E-Paper
Advertisement

Camphor Benefits: కర్పూరం గురించిన ఈ విషయాలు మీకు తెలుసా ?

Camphor Benefits: కర్పూరం గురించిన ఈ విషయాలు మీకు తెలుసా ?
Advertisement

Camphor Benefits: హిందూ మతంలో కర్పూరానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇదిలా ఉంటే కర్పూరం భౌతిక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. కర్పూరంలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. అంతే కాకుండా కర్పూరంలో ఉండే సమ్మేళనాలు ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడతాయి.

కర్పూరాన్ని అనేక శతాబ్దాలుగా ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తున్నారు. దీని నుంచి వచ్చే సుగంధ పరిమళం మనస్సును ప్రశాంతంగా ఉంచడమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలకు కూడా కలిగిస్తుంది.మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న కర్పూరానికి సంబంధించిన మరిన్ని విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

కర్పూరం యొక్క ప్రయోజనాలు:

నొప్పి నివారిణి:
కర్పూరం నొప్పిని తగ్గించడంలో సహాయపడే అనాల్జేసిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. కర్పూరం నూనెతో నొప్పి ఉన్న ప్రదేశంలో మసాజ్ చేయడం వల్ల తలనొప్పి, కండరాల నొప్పితో పాటు కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.

Advertisement

యాంటీ ఇన్ఫెక్షన్:
కర్పూరంలో బ్యాక్టీరియా, వైరస్‌లు, ఫంగస్‌లను చంపే యాంటిసెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. కాలిన గాయాలు, లేదా చిన్న చిన్న గాయాలపై కర్పూరం నూనెను పూయడం వల్ల ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గుతాయి. కర్పూరం నూనె గాయాలను ఈజీగా తగ్గిస్తుంది.

శ్వాసకోశ సమస్యలకు మేలు:

కర్పూరంలో డీకాంగెస్టెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి ముక్కు నాసికా రంధ్రాలలోని అడ్డంకులను తొలగించడంలో సహాయపడుతుంది. కర్పూరాన్ని ఉపయోగించడం వల్ల జలుబు, దగ్గు, సైనస్ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. తరుచుగా కర్పూరాన్ని వాడటం వల్ల శ్వాస కోశ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. అంతే కాకుండా జలుబు, వంటివి రాకుండా ఉంటాయి.

ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది:
కర్పూరం నుంచి వచ్చే సువాసన ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండామనస్సును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. కర్పూరాన్ని వేడి నీటిలో వేసి ఆవిరి తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇది ఒత్తిడిని తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.

చర్మానికి మేలు చేస్తుంది:
కర్పూరం మొటిమలు, మచ్చలు, చర్మంపై ఉన్న దురద వంటి వాటిని తగ్గిస్తుంది. ఇతర చర్మ సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. కర్పూరం నూనె చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ముఖ సౌందర్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది.

కర్పూరం వాడేటప్పుడు జాగ్రత్త..

కర్పూరాన్ని నేరుగా తినకూడదు.
చర్మానికి అప్లై చేసే ముందు కర్పూరం నూనెను కొబ్బరి నూనె వంటి క్యారియర్ ఆయిల్‌తో కలపండి.
గర్భిణీ స్త్రీలు, పిల్లలు కర్పూరాన్ని ఉపయోగించే ముందు వైద్యుడిని సంప్రదించాలి.
కళ్ళకు కర్పూరం తగలకుండా జాగ్రత్త పడండి.

Also Read: ఈ గింజలతో ఎముకలకు బలం !

కర్పూరం యొక్క ఇతర ఉపయోగాలు..
కర్పూరం కీటకాలను నివారించడానికి కూడా ఉపయోగిస్తారు.
ఇంటిలో సువాసన కోసం కర్పూరాన్ని కూడా ఉపయోగిస్తారు.
కర్పూరాన్ని మతపరమైన ఆచారాలలో కూడా ఉపయోగిస్తారు.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

Big Stories

Advertisement
×