E-Paper
Advertisement

మీ వద్ద అప్పు తీసుకొని తిరిగి ఇవ్వాలనే ఉద్దేశం లేనివారిని ముందే గుర్తుపట్టండి.. ఇవే లక్షణాలు

మీ వద్ద అప్పు తీసుకొని తిరిగి ఇవ్వాలనే ఉద్దేశం లేనివారిని ముందే గుర్తుపట్టండి.. ఇవే లక్షణాలు
Advertisement

Body Language Of Loan Defaulters| ఎవరికైనా మీ డబ్బు రుణంగా ఇవ్వాలంటే కాస్త సంకోచంగా ఉంటుంది. తీసుకునేవారు తరచు డబ్బు తిరిగి ఇస్తామని వాగ్దానం చేస్తారు, కానీ ఆలస్యం చేస్తారు లేదా తప్పించుకుంటారు. రుణం తీసుకునే సమయంలో వారి మాటలు నమ్మదగినవిగా అనిపించవచ్చు, వారు సమయానికి తిరిగి చెల్లించకుండా వాయిదాలు వేస్తుంటారు. లేదా నిర్లక్ష్యంగా ఉంటారు. అలాంటి వారిని ముందే గుర్తు పట్టేందుకు వారిలో కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు. ఈ లక్షణాలు జాగ్రత్తగా గమనించడం వలన మీరు వారి నిజమైన ఉద్దేశాలను పసి గట్టవచ్చు.

ఇతరుల డబ్బుని తెలివిగా కాజేయాలనే వారిలో గుర్తించదగ్గ లక్షణాలు

రుణం తిరిగి చెల్లించాలనే ఉద్దేశం లేని వారు ముందు తాము తప్పకుండా చెల్లిస్తామని వాగ్దానాలు చేసినా.. వారి శరీర భాష అంటే ముఖ హావభావాలు, శరీర కదలికలు.. ఆ వ్యక్తి చెప్పేది అబద్ధమని సూచిస్తాయి. ఈ సంకేతాలు తరచుగా ఆ వ్యక్తిలోని అసౌకర్యం లేదా అసత్యాన్ని బయటపెడతాయి. డబ్బు గురించి మాట్లాడేటప్పుడు, వారి ప్రతిచర్యలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. చిన్న సంకేతాల ద్వారా మీరు వారి సంకోచాన్ని గుర్తించవచ్చు.

మొదటి సంకేతం: వారి కళ్లను బాగా గమనించండి

Advertisement

రుణం ఎగవేయాలని ఉద్దేశం ఉన్నవారు మీతో మాట్లాడే సమయంలో నేరుగా మీ కళ్లలోకి చూడడానికి ఇబ్బందిపడతారు. అందుకే వారి ద‌ృష్టిని తరుచూ తప్పించుకుంటారు. కిందికి, పక్కకి, లేదా ఇతర వస్తువుల వైపు చూస్తూ ఉంటారు. ఇది గమనిస్తే వారిలో అసౌకర్యాన్ని లేదా మీతో బాగా మాట్లాడడానికి ఇష్టపడకపోవడాన్ని చూపిస్తుంది. నిజాయితీగల వ్యక్తులు సాధారణంగా నేరుగా మీతో కళ్లలోకి చూస్తూ మాట్లాడతారు.

రెండవ సంకేతం: నకిలీ చిరునవ్వు

నిజమైన చిరునవ్వులో కళ్లలో మెరుపు, ముఖ కండరాల కదలిక ఉంటాయి. కానీ రుణం ఎగవేసేవారు, అబద్ధం చెప్పవారు నకిలీ చిరునవ్వు చూపిస్తారు. వారి ముఖంలో సంకోచం కనిపిస్తుంది. కళ్ల వరకు ఆ నవ్వు చేరదు. డబ్బు గురించి చర్చిస్తున్నప్పుడు ఎవరైనా అసహజంగా నవ్వితే, జాగ్రత్తగా ఉండండి. ఇది ఒత్తిడిని లేదా దాగి ఉన్న ఉద్దేశాలను సూచిస్తుంది.

మూడవ సంకేతం: పెదాలను బిగించడం లేదా గట్టిగా నొక్కడం

Advertisement

ప్రజలు తరచుగా అసౌకర్యంగా ఉన్నప్పుడు పెదాలను బిగించుకుంటారు. ఈ సంకేతం వారు ఏదో దాచిపెడుతున్నారని సూచిస్తుంది. డబ్బు విషయం మాట్లాడేటప్పుడు పెదాలు బిగుతుగా ఉండి వారి అయిష్టతను సూచిస్తాయి. దీంతో ఆ వ్యక్తిలో నిజాయితీ లేదని అర్ధం చేసుకోవాలి.

నాల్గవ సంకేతం: తరచుగా ముఖాన్ని తాకడం

ముఖం, ముక్కు లేదా మెడను తాకడం ఆ వ్యక్తిలో ఆత్మవిశ్వాసం ఉండటాన్ని చూపిస్తుంది. ప్రజలు ఒత్తిడి లేదా టెన్షన్ లో ఉన్నప్పుడు దీన్ని చేస్తారు. ఈ ప్రవర్తన అసౌకర్యపు సంభాషణల సమయంలో పెరుగుతుంది. ఇది వారు అనిశ్చితంగా ఉన్నారని లేదా ఏదో దాచిపెడుతున్నారని సూచిస్తుంది.

