E-Paper
Advertisement

Karachi US Embassy attack: రెచ్చిపోయిన ఆందోళనకారులు.. కరాచీలో అమెరికా ఎంబసీపై దాడి

Karachi US Embassy attack: రెచ్చిపోయిన ఆందోళనకారులు..  కరాచీలో అమెరికా ఎంబసీపై దాడి
Advertisement

Karachi US Embassy attack: ఇరాన్ సుప్రీం అయతుల్లా అలీ ఖమేని మరణవార్త తెలియగానే ఆయన మద్దతుదారులు రెచ్చిపోయారు. దీంతో గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తత వాతావరణ నెలకొంది. తాజాగా పాకిస్థాన్‌లోని కరాచీలో అమెరికా రాయబారి కార్యాలయంపై దాడులు చేశారు. తమతో తెచ్చుకున్న వాటితో ఎంబసీ ఆఫీసును ధ్వంసం చేశారు ఆందోళనకారులు.

కరాచీలో అమెరికా ఎంబసీపై ఆందోళనకారులు దాడి

Advertisement

అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఇరాన్ సుప్రీం అయతుల్లా అలీ ఖమేని మృతి చెందాడు. దీంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకున్నాయి. ముఖ్యంగా అమెరికా రాయబార కార్యాలయాలపై దాడులకు తెగబడ్డారు. తాజాగా పాకిస్తాన్‌లోని కరాచీలో అమెరికా రాయబార కార్యాలయంపై నిరసనకారులు దూసుకొచ్చారు. అమెరికా-ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

తమతో తెచ్చుకున్న రాళ్లు, కర్రెలు, ఇనుప రాడ్లతో ఎంబసీ ఆఫీసును ధ్వంసం చేశారు. కొన్నింటిని తగులబెట్టారు. పరిస్థితి గమనించిన పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. నిరసనకారులు బలవంతంగా రావడంతో ఆ గుంపుపై బాష్పవాయువు ప్రయోగించారు. ఆపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో దాదాపు 8 మంది ఆందోళనకారులు మృతి చెందినట్టు సమాచారం. 30 మందికి పైగా గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.

Advertisement

రెచ్చిపోయిన ఆందోళనకారులు.. కాల్పుల్లో 8 మంది మృతి

అందులో ఓ వ్యక్తి మాట్లాడుతూ తాము కాన్సులేట్‌కు నిప్పు పెట్టామని, ఖమీని హత్యకు ప్రతీకారం తీర్చుకుంటున్నామని చెప్పాడు. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై నిరసనకారులు దాడులు చేశారు. ఇదేకాకుండా గల్ఫ్ దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఎయిర్‌పోర్టులు ఎత్తైన భవనాలపై డ్రోన్లతో దాడులు జరుగుతున్నాయి.

మధ్యప్రాచ్యంలో అస్థిరతకు వాషింగ్టన్ ఆజ్యం పోస్తోందని ఆరోపించారు. విదేశీ సైనిక ప్రమేయాన్ని అంతం చేయాలని డిమాండ్ చేశారు. జమ్మూ కాశ్మీర్‌లోని రాంబన్‌లో నిరసనలు చెలరేగాయి. ప్రదర్శనకారులు డొనాల్డ్ ట్రంప్ దిష్టి బొమ్మలను దహనం చేశారు. షియా కమ్యూనిటీ నాయకుడు సయ్యద్ సమర్ కజ్మీ..  ఖమేనీ హత్యను ఖండించారు.

ALSO READ: ఇరాన్‌ కొత్త సుప్రీం ఖమేనీ కొడుకు మొజ్తబా? రేసులో ముగ్గురు వ్యక్తులు 

అమెరికా-ఇజ్రాయెల్ సైన్యం దొంగ దెబ్బ తీసిందని ఆరోపించారు. అటు దాడులతో దుబాయ్‌లో ఆదివారం ఉదయం నుంచి అనేక ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఆకాశంలో దట్టమైన పొగ అలముకుంది. దుబాయ్‌ నగరంలోని ప్రధాన వాణిజ్య ఓడరేవు జెబెల్ అలీలో మంటలు చెలరేగాయి.

 

Related News

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

బీచ్‌లో గుండె గుభేల్.. నడినెత్తి మీద నుంచి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లోకి ఎగిరిన టెంట్లు!

Big Stories

Advertisement
×