E-Paper
Advertisement

Holi 2026 Safety tips: హోలీ ఆడుతున్నారా? చర్మం, కళ్లు జాగ్రత్త.. ఈ టిప్స్ తప్పక పాటించండి!

Holi 2026 Safety tips: హోలీ ఆడుతున్నారా? చర్మం, కళ్లు జాగ్రత్త.. ఈ టిప్స్ తప్పక పాటించండి!
Advertisement

Holi 2026 Safety tips: హోలీ అంటేనే ఉత్సాహం, కేరింతలు, రంగుల మయం. అయితే.. ఈ ఆనందం విషాదంగా మారకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ప్రస్తుత కాలంలో మార్కెట్లో దొరికే రంగుల్లో సీసం, పాదరసం వంటి ప్రమాదకర రసాయనాలు ఉంటున్నాయి. ఇవి చర్మ వ్యాధులకు, కంటి సమస్యలకు కారణమవుతాయి. హోలీని మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి పూర్తి సురక్షితంగా, ఆరోగ్యంగా జరుపుకోవడానికి పాటించాల్సిన ముఖ్యమైన చిట్కాలు, అస్సలు చేయకూడని పొరపాట్లను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

హోలీ 2026.. జాగ్రత్తలు, సూచనలు:

Advertisement

1. రంగుల ఎంపికలో జాగ్రత్త:
హోలీ ఆడేటప్పుడు చేసే అతిపెద్ద పొరపాటు చౌకగా దొరికే రసాయన రంగులను కొనడం. వీటిలో ఉండే మెటాలిక్ పెయింట్లు చర్మానికి తీవ్రమైన హాని చేస్తాయి. సాధ్యమైనంత వరకు ప్రకృతి సిద్ధమైన రంగులను వాడండి. ఇంట్లోనే పసుపు, గోరింటాకు, మోదుగ పూలతో రంగులు తయారు చేసుకోవడం ఉత్తమం.

2. చర్మం, జుట్టు సంరక్షణ:
రంగులు ఆడే కనీసం అరగంట ముందు శరీరం మొత్తానికి కొబ్బరి నూనె లేదా ఆముదం రాసుకోవాలి. ఇది చర్మంపై ఒక రక్షణ పొరలా పనిచేసి, రంగులు లోపలికి వెళ్లకుండా చూస్తుంది. జుట్టుకు కూడా బాగా నూనె రాసి ముడి వేసుకోవడం వల్ల రంగులు జుట్టు కుదుళ్లలోకి వెళ్లకుండా ఉంటాయి. వీలైతే పూర్తి చేతులు కప్పేలా ఉండే కాటన్ దుస్తులు వేసుకోండి.

Advertisement

3. కళ్లపై ప్రత్యేక శ్రద్ధ:
హోలీలో కళ్లు అత్యంత సున్నితమైనవి. రంగులు కళ్లలో పడితే చూపు మందగించే ప్రమాదం ఉంది. రంగులు ఆడేటప్పుడు సన్ గ్లాసెస్ ధరించడం వల్ల రక్షణ లభిస్తుంది. పొరపాటున కంట్లో రంగు పడితే.. వెంటనే చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. కళ్లను అస్సలు రుద్దకూడదు.

4.  హైడ్రేషన్:
ఎండలో రంగులు ఆడుతున్నప్పుడు శరీరం త్వరగా డీహైడ్రేషన్‌కు గురవుతుంది. కాబట్టి మధ్యమధ్యలో తగినంత నీరు, పండ్ల రసాలు లేదా మజ్జిగ తాగుతూ ఉండాలి. అలాగే, నీటిని వృథా చేయకుండా పొడి రంగులతో ఆడుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వండి.

Also Read: చర్మానికి నూనె పట్టిస్తే విటమిన్ డి పెరుగుతుందా? ఇందులో నిజమెంత ?

5. రంగులు కడిగేటప్పుడు చేయకూడని పొరపాట్లు:
రంగులు త్వరగా పోవాలని చాలా మంది గరుకుగా ఉండే సబ్బులు లేదా డిటర్జెంట్లు వాడుతుంటారు. ఇది చర్మాన్ని మరింత దెబ్బతీస్తుంది. రంగులు వదిలించడానికి క్లెన్సింగ్ మిల్క్ లేదా నిమ్మరసం, పెరుగు మిశ్రమాన్ని వాడండి. స్నానం చేసిన తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవడం మర్చిపోవద్దు.

6. ఇతర చిట్కాలు:

జంతువులపై రంగులు వేయకండి: మూగజీవాలకు రంగులు పడవు, అవి అనారోగ్యానికి గురవుతాయి.

బలవంతం వద్దు: ఇష్టం లేని వారిపై రంగులు చల్లడం, వాటర్ బెలూన్లు విసరడం వంటి పనులు చేయకండి.

ఆహారం విషయంలో జాగ్రత్త: రంగులు పూసుకున్న చేతులతో నేరుగా ఏదీ తినకండి. చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాతే ఆహారం తీసుకోండి.

Related News

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

ప్రతిరోజూ హెల్మెట్ ధరిస్తే జుట్టు డ్యామేజ్.. ఈ సులభమైన హెయిర్ కేర్ చిట్కాలు మీ కోసం

పాము, ముంగీస లాంటి స్వభావం వీరిది.. ఈ తేదీల్లో పుట్టినవారు పెళ్లి తరువాత గొడవపడుతూనే ఉంటారు

మద్యం లేదా సిగరెట్.. ఆరోగ్యానికి ఏది ఎక్కువ ప్రమాదకరం.. ఏది ముందుగా మానేయాలి?

ఉద్యోగం చేసే భార్యభర్తల మధ్య ఒత్తిడి, గొడవలు.. దాంపత్య జీవితం కాపాడుకోవడానికి ఇలా చేయడం తప్పనిసరి

Big Stories

Advertisement
×