E-Paper
Advertisement

ఓటీటీని వణికిస్తున్న జాంబి మూవీస్… క్లైమాక్స్ వరకు కేకలే

ఓటీటీని వణికిస్తున్న జాంబి మూవీస్… క్లైమాక్స్ వరకు కేకలే
Advertisement

Best Zombie Horror Movies on OTT : ప్రపంచంలో హారర్ జానర్‌కు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. అందులోనూ ‘జాంబీ’ సినిమాలను చూస్తుంటే వచ్చే కిక్కే వేరు. ఆకలితో అలమటించే శవాలు, వాటి నుండి ప్రాణాలను కాపాడుకునే మనుషుల పోరాటం ప్రేక్షకులను క్లైమాక్స్ వరకు కుర్చీ అంచున కూర్చోబెడతాయి. అందుకే అలాంటి సినిమాలు అస్సలు మిస్ కాకూడదు. ఈ వీకెండ్ ఎంజాయ్ చేయడానికి కేక పుట్టించే కొన్ని బెస్ట్ జాంబీ సినిమాలపై ఓ లుక్ వేద్దాం.

1. Train to Busan (2016)

కొరియా నుండి వచ్చిన ఈ మూవీ జాంబీ సినిమాల చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఒక తండ్రి, తన కూతురిని తీసుకుని సియోల్ నుండి బుసాన్ వెళ్లే రైలు ఎక్కుతాడు. కానీ అదే సమయంలో దేశమంతా జాంబీ వైరస్ వ్యాపిస్తుంది. రైలులో ఉన్న కొద్దిమంది ప్రయాణికులు జాంబీలతో పోరాడుతూ ఎలా తప్పించుకున్నారనేది ఇందులో అద్భుతంగా చూపించారు. ఇందులోని ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్స్ మిమ్మల్ని చూపు తిప్పుకోనివ్వవు. ఇది Netflix, Jio hotstar, Amazon Prime Videoలో అందుబాటులో ఉంది.

2. World War Z (2013)

Advertisement

బ్రాడ్ పిట్ హీరోగా నటించిన ఈ భారీ బడ్జెట్ సినిమా, ప్రపంచవ్యాప్తంగా జాంబీ వైరస్ ఎంత వేగంగా వ్యాపిస్తుందో కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. వేలాది జాంబీలు గోడలు ఎక్కుతూ దాడి చేసే సీన్స్ ఒళ్ళు గగుర్పాటు కలిగిస్తాయి. ఒక మాజీ యూఎన్ ఇన్వెస్టిగేటర్ ఈ మహమ్మారికి పరిష్కారం ఎలా కనుగొన్నాడనేది ఇక్కడి కథ. దీనిని Netflix, Amazon Prime Video, ZEE5లో చూడచ్చు.

3. Zombieland (2009)

జాంబీ సినిమాలంటే భయమే కాదు, కామెడీ కూడా ఉండొచ్చని నిరూపించిన సినిమా ఇది. కొంతమంది సర్వైవర్స్ కలిసి జాంబీలు ఉన్న ప్రపంచంలో ఎలా ప్రయాణించారో ఫన్నీగా చూపించారు. ఉత్కంఠతో పాటు నవ్వును కూడా పంచే సినిమా ఇది. Netflix, SonyLIVలో ఇది అందుబాటులో ఉంది.

4. Warm Bodies (2013)

Advertisement

ఇది ఒక వెరైటీ జాంబీ లవ్ స్టోరీ. ఒక జాంబీ అమ్మాయిని చూసి ప్రేమలో పడటం, ఆ ప్రేమ వల్ల హీరో పడ్డ పాట్లతో ఇది చాలా కొత్తగా ఉంటుంది. ఒక రొమాంటిక్ కామెడీ హారర్ చూడాలంటే దీనిని ఎంచక్కా చూసేయచ్చు. Netflix, Lionsgate Playలో ఇది అందుబాటులో ఉంది.

5. 28 Weeks Later (2007)

‘రేజ్ వైరస్’ అనే కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా చాలా సీరియస్‌గా సాగుతుంది. లండన్ నగరం మొత్తం నిర్మానుష్యంగా మారడం, వేగంగా పరుగెత్తే జాంబీలతో ప్రేక్షకులు కూడా బిత్తరపోతారు. జాంబీ సినిమాల్లో ఇది కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. ప్రస్తుతం ఇది Apple TV లో రెంటల్ రూపంలో చూడవచ్చు. ఈ వీకెండ్ ఫ్యామిలీతో కలసి వీటిని చూస్తూ బాగా థ్రిల్ అవ్వచ్చు.

Read Also : 1 గంట 56 నిమిషాల ఈ థ్రిల్లర్ లో చివరి వరకు హంతకుడిని కనిపెట్టలేరు

Tags

Related News

రియాలిటీ షోస్ నుండి యానిమేషన్ వరకు… జియోహాట్‌స్టార్ లో ఈ వారం సిరీసుల సందడి

రాచరిక ముసుగులో రాజద్రోహం… చాట్ జీపీటీ, నానో బనాన వంటి ఏఐలతో తీసిన సిరీస్

అందమైన అమ్మాయిలతో ట్రాప్ చేయించి ఇదేం పాడు పని… అనుమానంతో అరాచకం

పెళ్లి కాకుండానే పేరెంట్స్… వియ్యంకుల మధ్య మొదలైన వింత బంధం… ఫీల్ గుడ్ కొరియన్ సిరీస్ తెలుగులో

భూతాలు లేవు, దెయ్యాలు లేవు… అయినా గుండెల్లో రైళ్లు పరిగెత్తించే హారర్ థ్రిల్లర్… 7.9 రేటింగ్

వింత వింత జంతువులతో క్రేజీ అడ్వెంచర్… తెలుగులోనే ఈ కిడ్స్ అండ్ ఫ్యామిలీ ధమాకా

గంటకి 300 కిలోమీటర్ల వేగం… బుల్లెట్ ట్రెయిన్‌లో డెడ్లీ కిల్లర్స్ వేట… తెలుగులో స్ట్రీమింగ్

రోజుకొకరితో బ్లైండ్ డేట్… ట్రయాంగిల్ లవ్ స్టోరీ… ప్రేమలో గెలవడానికి ప్రాక్టికల్ చిట్కాలున్న కొరియన్ సిరీస్ తెలుగులో

Big Stories

Advertisement
×