E-Paper
Advertisement

వేసవిలో ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా? ఈ ప్రమాదం పొంచిఉన్నట్లే.. హెచ్చరిస్తున్న డాక్టర్లు

వేసవిలో ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా? ఈ ప్రమాదం పొంచిఉన్నట్లే.. హెచ్చరిస్తున్న డాక్టర్లు
Advertisement

Energy Drinks Dehydration| వేసవి కాలంలో ఎండల వల్ల చెమట రూపంలో శరీరం నుంచి నీరు ఎక్కువగా వస్తుంది. దీంతో శరీరం నీరసంగా అయిపోతుంది. చాలా మంది తక్షణ ఎనర్జీ కోసం ఎనర్జీ డ్రింక్స్ తాగుతుంటారు. ఎనర్జీ డ్రింక్స్ శరీరానికి నీళ్ల లాగే హైడ్రేషన్ ఇస్తాయని అనుకుంటారు. ఇది పూర్తిగా నిజం కాదు. ముఖ్యంగా వేసవి కాలంలో ఎనర్జీ డ్రింక్స్ అసలు నీళ్ల లాంటి ఉపశమనం ఇవ్వలేవు.

ఎనర్జీ డ్రింక్స్ తక్షణ శక్తి ఇస్తాయని వాటిని తయారు చేసే కంపెనీలు ప్రచారం చేసుకుంటున్నాయి. కానీ అవి శరీరానికి హాని చేస్తాయి. ని నీటి సమతుల్యతను దెబ్బతీస్తాయి. బెంగుళూరుకు చెందిన డాక్టర్ బృంద ఎంఎస్, ఇంటర్నెల్ మెడిసిన్ సీనియర్ కన్సల్టెంట్, ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే ఆరోగ్య సమస్యల గురించి హెచ్చరించారు.

మూత్రం ద్వారా ఎక్కువ నీటిని విసర్జించే ఎనర్జీ డ్రింక్స్

Advertisement

ఎనర్జీ డ్రింక్స్‌లో కెఫీన్ ఉంటుంది. కెఫీన్ వలన శరీరం ఎక్కువ నీటిని మూత్రం ద్వారా బయటకు పంపిస్తుంది. ఎనర్జీ డ్రింక్స్‌లో చాలా ఎక్కువ మోతాదులో కెఫీన్ ఉంటుంది. కెఫిన్ ఒక విధమైన మూత్రవిసర్జకంలా పనిచేస్తుంది. అంటే, ఇది మూత్రం ఎక్కువగా వచ్చేలా చేస్తుంది. తరచుగా మూత్రం వెళ్ళడం వలన శరీరం నుండి ఎక్కువ నీరు బయటకు పోతుంది. వేసవిలో చెమట ద్వారా శరీరం ఒకవైపు నీరు కోల్పోతుంటే, మరోవైపు కెఫిన్ మరింత నీటిని తగ్గిస్తుంది. దీని వలన నిర్జలీకరణ (డిహైడ్రేషన్) ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది.

ఎనర్జీ డ్రింక్స్‌లో ఎక్కువ చక్కెర వల్ల ప్రమాదం

ఎనర్జీ డ్రింక్స్‌లో చాలా ఎక్కువ మోతాదులో చక్కెర కూడా ఉంటుంది. శరీరం నీటిని గ్రహించే విధానానికి ఈ ఎక్కువ చక్కెర ఆటంకం కలిగిస్తుంది. దీని వలన దాహం మరింత పెరుగుతుంది. అలసట కూడా ఎక్కువగా అనిపిస్తుంది. ఎనర్జీ డ్రింక్స్‌ తాగడం వల్ల శరీరానికి జీరో క్యాలరీస్ మాత్రమే ఇస్తాయి తప్ప హైడ్రేషన్ లభించదు. ఈ కారణంగా దీర్ఘకాలంలో ఇవి చాలా ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి.

ఎనర్జీ డ్రింక్స్‌తో తాత్కాలిక శక్తి మాత్రమే

Advertisement

ఎనర్జీ డ్రింక్స్ కెఫిన్ వలన కొద్దిసేపు మాత్రమే శక్తిని ఇస్తాయి. ఈ ప్రభావం చాలా త్వరగా పోతుంది. కొంత సమయం తర్వాత శరీరానికి మరింత అలసటగా అనిపిస్తుంది. ఈ ప్రక్రియం వల్ల మీరు మరింత అలసిపోతారు.

గుండె ఆరోగ్యం, మూత్రపిండాలకు తీవ్ర ప్రమాదం

ఎనర్జీ డ్రింక్స్ గుండె వేగాన్ని, రక్తపోటును పెంచుతాయి. వేసవి వేడిలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. అలాగే, మూత్రపిండాలు సరిగ్గా పనిచేయడానికి తగిన హైడ్రేషన్ చాలా ముఖ్యం. ఎనర్జీ డ్రింక్స్ ఈ ప్రక్రియకు అడ్డంకిగా మారుతాయి. వీటిని తరచుగా తాగడం వలన మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది.

నీరు మాత్రమే సురక్షితమైన హైడ్రేషన్ వనరు

శరీరానికి నీరు మాత్రమే అత్యంత సురక్షితమైన హైడ్రేషన్ మూలం. నీరు శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచుతుంది. ఎనర్జీ డ్రింక్స్ లాగా, నీటిలో ఎలాంటి హానికరమైన పదార్థాలు ఉండవు. క్రమం తప్పకుండా నీరు తాగడం వలన శరీరం చురుగ్గా, ఆరోగ్యంగా ఉంటుంది.

హైడ్రేషన్ కోసం మంచి ప్రత్యామ్నాయాలు ఇవే

ఎనర్జీ డ్రింక్స్ బదులు కొబ్బరి నీళ్ళు తాగండి. కొబ్బరి నీళ్ళలో సహజ ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. నిమ్మ రసం కూడా చాలా మంచిది. మజ్జిగ జీర్ణక్రియకు సహాయం చేస్తుంది. హైడ్రేషన్ ఇస్తుంది. తాజా ఫ్రూట్ జ్యూస్ కూడా పోషకాలు, ద్రవాలు రెండింటినీ ఇస్తాయి.

Also Read: ఇంటికి దిష్టి దోషం నుంచి రక్షించేందుకు మంగళవారం ఇలా చేయండి.. వాస్తు టిప్స్ మీ కోసం

సులభమైన చిట్కాలతో శరీరంలో హైడ్రేషన్

రోజంతా క్రమం తప్పకుండా నీరు తాగుతూ ఉండండి. దాహం వేసే వరకు వేచి ఉండకండి. ఎనర్జీ డ్రింక్స్‌తో నీటిని ఎప్పటికీ మార్చకండి. కెఫిన్ కలిగిన డ్రింక్స్, చక్కెర పానీయాలు తగ్గించండి. బయటకు వెళ్ళేటప్పుడు ఎప్పుడూ వాటర్ బాటిల్ మీ వెంట తీసుకెళ్ళండి.

Related News

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

Big Stories

Advertisement
×