E-Paper
Advertisement

Big tv Kissik Talks: రీతు చౌదరి అసలు పేరు ఇది కాదా.. ఆపేరు చుట్టూ నెగిటివిటీ ఉందంటూ!

Big tv Kissik Talks: రీతు చౌదరి అసలు పేరు ఇది కాదా.. ఆపేరు చుట్టూ నెగిటివిటీ ఉందంటూ!
Advertisement

Big tv Kissik Talks: రీతూ చౌదరి పరిచయం అవసరం లేని పేరు. సీరియల్ నటిగా తన కేరియర్ ప్రారంభించి పలు సీరియల్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రీతు అనంతరం జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా కూడా సందడి చేశారు. ఇలా జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న రీతు పలు కార్యక్రమాలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా ఈమె చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకునేవారు. ఇలా సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న రీతు బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు.

డెమోన్ అని పిలిచినా పర్వాలేదు..

బిగ్ బాస్ సీజన్ 9 రియాలిటీ షోలో పాల్గొన్న ఈమె 13 వారాలపాటు హౌస్ లో కొనసాగుతూ బయటకు వచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. బిగ్ బాస్ అనంతరం పలు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు. తాజాగా రీతు బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్(Big tv kissik talks) కార్యక్రమానికి హాజరయ్యారు .ఈ కార్యక్రమంలో భాగంగా తన వ్యక్తిగత విషయాల గురించి అలాగే వృత్తిపరమైన విషయాల గురించి కూడా మాట్లాడుతూ ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలోకి రాగానే వర్షా మాట్లాడుతూ నిన్ను డెమోన్ అని పిలవాలా? రీతు అని పిలవాలా? లేక దివ్య అని పిలవాలా అంటూ ప్రశ్నించింది.

రీతు అసలు పేరు దివ్యభారతి..

Advertisement

ఈ ప్రశ్నకు రీతు సమాధానం చెబుతూ..నన్ను డెమోన్ అనిపించిన పర్వాలేదు కానీ దయచేసి దివ్య అని మాత్రం పిలవద్దు ఆ పేరు వింటేనే నాకు చిరాకు వస్తుంది. ఆ పేరు చుట్టూ నెగిటివిటీ ఉన్న భావన కలుగుతుంది అంటూ మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే తన అసలు పేరు దివ్యభారతి(Divya Bharathi) అని ఈమె తెలియజేశారు. సర్టిఫికెట్స్ లో దివ్యభారతి అనే ఉంటుందని తాను ఏడో తరగతి చదివే సమయంలో తన పేరు కొత్తగా ఉండాలన్న ఉద్దేశంతో నా పేరును రీతు చౌదరిగా మార్చుకున్నానని తెలియజేశారు.

Advertisement

నిజానికి దివ్యభారతి అనే పేరును మా అమ్మ అమ్మమ్మ కలిసి పెట్టారు. మా అమ్మ హీరోయిన్ దివ్యభారతికి వీరాభిమాని అప్పుడు నాకు కూతురు పుడితే దివ్యభారతి అనే పేరు పెట్టాలని అనుకుందట అందుకే నాకు దివ్యభారతి అనే పేరు పెట్టారని ఆ పేరు పెట్టుకున్నప్పటినుంచి నాకు కలిసి రాకపోవడంతో ఏడో తరగతిలో రీతూ చౌదరి అనే పేరును అమ్మే పెట్టారు అంటూ తన పేరు వెనుక ఉన్న స్టోరీ మొత్తం ఈ సందర్భంగా రీతూ చౌదరి తెలియచేశారు. అందరికీ రీతూగానే పరిచయమైన ఈమె సర్టిఫికెట్స్ లో మాత్రం తన పేరు దివ్య భారతి గానే ఉందని తెలియచేశారు. ఇక ఇండస్ట్రీలో ఆర్టిస్టుగా కొనసాగుతూ రీతు ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈమె బీబీ జోడీ కార్యక్రమంలో డెమోన్ తో కలిపి కంటెస్టెంట్లుగా పాల్గొన్న సంగతి తెలిసిందే.

Also Read: Danush -Mrunal Thakur: ధనుష్ మృణాళ్ పెళ్లి .. క్లారిటీ ఇచ్చిన టీమ్!

Related News

ఈశ్వర్ సాయి కేసులో కొత్త ప్రశ్న.. ‘పెళ్లైనోడిని ఎలా నమ్మావ్ మాధురి?’

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Podarillu Today Episode : మహా మాటతో ఆది షాక్.. చక్రీ ప్లాన్ సక్సెస్.. మాధవ్ నిజం చెప్తాడా..?

Big Stories

Advertisement
×