E-Paper
Advertisement

Nutmeg Benefits: జాజికాయ మజాకా ! ఇలా వాడితే.. మందులు వాడాల్సిన అవసరమే ఉండదు

Nutmeg Benefits: జాజికాయ మజాకా ! ఇలా వాడితే.. మందులు వాడాల్సిన అవసరమే ఉండదు
Advertisement

Nutmeg Benefits:  ఈ రోజుల్లో.. మనమందరం చిన్న చిన్న వ్యాధులకే డాక్టర్ల దగ్గరికి పరిగెత్తుతున్నాం. ఎందుకంటే మన వంటగదిలోని అనేక పదార్థాల ప్రయోజనాల గురించి మనకు పూర్తిగా తెలియదు. వంటగదిలో సుగంధ ద్రవ్యాల్లో పుష్కలంగా ఔషధ గుణాలు దాగి ఉంటాయి. వాటిలో జాజికాయ ఒకటి. మనం దీనిని తరచుగా వంటకాల్లో ఉపయోగిస్తాము. కానీ దీని ఔషధ గుణాల గురించి చాలా మంది పెద్దగా అవగాహన ఉండదు.

Advertisement

ప్రతి ఒక్కరి వంట గదిలో ఉండే మసాలా దినుసుల్లో జాజికాయ కూడా ఒకటి. ఇది కేవలం మసాలా దినుసు మాత్రమే కాదు, జలుబు ,ఫ్లూ నుంచి నిద్రలేమి, జీర్ణక్రియ , రోగనిరోధక శక్తి వంటి అనేక రకాల సమస్యలకు సహాయపడే సహజ హోం రెమెడీ. చిన్న చిన్న రోజువారీ సమస్యలకు దీనిని ఉపయోగించడం ఆరోగ్యానికి, అందానికి బోలెడు లాభాలుంటాయి.

ప్రకృతి ప్రసాదించిన ఈ అద్వితీయమైన జాజికాయను కొద్దిగా వాడటం వల్ల మన చర్మపు మచ్చలు తొలగిపోయి, కాంతివంతంగా ఉండటమే కాకుండా.. వివిధ వ్యాధుల నుంచి మనల్ని దూరంగా ఉంచుతుంది. ముఖ్యంగా చలికాలంలో దీని వాడకం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. జాజికాయకు లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. ఈ రోజు మనం దాని ఎనిమిది ప్రధాన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

Advertisement

జాజికాయ ఆరోగ్య ప్రయోజనాలు:

చలి నుంచి రక్షిస్తుంది:

చలికాలంలో వచ్చే జలుబు, దగ్గుకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక చిన్న జాజికాయ ముక్కను గీరి.. దాని పొడిని చిటికెడు ప్రతి రోజు తినండి. చలికాలం అంతా ప్రతి రోజు లేదా రెండు రోజులకు ఒకసారి ఇలా చేయడం వల్ అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. అంతే కాకుండా ఇది శరీరానికి సహజమైన వెచ్చదనాన్ని అందిస్తుంది. వ్యాధుల నుండి దూరంగా ఉంచుతుంది. పిల్లలను జలుబు నుంచి రక్షించడానికి కూడా జాజికాయ చాలా బాగా ఉపయోగపడుతుంది.

దగ్గు, జలుబు:

ముఖం లేదా చర్మంపై ఉన్న మచ్చలను తొలగించడానికి జాజికాయ బెస్ట్ హోం రెమెడీ. జాజికాయను నీటితో కలిపి ఒక రాయిపై రుబ్బి పేస్ట్ లా చేసి మచ్చలపై అప్లై చేయండి. ఇది మచ్చలను వదిలించుకోవడానికి అంతే కాకుండా మీ చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి సహాయ పడుతుంది. జాజికాయ పొడిని తేనెతో కలిపి పేస్ట్ లాగా చేసి ముఖానికి అప్లై చేస్తే అది క్లియర్ అవుతుంది. ఇది మొటిమల మచ్చలను కూడా తొలగిస్తుంది. అంతే కాకుండా దీనిని ఫేస్ ప్యాక్ లాగా ఉపయోగించడం వల్ల కూడా అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.

జీర్ణవ్యవస్థకు మేలు:

మీ రోజువారీ ఆహారంలో జాజికాయను చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియ సులభతరం అవుతుంది. దీనిలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా.. విరేచనాలు, ఆమ్లతత్వం, మలబద్ధకం వంటి ఇతర కడుపు సమస్యలకు కూడా సహాయపడుతుంది. పిల్లలు తరచుగా జీర్ణ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటార. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీనిని క్రమం తప్పకుండా పాలలో జాజికాయ పౌడర్ చేర్చి పిల్లలకు అందించడం వల్ల అన్ని సమస్యలు తొలగిపోతాయి. అంతే కాకుండా వారి ఆకలి పెరుగుతుంది.

Also Read: పచ్చి బొప్పాయి వారానికి 3 సార్లు తింటే.. ఈ రోగాలు రమ్మన్నా రావు

నిద్రలేమి సమస్య:

ఈ రోజుల్లో బిజీ లైఫ్ స్టైల్, ఒత్తిడి కారణంగా నిద్రలేమి ఒక సాధారణ సమస్యగా మారింది. మీరు కూడా నిద్రలేమితో బాధపడుతుంటే.. జాజికాయను తీసుకోవడం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పడుకునే ముందు ఒక గ్లాసు గోరు వెచ్చని పాలలో చిటికెడు జాజికాయను కలిపి తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతుంటారు. 

డయాబెటిస్‌:

డయాబెటిస్ నేడు చాలా సాధారణ వ్యాధిగా మారింది. ప్రస్తుతం మారుతున్న లైఫ్ స్టైల్ కారణంగా చాలా మంది చిన్న వయస్సులోనే షుగర్ వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. అయితే.. దీనిని నియంత్రించడానికి సకాలంలో చర్యలు తీసుకోవడం చాలా అవసరం. జాజికాయలోని ట్రైటెర్పీన్‌లు యాంటీ-డయాబెటిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. అందుకే దీనిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంటాయి

Related News

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

Big Stories

Advertisement
×