E-Paper
Advertisement

Pakistan vs Sri Lanka: ‘నాగిన్ డ్యాన్స్’ చేస్తూ ట్రోలింగ్..శ్రీలంక పౌరుడి చెంపపగలగొట్టిన పాకిస్తాన్ ఫ్యాన్‌

Pakistan vs Sri Lanka: ‘నాగిన్ డ్యాన్స్’ చేస్తూ ట్రోలింగ్..శ్రీలంక పౌరుడి చెంపపగలగొట్టిన పాకిస్తాన్ ఫ్యాన్‌

Pakistan vs Sri Lanka: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) నేపథ్యంలో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో పాకిస్తాన్ చేతులెత్తేసింది. సూపర్ 8లో భాగంగా పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక ( Pakistan vs Sri Lanka) మధ్య శనివారం పల్లెకేలే వేదికగా ( Pallekele International Cricket Stadium, Pallekele) బిగ్ ఫైట్ జరిగింది. అయితే ఇందులో 147 పరుగుల లోపు శ్రీలంకను కట్టడి చేయాల్సిన పాకిస్తాన్, తేలిపోయింది. దీంతో టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ సెమీ ఫైనల్ ఛాన్స్ కోల్పోయి, తిరిగి ఇంటిదారి పట్టింది పాకిస్తాన్. ఈ నేపథ్యంలోనే న్యూజిలాండ్ సెమీ ఫైనల్ కు వెళ్ళింది. అయితే పాకిస్తాన్ సెమీ ఫైనల్ వెళ‌క్క‌పోవడానికి కారణం శ్రీలంక. పాకిస్తాన్ ను ఇంటికి పంపించాలన్న కసితో శ్రీలంక ప్లేయర్లు ఆడారు. చివ‌ర‌కు అన్న‌ది సాధించుకున్నారు.

Also Read: Fakhar Zaman : పాకిస్తాన్ తో శ్రీలంక మ్యాచ్ ఫిక్సింగ్‌..లైవ్ మ్యాచ్ లోనే అండంగా దొరికిపోయారు, ఇదిగో వీడియో

పాకిస్తాన్ జట్టును ట్రోల్ చేసిన శ్రీలంక అభిమాని

నిన్న శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ ( Pakistan vs Sri Lanka) మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే బ్యాటింగ్ లో అద్భుతంగా రాణించిన పాకిస్తాన్, బౌలింగ్ లో మాత్రం తేలిపోయింది. వాస్తవంగా ఈ మ్యాచ్ లో 147 పరుగుల లోపు శ్రీలంకను కట్టడి చేయాల్సి ఉంది. కానీ పాకిస్తాన్ ఆ పని చేయకుండా విఫలమైంది. అదే ఈ దెబ్బకు టోర్నమెంట్ నుంచి పాకిస్తాన్ ఎలిమినేట్ అయింది. అయితే శ్రీలంక ఎలిమినేట్ కంటే.. పాకిస్తాన్ ను సెమీ ఫైనల్ కు వెళ్లకుండా ఆపామన్న సంతోషం లంక అభిమానుల్లో కనిపించింది. దీంతో స్టేడియం మొత్తం సంబరాలు చేసుకున్నారు శ్రీలంక అభిమానులు. కొందరైతే.. పాకిస్తాన్ ను ఉద్దేశించి అసభ్యకరమైన సైగలతో ట్రోలింగ్ కూడా చేశారు. ‘నాగిన్ డ్యాన్స్’ చేస్తూ మరికొంతమంది సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.

శ్రీలంక పౌరుడి చెంపపగలగొట్టిన పాకిస్తాన్ ఫ్యాన్‌

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో సెమీఫైనల్ ఛాన్స్ కోల్పోయింది పాకిస్తాన్. శ్రీలంక జట్టును కట్టడి చేయడంలో విఫలమైంది. దీంతో పాకిస్తాన్ అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. కొంతమంది పాకిస్తాన్ క్రికెటర్లను బండ బూతులు తిడుతున్నారు. బీఫ్ తింటారు కానీ.. మ్యాచ్ సరిగ్గా ఆడారని ఫైర్ అవుతున్నారు. ఇక ఓ పాకిస్తాన్ అభిమాని అయితే కన్నీళ్లు పెట్టుకున్నాడు. అంతేకాదు ఆవేశంతో ఓ శ్రీలంక పౌరుడిపై సదరు పాకిస్తాన్ అభిమాని దాడి కూడా చేశాడు. కావాలనే చెంప పైన కొట్టి.. క్షమాపణలు అడిగాడు. అతని దగ్గర తీసుకొని హగ్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన ఇండియన్ ఫాన్స్ ట్రోల్ చేస్తున్నారు. కావాలని చెంప పైన కొట్టిన ఆ ఎదవ.. తర్వాత భయపడిపోయాడని ఎద్దేవా చేస్తున్నారు. శ్రీలంకలో ఉన్నాం కాబట్టి… వాళ్లు అటాక్ చేస్తారని భయపడి వెంటనే హగ్ చేసుకున్నాడని కామెంట్స్ చేస్తున్నారు ఇండియన్ ఫాన్స్.

Also Read: US Israel Iran War: టీ20 వ‌రల్డ్ క‌ప్ పై వార్ ఎఫెక్ట్..గ‌జ గ‌జ వ‌ణికిపోతోన్న ప్లేయ‌ర్లు..రంగంలోకి ఐసీసీ

 

?igsh=M3BhZjMzc2I4ZHc4

 

 

Related News

Pakistan : పాకిస్తాన్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ? PCB షాకింగ్ నిర్ణ‌యం

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

Big Stories

×