Traditional Protein Drinks| వేసవిలో ఫిట్‌గా ఉండాలంటే ఖరీదైన ప్రోటీన్ పౌడర్లు అవసరం లేదు. ప్రొటీన్, ఇతర పోషకాలు నిండుగా ఉన్న సంప్రదాయ భారతీయ పానీయాలు ఉన్నాయి. వేసవిలో ఎండలు, వేడి వాతావరణం వల్ల శరీరంలో నీరు తగ్గిపోతుంది. అందుకే అవసరమైన ప్రోటీన్, నీరు, ఎనర్జీ లెవెల్స్ ఒకేసారి ఈ పానీయాలు అందిస్తాయి. వీటిలో పెరుగు, శనగలు, బాదం, ఇతర సహజ పదార్థాలు మాత్రమే ఉంటాయి. ఈ పానీయాలు శరీరాన్ని చల్లగా ఉంచడంతో పాటు కండరాల బలానికి, జీర్ణక్రియకు సహాయపడతాయి. వేసవికి సులభంగా తయారు చేసుకోగల హై-ప్రోటీన్ పానీయాల గురించి తెలుసుకుందాం.
శరీరంలో బలమైన కండరాలకు లేదా బలహీన కండరాలను రిపేర్ చేయడానికి ఆరోగ్యకరమైన ప్రోటీన్ చాలా ముఖ్యం. చాలా మంది మాంసాహారం లేదా నెయ్యితో కూడిన భారీ ఆహారాల్లో మాత్రమే ప్రోటీన్ ఇస్తాయని అపోహ పడుతుంటారు. కానీ అనేక భారతీయ పానీయాలు కూడా మన రోజువారీ ప్రోటీన్ అవసరాన్ని తీర్చగలవు. ఇవి సహజమైనవి, తక్కువ ఖర్చుతో ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. వేడి వాతావరణంలో శరీరానికి కావాల్సిన నీరు కూడా అందిస్తాయి.
సత్తు శర్బత్ వేసవికి బెస్ట్ పానీయాల్లో ఒకటి. ఇందులో వేయించిన శనగల చేసిన పిండిని నీటితో కలిపి తయారు చేస్తారు. సత్తులో ఎక్కువ ప్రోటీన్, ఫైబర్ ఉంటాయి, ఇవి ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తాయి. ఇవి శరీరాన్ని చల్లగా ఉంచి త్వరగా శక్తిని పెంచుతుంది. మీకు కావాల్సిన రుచి ప్రకారం తీపి లేదా ఉప్పగా తయారు చేసుకోవచ్చు. ఈ పానీయం ఉత్తర భారత దేశంలో చాలా పాపులర్.
మజ్జిగని పెరుగు, నీటిని కలిపి సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇది త్వరగా జీర్ణం అయిపోతుంది. పైగా వేడి వాతావరణానికి చాలా మంచిది. ఇందులో ప్రేగులకు బలాన్ని చేకూర్చే ప్రోబయోటిక్స్, పెద్ద మొత్తంలో ప్రోటీన్ ఉంటాయి. ఈ పానీయం జీర్ణక్రియకు సహాయపడి కడుపును చల్లగా ఉంచుతుంది. వేయించిన జీలకర్ర, పుదీనాను కలిపితే రుచి, ప్రయోజనాలు మరింత పెరుగుతాయి. వేసవిలో చెమట ద్వారా శరీరం కోల్పోయిన ద్రవాలను తిరిగి నింపుతుంది.
భారతదేశమంతటా ప్రజలు ఇష్టపడే గట్టి పెరుగు పానీయం లస్సీ. పెరుగులో భారీగా ప్రొటీన్ ఉంటుంది. ఒక గ్లాసు లస్సీలో సుమారు 6 నుంచి 8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. మీకు ఇష్టమైన స్వీట్ లస్సీ లేదా సాల్ట్ లస్సీ ఏదైనా తయారు చేసుకోవచ్చు. మామిడి లేదా అరటి పండ్లు కలిపితే పోషకాలు మరింత పెరుగుతాయి. ఆరోగ్యకరంగా ఉండాలంటే తక్కువ చక్కెర కలపండి.
జల్జీరా తీయ తీయగా కాస్త పుల్లగా, కారంగా రుచి ఉండే పానీయం. సత్తు లేదా శనగల పౌడర్ నీటిని కలిపితే ఇందులో భారీ మొత్తంలో ప్రోటీన్ పానీయంగా మారుతుంది. ఈ పానీయం జీర్ణక్రియను మెరుగుపరచి జీవక్రియను పెంచుతుంది. తీవ్రమైన వేడిలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి సహాయపడుతుంది.
బాదం పాలు వేసవికి మరొక ఆరోగ్యకరమైన పానీయం. నానబెట్టిన బాదంలను పాలు లేదా నీటితో బ్లెండ్ చేసి తయారు చేస్తారు. ఇది ప్రోటీన్‌తో పాటు విటమిన్ ఈ అందిస్తుంది. చర్మ ఆరోగ్యానికి సహాయపడి ఎక్కువసేపు శక్తిని ఇస్తుంది. పాలు తాగని వారికి కూడా ఇది మంచి ఆప్షన్.
Also Read: డాన్స్ చేసే సమయంలో గుండెపోటు.. పెరుగుతున్న కేసుల సంఖ్య.. ఇలా నివారించండి
సోయా పాలు శాకాహారులకు చాలా బాగుంటుంది. ఇందులో సోయాబీన్స్ నుంచి లభించే నాణ్యత గల ప్రోటీన్ ఉంటుంది. కండరాల వృద్ధికి, రోజువారీ పోషకాహార అవసరాలకు ఈ పానీయం సహాయపడుతుంది. సోయాబీన్స్‌ను నానబెట్టి ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.
ఈ పానీయాలు శరీరాన్ని చల్లగా ఉంచి నీటి అవసరాన్ని తీరుస్తాయి. సహజ సిద్ధమైన పోషకాలు, ప్రోటీన్ అందిస్తాయి. ఇందులో హానికరమైన రసాయనాలు, కృత్రిమ పదార్థాలు ఏమీ ఉండవు. జిమ్‌లో లభించే కమర్షియల్ ప్రోటీన్ సప్లిమెంట్ల కంటే చాలా తక్కువ ఖర్చులో వస్తాయి. క్రమం తప్పకుండా తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది, కండరాలకు మంచి బలం కూడా చూకూరుతుంది.
ప్రోటీన్ అవసరాలను తీర్చడానికి ఖరీదైన సప్లిమెంట్లు అవసరం లేదు. సాంప్రదాయ భారతీయ పానీయాల్లో పుష్కలంగా ప్రొటీన్స్ ఉంటాయి. ఇవి సులభం, ఆరోగ్యకరం, వేసవి ఫిట్‌నెస్ కోసం సరిపోతాయి. మెరుగైన ఆరోగ్యం కోసం వీటిని మీ రోజువారీ అలవాటులో చేర్చుకోండి.