E-Paper
Advertisement

Dandruff: చుండ్రు ఈజీగా తగ్గించుకోండిలా ?

Dandruff: చుండ్రు ఈజీగా తగ్గించుకోండిలా ?
Advertisement

Dandruff: ప్రస్తుతం చాలా మంది జుట్టు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా చుండ్రు జుట్టు సమస్యల్లో ఒకటి. చుండ్రు కూడా జుట్టు రాలడానికి కారణం అవుతోంది. అందుకే జుట్టు చుండ్రు సమస్యను వీలైనంత త్వరగా తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. లేదంటే ఇది విపరీతంగా జుట్టు రాలుతుంది.

చుండ్రు తలలో దురద, మంటను కలిగించడమే కాకుండా జుట్టు రాలడంతో పాటు జుట్టు బలహీనపడటానికి కూడా కారణమవుతుంది. అందుకే కొన్ని రకాల హోం రెమెడీస్ వాడటం వల్ల చుండ్రు సమస్యను ఈజీగా తగ్గించుకోవచ్చు.

Advertisement

చలికాలంలో తలపై చుండ్రు పెరుగుతుంది. చలికాలం ప్రారంభమైన వెంటనే చర్మం పొడిగా మారుతుంది. ఇది చుండ్రు సమస్యకు దారితీస్తుంది. చుండ్రు తలలో దురద, మంటను కలిగిస్తుంది.

కొబ్బరి నూనె , నిమ్మరసం :

Advertisement

తయారీ విధానం: 2-3 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను కాస్త వేడి చేసి అందులో ఒక నిమ్మకాయ రసాన్ని వేసి పూర్తిగా కలపండి. ఈ మిశ్రమాన్ని మీ తలకు పట్టించి సున్నితంగా మసాజ్ చేయండి. 30 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై ఏదైనా షాంపూతో తలస్నానం చేయండి. ఈ రెమెడీని వారానికి 2-3 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

కొబ్బరి నూనెలో యాంటీ ఫంగల్, మాయిశ్చరైజింగ్ గుణాలు ఉన్నాయి. ఇవి స్కాల్ప్‌ను హైడ్రేట్ చేస్తాయి అంతే కాకుండా చుండ్రుతో పోరాడటానికి సహాయపడతాయి.నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, ఇది జుట్టును శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా చుండ్రును తొలగిస్తుంది.

మెంతి గింజలు :

చిన్న కప్పు టేబుల్ స్పూన్ల మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టండి. ఉదయాన్నే గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసి తలకు పట్టించాలి. 30-40 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఈ రెమెడీని వారానికి 1-2 సార్లు ఉపయోగించండి.

మెంతులు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉన్నాయి, ఇది స్కాల్ప్‌ను శుభ్రపరచడంలో మరియు మూలాల నుండి చుండ్రును తొలగించడంలో సహాయపడుతుంది.

అలోవెరా జెల్ :

తాజా కలబంద ఆకు నుండి జెల్‌ను తీసి మీ తలపై నేరుగా అప్లై చేయండి. 30 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై తేలికపాటి షాంపూతో కడగాలి. మీరు వారానికి 2-3 సార్లు దీనిని ఉపయోగించవచ్చు. కలబందలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. ఇది తలలో దురదలను తగ్గిస్తుంది. చుండ్రును తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.

Also Read: ముఖంపై మొటిమలు తగ్గించే ఫేస్ ప్యాక్ ఇదే..

పెరుగు , బేకింగ్ సోడా:

ఒక కప్పు తాజా పెరుగులో ఒక టీస్పూన్ బేకింగ్ సోడా కలపండి. తర్వాత మీ తలకు అప్లై చేయండి. 20-30 నిమిషాల తర్వాత మీ జుట్టును షాంపూతో వాష్ చేసుకోండి. పెరుగులో సహజసిద్ధమైన యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి, ఇది జుట్టుకు పోషణనిస్తుంది అలాగే చుండ్రును తగ్గిస్తుంది. వారానికి ఒకసారి ఈ రెమెడీని ఉపయోగించడం ద్వారా చుండ్రు తగుతుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

Big Stories

Advertisement
×