E-Paper
Advertisement

Health Benefits of Pineapple: వీలైతే ఈ పండును రోజూ తినండి.. ఎంతటి మొండి వ్యాధులైనా పారిపోవాల్సిందే!

Health Benefits of Pineapple: వీలైతే ఈ పండును రోజూ తినండి.. ఎంతటి మొండి వ్యాధులైనా పారిపోవాల్సిందే!
Advertisement

Health Benefits of Pineapple: సీజన్‌తో సంబంధం లేకుండా అన్ని కాలాల్లోనూ దొరికే ఫ్రూట్స్‌లో పైనాపిల్ ఒకటి. దీనిని కట్ చేయడానికి కాస్త కష్టమే అయినప్పటికీ.. పైనాపిల్ వల్ల కలిగే ప్రయోజనాలు మాత్రం ఎక్కువే అని చెబుతున్నారు నిపుణులు.ఈ ఫ్రూట్‌లో బ్రొమెలెయిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. దీంతో ఎలాంటి ఔషధాలు లేకుండా దీర్ఘకాలిక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. అయితే ఈ పండును తరచూ తినడం వల్ల కాస్త పుల్ల పుల్లగా అనిపిస్తుంటుంది. కాబట్టి.. ముక్కలుగా కట్ చేసుకుని, దానిమీద కొద్దిగా ఉప్పు చల్లుకుని తినడం ఉత్తమం. ఈ నేపథ్యంలో పైనాపిల్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం.

⇒ పైనాపిల్‌లో బ్రోమెలైన్ అనే ప్రత్యేక ఎంజైమ్ ఉంటుంది. ఇది ఆహారంలోని ప్రోటీన్లను విభజించి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. దీని వల్ల పొట్టలో గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి.

Advertisement

Also Read: డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.. వారంలో రెండుసార్లు తలకాయ కూర తింటే జరిగేది ఇదే!

⇒ పైనాపిల్‌లో విటమిన్ C ఎక్కువగా ఉండటం వల్ల మన శరీరంలో తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచి ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. అంతేకాదు జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది.

Advertisement

⇒ బరువు తగ్గాలనుకునేవారికి పైనాపిల్ మంచి ఎంపిక. దీనిలో క్యాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ. కాబట్టి.. కొద్దిగా తిన్నా కూడా కడుపు నిండినట్లు అనిపిస్తుంది. తద్వారా అనవసరంగా ఆహారం తీసుకునే పద్ధతికి చెక్ పెట్టవచ్చు.

⇒ పైనాపిల్‌లోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతం చేసి ముడతలను లేకుండా చూస్తాయి. ప్రతిరోజూ పైనాపిల్ తీసుకోవడం వల్ల జుట్టురాలే సమస్య తగ్గి, మరింత దృఢంగా పెరుగుతుంది. అలాగే కంటి చూపును మెరుగుపరచడంలో ఈ ఫ్రూట్ కీలకపాత్ర పోషిస్తుంది.

⇒ ఈ ఫ్రూట్‌లోని బ్రోమెలైన్ యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు.. శరీరంలో వాపులు, గాయాలను తగ్గుస్తుంది. దీంతోపాటు ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్న వారికి పైనాపిల్‌‌లోని పోషకాలు ఉపశమనం కల్పిస్తాయి.

⇒ అయితే.. మధుమేహం, అల్సర్ సమస్యలు ఉన్నవారు లేదా గర్భిణీలు పైనాపిల్ తీసుకునే ముందు వైద్య సలహా తీసుకోవాలి. అలాగే బాగా పండిన పైనాపిల్‌ను మాత్రమే తినాలి. లేతగా లేదా ఒగరుగా ఉండే పండు తింటే.. గొంతు మంట లేదా కడుపులో అసౌకర్యం కలగవచ్చు.

Also Read: ఏడాదంతా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలంటే.. ఈ అలవాట్లను ఆచరణలో పెట్టేయండి బాస్!

 

 

Related News

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

Big Stories

Advertisement
×