E-Paper
Advertisement

45 ఏళ్ల క్రితమే కళ్లు చెదిరే విజువల్స్ తో వణుకు పుట్టించే వార్… ఆస్కార్ పురస్కారంతో సత్కారం… ఐయండిబిలో 8.4 రేటింగ్

45 ఏళ్ల క్రితమే కళ్లు చెదిరే విజువల్స్ తో వణుకు పుట్టించే వార్… ఆస్కార్ పురస్కారంతో సత్కారం… ఐయండిబిలో 8.4 రేటింగ్
Advertisement

Action Movie OTT : ప్రపంచ సినిమా చరిత్రలో ఒక వార్ మూవీ అద్భుతమైన చిత్రంగా నిలిచిపోయింది. 45 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా, అత్యుత్తమ వార్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. అప్పట్లోనే దీనిని కళ్ళు చేదిరే విజువల్స్ తో తెరకెక్కించారు. వియత్నాం యుద్ధ నేపథ్యంలో ఈ సినిమా ఆస్కార్ లు కూడా గెలిచింది. ఇది మామూలు యుద్ధం సినిమా కాదు.. ఒక రకమైన మైండ్ గేమ్ లాంటి సినిమా. యుద్ధం పేరుతో మనుషులు ఎంత దారుణంగా మారిపోతారో, వాళ్లలో ఉండే క్రూరత్వం ఎంత భయంకరంగా ఉంటుందో ఈ సినిమాలో కనిపిస్తుంది. మనిషిలో ఉండే మంచితనం చనిపోయి, జంతువులా మారితే ఎలా ఉంటుందో చూడాలనుకుంటే ఈ సినిమా పర్ఫెక్ట్. ఐయండిబిలో దీనికి 8.4 రేటింగ్ కూడా ఉంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఎక్కడ చూడచ్చు అంటే

ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా దర్శకత్వంలో 1979లో వచ్చిన ఈ సినిమా పేరు ‘అపోకలిప్స్ నౌ’ (Apocalypse Now). జోసెఫ్ కాన్రాడ్ రాసిన ‘హార్ట్ ఆఫ్ డార్క్నెస్’ అనే నవల ఆధారంగా, వియత్నాం యుద్ధ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో మార్టిన్ షీన్, మార్లన్ బ్రాండో, రాబర్ట్ డువాల్ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ చిత్రం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అత్యున్నత పురస్కారమైన పామ్ డి ఓర్ గెలుచుకుంది. అంతేకాదు సినిమాటోగ్రఫీ, సౌండ్ విభాగాల్లో రెండు ఆస్కార్ అవార్డులను కూడా సొంతం చేసుకుంది. సినిమా నిర్మాణం ఒక పెద్ద సాహసమనే చెప్పాలి. దర్శకుడు కొప్పోలా ఈ చిత్రం కోసం తన సొంత ఆస్తులను తాకట్టు పెట్టడమే కాకుండా, ఫిలిప్పీన్స్‌లో షూటింగ్ సమయంలో వచ్చిన భయంకరమైన తుఫానులు, సెట్ల విధ్వంసాన్ని తట్టుకుని నిలబడ్డారు. ప్రధాన నటుడు మార్టిన్ షీన్ షూటింగ్ మధ్యలో గుండెపోటుకు గురవ్వడం వంటి ఎన్నో అడ్డంకులను అధిగమించి ఈ కళాఖండాన్ని రూపొందించారు. 1979లో విడుదలైనప్పటి నుండి ఇప్పటి వరకు ‘థియేట్రికల్ కట్’, ‘రిడక్స్’, ‘ఫైనల్ కట్’ పేరుతో మూడు విభిన్న వెర్షన్లలో ఇది అందుబాటులోకి వచ్చింది. ఇది ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

1969 న వియత్నాంలో యుద్ధం భీకరంగా సాగుతుంటుంది. ఆ సమయంలో కెప్టెన్ విల్లార్డ్ అనే ఆర్మీ అధికారికి ఒక కఠినమైన పని అప్పగిస్తారు. వాళ్ల సొంత ఆర్మీకి చెందిన కర్నల్ కర్ట్జ్ అనే వ్యక్తి, కంబోడియా అడవుల్లో తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని ఏర్పరచుకుంటాడు. కర్ట్జ్ పూర్తిగా విచక్షణ కోల్పోయాడని భావించిన పై అధికారులు, అతన్ని వెతికి పట్టుకుని అంతం చేయమని విల్లార్డ్‌ను ఆదేశిస్తారు. ఈ మిషన్ కోసం విల్లార్డ్ ఒక చిన్న నౌకలో కొంతమంది సైనికులతో కలిసి, ఒక నది గుండా తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. ఆ ప్రయాణంలో యుద్ధం వల్ల కలిగే విధ్వంసాన్ని, మనుషుల్లోని క్రూరత్వాన్ని అతను కళ్ళారా చూస్తాడు.

అసలు మనిషి ఇంత దారుణంగా ఎలా మారతాడు అనే ప్రశ్న అతనిలో మొదలవుతుంది. చివరికి దట్టమైన అడవిలో కర్ట్జ్ ఉన్న ప్రాంతానికి చేరుకున్న విల్లార్డ్‌కు అక్కడ వింతైన పరిస్థితులు కనిపిస్తాయి. కర్ట్జ్ మాటలు, ఆలోచనలు విన్నాక.. యుద్ధం పట్ల అతనికున్న భయంకరమైన అవగాహన విల్లార్డ్‌కు అర్థమవుతుంది. కర్ట్జ్ చెప్పే విషయాలు విల్లార్డ్‌ను అయోమయంలో పడేసినా, చివరికి తన బాధ్యత నెరవేర్చడానికి అతన్ని చంపి, ఆ రక్తపాతం నుంచి బయటపడి తిరిగి వచ్చేస్తాడు.

Advertisement

Read Also : ఒక్క తప్పుతో నరాలు తెగే ఉత్కంఠ… శవం దాచడానికి పడరాని పాట్లు… ఓటీటీలో కేక పెట్టిస్తున్న క్రేజీ థ్రిల్లర్

Related News

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

వచ్చేవారం నెట్ ఫ్లిక్స్ లో 3 సినిమాలు.. ఆ 2 మస్ట్ వాచ్!

అందరూ తక్కువ అంచనా వేసే లాయర్‌… కోర్టులో ఆమె వాదనలు వింటే మైండ్‌ బ్లాక్‌… మెంటలెక్కించే లీగల్‌ డ్రామా

థెరపీ కోసం వచ్చిన పేషెంట్‌తోనే సైకాలజిస్ట్‌కి తలనొప్పులు… నవ్వించే డార్క్ కామెడీ డ్రామా

కార్గిల్‌ యుద్ధంలో పక్షవాతం… ఓటమిని ఒప్పుకోని నిజమైన యోధుడి కథ… గూస్ బంప్స్ స్టోరీ భయ్యా

మాఫియా గ్యాంగ్‌ చేతికి చిక్కిన పురాతన నిధి మ్యాప్‌… డేంజరస్ అడ్వెంచర్ లో కామెడీ కూడా

అత్తింట్లోనే దెయ్యాల వేట… ఒక్కొక్కరినీ రాక్షసులుగా మార్చే దుష్టశక్తి… తెలుగులోనూ హారర్ మూవీ

Big Stories

Advertisement
×