Daggupati Prasad: వైసీపీ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్, ఊర్లో లేనప్పుడు రచ్చ చేస్తారా? ఎమ్మెల్యే దగ్గుపాటి

MLA Daggupati Prasad: వైసీపీ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్, ఊర్లో లేనప్పుడు రచ్చ చేస్తారా? ఎమ్మెల్యే దగ్గుపాటి
Advertisement

MLA Daggupati Prasad: కొద్దిరోజులుగా వైసీపీ నేతల మాటలపై ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్.  తనపై YCP నాయకులు దండుపాళ్యం బ్యాచ్ అని మాట్లాడడం సీరియస్ అయ్యారు. గతంలో వైసీపీ అధికారంలో చేసిన అన్యాయాలు మీకు కనిపించలేదా అంటూ ప్రశ్నించారు. డ్రైవర్ సుబ్రమణ్యం, ఎస్సీ డాక్టర్ సుధాకర్ ఘటనలో మాటేంటని ప్రశ్నించారు.

వారం రోజులుగా తనపై దుష్ప్రచారం మొదలుపెట్టారని, మీ చీకటి రాజకీయాలు అన్ని మాకు తెలుసన్నారు. ముఖ్యంగా అనంత వైసీపీ మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డిపై రుసరుసలాడారు. మీరు, మీ అనుచరులు, మా పార్టీలో కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఊర్లో లేనప్పుడు ఇలాంటి ప్రచారాలు చేస్తారా? అసత్య ప్రచారం చేస్తున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని పోలీస్‌శాఖని కోరినట్టు ప్రస్తావించారు.

Advertisement

ఎగ్జిబిషన్ గొడవ చాలా చిన్నదని, మా కార్యకర్తలను రక్తం వచ్చే విధంగా కొట్టారని అన్నారు. మరుసటి రోజే ఎస్పీ‌ వద్దకు వెళ్లి 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని ఫిర్యాదు చేయడం దారుణమన్నారు. అసలు ఎగ్జిబిషన్ టర్నోవర్ 10 లక్షలు ఉండదన్నారు. ఎగ్జిబిషన్ కు పర్మిషన్ ఇప్పించింది తానేనని, నంబూరి వైన్స్‌పై దాడి ఘటనలో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.

ఆ సమయంలో తాను ఊర్లో లేనని భావించి, బురద చల్లుతున్నారని మండిపడ్డారు. మొదట దీని వెనుక ఎవరూ లేరని స్టేట్మెంట్ ఇచ్చారని, మళ్ళీ గంటకే దీని వెనుక ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఉన్నారని ఆరోపించడాన్ని తప్పుబట్టారు. అభివృద్ధి చేస్తుంటే మళ్ళీ ఎక్కడ ఎమ్మెల్యే ఇక్కడ స్టాండ్ అవుతాడోనన్న భయం వారికి పట్టుకుందన్నారు.

Advertisement

నిద్ర లేని నుంచి బురద జల్లడమే కార్యక్రమంగా పెట్టుకున్నారని, కబ్జాలు ఎవరు చేసినా ఉపేక్షించే సమస్య లేదన్నారు. స్వప్న భూమిని కబ్జా మాకు సంబంధించినది కాదని, అది ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారమని అన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే తాను ఆమెకు ఫోన్ చేశానని, లిఫ్ట్ చేయలేదన్నారు.

దానితో మాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ప్రతీ విషయాన్ని ఎమ్మెల్యేకు ఆపాదించడం అలవాటుగా మారిపోయిందని, నిన్న ఆడియో‌ ఎప్పుడో జరిగిందని, ఆ ఇష్యూ టూ టౌన్ సీఐ అప్పుడే పంచాయతీ చేశారన్నారు. మా పార్టీ వాటిని నిశితంగా పరిశీలిస్తుందని, చట్టం తన పని తాను చేసుకుపోతోందన్నారు. మా పార్టీలోని కొంతమంది సీనియర్లు చీకటి రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

Big Stories

Advertisement
×