ఐదవ సంకేతం: శరీర భంగిమ

చేతులు జోడించుకోవడం లేదా దూరంగా నిలబడి మాట్లాడడం రుణం తీసుకునే వ్యక్తి మీతో మనస్ఫూర్తిగా సన్నిహితంగా లేడని తెలుపుతుంది. ఆ వ్యక్తి మీ నుండి కొద్దిగా దూరంగా నిలబడతాడు. నిటారుగా కాకుండా కాస్త వంగిన భంగిమలో నిలబడతాడు. ఇది వారిలో నిజాయితీ లోపాన్ని, అసౌకర్యాన్ని, తప్పించుకునే స్వభావాన్ని సూచిస్తుంది.

ఆరవ సంకేతం: ఆలస్యంగా సమాధానం ఇవ్వడం

కొందరు సాధారణ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు ఆగిపోతారు. ఈ ఆలస్యం వారు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడుతున్నారని చూపిస్తుంది. సహజమైన సమాధానాలు త్వరగా, సులభంగా వస్తాయి. సంకోచం అనిశ్చితిని లేదా స్పష్టత లేకపోవడాన్ని సూచిస్తుంది.

ఏడవ సంకేతం: ప్రతి షరతను ఒప్పుకోవడం లేదా తల ఊపడం

నమ్మకంగా కనిపించడానికి ఆ వ్యక్తి ప్రతి విషయానికి తల ఊపవచ్చు. స్పష్టమైన సమాధానాలు ఇవ్వకుండా మీరు చెప్పే షరతులను త్వరగా ఒప్పుకోవచ్చు. ఈ ప్రవర్తన తరచుగా అసహజంగా లేదా అతిశయోక్తిగా అనిపిస్తుంది. ఇది ఆ వ్యక్తిని మిమ్మల్ని నమ్మించడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారని సంకేతం.

Also Read: రాత్రి మీకు సరిగా నిద్రపట్టడం లేదా? టెన్షన్‌గా ఉందా? ఇలా చేస్తే ప్రశాంతమైన నిద్ర మీ సొంతం

పై చెప్పిన అన్ని సంకేతాలను తప్పకుండా గమనించాలి

ఇప్పటి వరకు చెప్పిన ఏడు సంకేతాల్లో ఒకటి లేదా రెండు సంకేతాలు మీకు కనిపించకపోవచ్చు. అయితే వీటిలో కొన్ని కనిపించినా మీరు వెంటనే అప్రమత్తం కావాలి.

డబ్బు రుణంగా ఇవ్వడానికి ముందు ఈ జాగ్రత్తలు పాటించండి

ఎవరికైనా డబ్బు రుణంగా ఇవ్వడానికి ముందు జాగ్రత్తగా ఆలోచించండి. మీరు కోల్పోవడానికి సిద్ధంగా ఉన్న డబ్బును మాత్రమే రుణంగా ఇవ్వండి. తిరిగి చెల్లించడానికి స్పష్టమైన నిబంధనలను ప్రారంభం నుండే నిర్దేశించుకోండి. సరైన ఒప్పందం లేకుండా పెద్ద మొత్తాలను రుణంగా ఇవ్వడం మానుకోండి. ఆర్థిక విషయాలలో మాటల కంటే చర్యలను నమ్మండి. ఏదైనా అనుమానంగా ఉంటే రుణం ఇచ్చే ముందు బాగా ఆలోచించుకునేందుకు సమయం తీసుకోండి.

Related News

ఉద్యోగం చేసే భార్యభర్తల మధ్య ఒత్తిడి, గొడవలు.. దాంపత్య జీవితం కాపాడుకోవడానికి ఇలా చేయడం తప్పనిసరి

ఆలుగడ్డలు 5 నెలల పాటు తాజాగా ఉండాలా? అయితే ఆ ప్రదేశంలో పెట్టండి!

రోగాలు మాయం.. వర్షాకాలంలో కచ్చితంగా తినాల్సిన కూరగాయలు

వర్షాకాలంలో జుట్టు రాలడం, చుండ్రు సమస్యలా ?

టమాటా సైజును బట్టి ఆరోగ్య ప్రయోజనాలుంటాయా? నిపుణులు ఏమంటున్నారంటే..!

ప్రతిరోజూ సంతోషంగా ఉండాలనుకుంటున్నారా? ఈ 10 అలవాట్లు మీ జీవితాన్ని మార్చగలవు

చిన్న కిచెన్ ఉన్నవారికి గుడ్ న్యూస్.. టాప్ 5 స్పేస్-సేవింగ్ ఫ్రిజ్‌లు బడ్జెట్ ధరలోనే

ఇంట్లో కత్తి మొద్దుబారిపోయిందా? పదును పెంచడానికి న్యూస్‌పేపర్‌ ఉంటే చాలు.. ఎలాగంటే

Big Stories

Advertisement
×