BigTV English

Soybeans Benefits: ఈ గింజలతో ఎముకలకు బలం !

Soybeans Benefits: ఈ గింజలతో ఎముకలకు బలం !

Soybeans Benefits: సోయాబీన్‌తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వీటిలోని పోషకాలు శరీరానికి మేలు చేస్తాయి. ఇందులో ఉండే ప్రొటీన్లు శరీరాన్ని దృఢంగా మార్చేందుకు పని చేస్తాయి. సోయాబీన్‌లో ప్రోటీన్‌తో పాటు మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. సోయాబీన్‌ను తరుచుగా ఆహారంలో భాగంగా చేర్చుకోవడం ద్వారా శరీరానికి ఎంతో మేలు చేకూరుతుంది. చెడు కొలెస్ట్రాల్ సమస్యతో పోరాడుతున్న వారు కూడా సోయాబీన్ తినవచ్చు.


సోయాబీన్ నూనెలను కూడా చాలా మంది వంటలు చేయడానికి వినియోగిస్తారు. అంతే కాకుండా సోయాబీన్‌ని నీటిలో నానబెట్టి కూడా సలాడ్ లాగా చేసుకుని తింటూ ఉంటారు. మరి కొంత మంది సోయాబీన్ పాలు తాగడానికి ఇష్టపడతారు. సోయాబీన్ తీసుకోవడం వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలను గురించి తెలుసుకుందాం.

సోయాబీన్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..


ప్రోటీన్ యొక్క అద్భుతమైన మూలం:
సోయాబీన్‌లో చాలా ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. ఇందులో మాంసాహారానికి సమానమైన ప్రోటీన్ ఉంటుంది. మాంసాహారం తీసుకోని వారికి ఇది మంచి ఎంపిక.

గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది:
ఐసోఫ్లేవోన్‌లు సోయాబీన్‌లో అధికంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో, మంచి కొలెస్ట్రాల్ పెంచడంలో సహాయపడతాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

ఎముకలను బలపరుస్తుంది:
సోయాబీన్‌లో కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉన్నాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. ఇది బోలు ఎముకల వ్యాధుల నుండి రక్షిస్తుంది.

బరువు తగ్గడంలో సహాయకారిగా ఉంటుంది:
సోయాబీన్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. సోయాబీన్ తినడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండుగా అనిపిస్తుంది. ఫలితంగా బరువు తగ్గడంలో ఇది సహాయపడుతుంది.  తరుచుగా సోయాబీన్ తినడం వల్ల శరీరానికి తగిన పోషకాలు అందుతాయి.  ఇవి బరువు తగ్గడంలో  ఎంతగానో ఉపయోగపడతాయి.

Also Read: ఈజీగా బరువు తగ్గండిలా ?

క్యాన్సర్ రక్షణ:
కొన్ని అధ్యయనాలు సోయాబీన్స్‌లో ఉండే ఐసోఫ్లేవోన్‌లు రొమ్ము క్యాన్సర్ వంటి ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయని వెల్లడించాయి. అంతే కాకుండా మరి కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా కూడా ఇవి సహాయపడతాయి.

సోయాబీన్‌ను ఈ విధంగా తినవచ్చు..

సోయాబీన్‌ను నానబెట్టి తినండి
సోయాబీన్ పాలు తయారు చేసుకుని కూడా తాగొచ్చు
సోయా బీన్ ఉడికించి సలాడ్ లాగా చేసి కూడా తీసుకోవచ్చు.
సోయాబీన్‌తో కర్రీస్ చేసుకుని కూడా తినవచ్చు.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Food: ఖాళీ కడపుతో.. పొరపాటున కూడా ఇవి తినొద్దు తెలుసా ?

Cancer Risk: వంటగదిలో ఉన్న ఈ ఆహార పదార్థాలతో.. క్యాన్సర్‌కు చెక్

Ritika Nayak: జోరు పెంచిన మిరాయ్ బ్యూటీ.. ఘనంగా స్టోర్ లాంఛ్

Hand Dryer: పరిశుభ్రత పేరుతో అనారోగ్యం.. వామ్మో ఇంత డేంజరా ?

Diabetes health Tips: డయాబెటిస్‌కు సులువైన పరిష్కారం.. ఈ పండు ఆకు నీటిని తాగితే చాలు!

Walking: డైలీ 20 నిమిషాలు నడిస్తే.. ఈ వ్యాధులన్నీ పరార్ !

Food and Age: ఇలాంటి ఫుడ్ తింటే.. త్వరగా ముసలి వాళ్లవుతారట !

Food For Better Digestion: భోజనం చేసాక ఇవి తింటే.. జీర్ణ సమస్యలు దూరం

Big Stories

×