E-Paper
Advertisement

Health Tips: ఆల్కహాల్‌తో పాటు సిగరెట్ తాగుతున్నారా? మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా ?

Health Tips: ఆల్కహాల్‌తో పాటు సిగరెట్ తాగుతున్నారా? మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా ?
Advertisement

Health Tips: ఆల్కహాల్ తీసుకోవడం, స్మోకింగ్ అనేవి ఆరోగ్యానికి హానికరమని మనందరికీ తెలుసు.అయితే ఈ రెండింటినీ కలిపి తీసుకున్నప్పుడు అవి శరీరంలో ఒక ‘విషపూరితమైన కలయిక లాగా పనిచేస్తాయి. వీటి మధ్య ఉండే సినర్జిస్టిక్ ఎఫెక్ట్ కారణంగా.. విడి విడిగా కలిగించే నష్టం కంటే కలిపి తీసుకున్నప్పుడు కలిగే నష్టం కొన్ని రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఆల్కహాల్, సిగరెట్ ఒకే సారి తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1. క్యాన్సర్ ముప్పు రెట్టింపు అవుతుంది:
ఆల్కహాల్.. నోరు, గొంతులోని కణజాలాన్ని మెత్తబరిచి, స్మోకింగ్ వల్ల శరీరంలోకి వెళ్లిన రసాయనాలు రక్తంలోకి సులభంగా చేరడానికి మార్గం సుగమం చేస్తుంది. దీని వల్ల నోరు, గొంతు, అన్నవాహిక, కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం విపరీతంగా పెరుగుతుంది. ఒక పరిశోధన ప్రకారం.. ఈ రెండూ అలవాట్లు ఉన్నవారికి క్యాన్సర్ వచ్చే అవకాశం సాధారణ వ్యక్తుల కంటే 30 రెట్లు ఎక్కువగా ఉంటుంది.

Advertisement

2.గుండెపై తీవ్ర ప్రభావం:
మద్యం రక్తపోటును పెంచుతుంది. పొగ తాగడం వల్ల ధమనులు కుంచించుకుపోతాయి. ఈ రెండింటి కలయిక వల్ల గుండె వేగం పెరిగి, గుండె కండరాలపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. ఇది అరిథ్మియా (గుండె కొట్టుకోవడంలో అసమానతలు), హార్ట్ ఎటాక్ , స్ట్రోక్ వచ్చే అవకాశాలను పెంచుతుంది.

3. కాలేయానికి తీవ్ర నష్టం:
కాలేయం శరీరం నుంచి ఆల్కహాల్‌ను క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అదే సమయంలో పొగ తాగడం వల్ల వచ్చే విషపూరిత రసాయనాలు కాలేయంపై అదనపు భారాన్ని మోపుతాయి. ఇది సిర్రోసిస్, క్రానిక్ లివర్ డిసీజ్‌కు దారితీస్తుంది.

Advertisement

4.మెదడు పని తీరు మందగించడం:
మద్యం , నికోటిన్ రెండూ మెదడులోని రసాయన సమతుల్యతను దెబ్బతీస్తాయి. నికోటిన్ మెదడును ప్రేరేపిస్తే , ఆల్కహాల్ దానిని మందగింపజేస్తుంది. ఈ విరుద్ధమైన చర్యల వల్ల మెదడు అయోమయానికి గురవుతుంది. దీని వల్ల నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గడం, జ్ఞాపకశక్తి క్షీణించడం, దీర్ఘకాలంలో ‘డిమెన్షియా’ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

Also Read: గ్యాస్ సిలిండర్ పేలుతుంది జాగ్రత్త.. వెంటనే ఇలా చేయండి !

5. నిద్ర, మానసిక ఆరోగ్యం:
మద్యం తీసుకున్నప్పుడు నిద్ర వస్తున్నట్లు అనిపించినా, అది గాఢ నిద్రను పాడు చేస్తుంది. దీనికి తోడు నికోటిన్ ఒక ఉత్తేజితం కాబట్టి, ఇది నిద్రలేమికి కారణమవుతుంది. ఫలితంగా మరుసటి రోజు విపరీతమైన అలసట, చిరాకు , ఆందోళన పెరుగుతాయి.

6. పోషకాల లోపం:
ఈ రెండింటి కలయిక వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు (ముఖ్యంగా విటమిన్ B12, ఫోలేట్), ఖనిజాలను గ్రహించే శక్తి తగ్గుతుంది. ఇది రోగ నిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. దీని వల్ల ఇన్ఫెక్షన్లు త్వరగా సోకుతాయి.

ఆల్కహాల్, స్మోకింగ్ ఒకదానికొకటి సహకరించుకుంటూ శరీరంలోని ప్రతి అవయవాన్ని దెబ్బతీస్తాయి. ఆరోగ్యకరమైన జీవితం కోసం ఈ రెండింటికీ దూరంగా ఉండటమే శ్రేయస్కరం. ఒక్కసారిగా మానేయడం కష్టమనిపిస్తే, వైద్యుల సలహా లేదా కౌన్సెలింగ్ తీసుకోవడం ఉత్తమం.

Related News

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

Big Stories

Advertisement
×