E-Paper
Advertisement

డిటాక్స్ జ్యూస్‌లు వద్దే వద్దు.. గట్ హెల్త్ మెరుగుపరిచే సింపుల్ చిట్కాలు!

డిటాక్స్ జ్యూస్‌లు వద్దే వద్దు.. గట్ హెల్త్ మెరుగుపరిచే సింపుల్ చిట్కాలు!
Advertisement

Harvard doctor gut health tips: ఈ రోజుల్లో గట్ హెల్త్ లేదా పేగు ఆరోగ్యం పాడవ్వడం, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు చాలా కామన్ అయిపోయాయి. వీటి నుంచి రిలీఫ్ పొందడానికి చాలా మంది సోషల్ మీడియాలో చూసి రకరకాల ‘డెటాక్స్ డ్రింక్స్’ లేదా ‘క్లెన్స్ జ్యూస్‌లు’ తాగుతుంటారు. అయితే, వీటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, పైగా కొన్ని సార్లు ఆరోగ్యానికి కేనని హెచ్చరిస్తున్నారు హార్వర్డ్ శిక్షణ పొందిన డాక్టర్లు. ఖరీదైన డెటాక్స్ డ్రింక్స్ లేకుండానే.. పేగు ఆరోగ్యాన్ని మెరుగు,పరిచే 3 సింపుల్ అలవాట్లేంటో ఇప్పుడు చూద్దాం.

1. ఫైబర్ , ప్లాంట్ ఫుడ్స్ :
మన పేగుల్లో కోట్లాది మంచి బాక్టీరియాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యంగా.. ఉండటానికి ఫైబర్ (పీచు పదార్థం) చాలా అవసరం. డెటాక్స్ జ్యూస్‌లు తాగినప్పుడు ఫైబర్ కాస్త వేస్ట్ అయిపోతుంది. అందుకే.. జ్యూస్‌లకు బదులుగా రకరకాల ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, గింజలు, చిరు ధాన్యాలను నేరుగా ఆహారంలో భాగం చేసుకోవాలి. వారానికి కనీసం 20 నుంచి 30 రకాల విభిన్న ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ తినడం వల్ల పేగుల్లో ఉండే మంచి బాక్టీరియా బలపడి జీర్ణక్రియ వేగవంతమవుతుంది.

Advertisement

2. ఆహారాన్ని నమిలి తినడం:
మనం ఎంత మంచి ఆహారం తిన్నాం అనే దానికంటే, దాన్ని ఎలా తిన్నాం అనేదే ముఖ్యం! ప్రస్తుతం ఫాస్ట్ లైఫ్‌లో చాలా మంది ఆహారాన్ని నమల కుండా మింగేస్తుంటారు. జీర్ణ క్రియ అనేది నోట్లోనే ప్రారంభమవుతుంది. నోటిలోని లాలా జలంలో ఉండే ఎంజైములు ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయ పడతాయి. ఆహారాన్ని కనీసం 20-30 సార్లు బాగా నమిలి తింటే, పొట్టపై భారం తగ్గి గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు అసలే రావు.

3. నాణ్యమైన నిద్ర & స్ట్రెస్ మేనేజ్‌మెంట్ :

మన మెదడుకి, పేగులకి మధ్య నేరుగా కనెక్షన్ ఉంటుంది. దీనినే ‘గట్-బ్రెయిన్ యాక్సిస్’ అంటారు. మనం ఎక్కువ ఒత్తిడికి లోనైనప్పుడు లేదా సరిగ్గా నిద్ర పోనప్పుడు పొట్టలో ఆమ్లాలు ఎక్కువగా విడుదలై జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. రోజుకు 7 నుంచి 8 గంటల ప్రశాంతమైన నిద్ర పోవడం, యోగా లేదా వాకింగ్ ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవడం వల్ల పేగు గోడలు దెబ్బతినకుండా ఆరోగ్యంగా ఉంటాయి.

Advertisement

ఆరోగ్య కరమైన పేగుల కోసం మార్కెట్లో దొరికే ఖరీదైన ఫేక్ డెటాక్స్ ప్రొడక్ట్స్ వెంట పడాల్సిన అవసరం లేదు. మన సహజమైన లైఫ్ స్టైల్ లో ఈ 3 చిన్న మార్పులు చేసుకుంటే చాలు.. జీర్ణ క్రియ మెరుగుపడి, రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చు.

Tags

Related News

చిన్న పిల్లలు నిద్రలో ఎందుకు నవ్వుతారు? దీని వెనక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

సైట్ పెరుగుతోందని చెప్పే 10 వార్నింగ్ సైన్స్.. వెంటనే చెక్ చేసుకోండి!

ఇళ్ల గోడలకు పైన తెలుపు.. కింద ఎరుపు రంగు ఎందుకు? దాని వెనుక అసలు రహస్యం ఇదే

బిర్యానీ డెలివరీకి వెళ్తే.. సీఈఓ కుర్చీలో కూర్చోబెట్టారు.. ఆ తర్వాత ఏమైందంటే?

పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రమాదం.. ఈ 5 సంకేతాలను అసలు నిర్లక్ష్యం చేయకూడదు

జబ్బలు లూజ్‌గా ఉన్నాయని స్లీవ్‌లెస్ డ్రెస్‌లు ధరించడం లేదా.. ఈ వ్యాయామాలు చేస్తే టోన్డ్ షేప్

జలుబుతో ముక్కు మూసుకుపోయిందా.. శ్వాస తీసుకునేందుకు ఈజీ టిప్స్

Big Stories

Advertisement
×