BigTV English

Tomato For Skin: ముఖంపై మొటిమలు తగ్గించే ఫేస్ ప్యాక్ ఇదే..

Tomato For Skin: ముఖంపై మొటిమలు తగ్గించే ఫేస్ ప్యాక్ ఇదే..

Tomato For Skin: పోషకాలు అధికంగా ఉండే టమాటో మన ఆహారంలో ముఖ్యమైన భాగం. టమాటో తరచుగా కూరగాయలు, సలాడ్ లేదా కెచప్‌గా ఉపయోగిస్తారు. టమాటో ఆరోగ్యానికే కాదు చర్మ సంరక్షణకు కూడా చాలా మేలు చేస్తుంది. మొటిమల వంటి చర్మ సమస్యలను తొలగించడంలో టమాటో రసం సహాయపడుతుంది . టమాటో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ముఖంపై ముడుతలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి.


మీరు కూడా చర్మ సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, టమటో రసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా 5 రకాల చర్మ సమస్యలకు టమాటో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న టమాటోను ఫేస్ ప్యాక్ లాగా తయారు చేసుకుని వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇవి ముఖంపై మొటిమలను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. అంతే కాకుండా ముఖంపై జిడ్డను పొగొడతాయి.

టమటో రసం 5 సమస్యలను పరిష్కరిస్తుంది..


1.వడదెబ్బ: వేసవిలో వడదెబ్బ సర్వసాధారణం. చిన్నపాటి అజాగ్రత్త కూడా ఈ సమస్యకు దారి తీస్తుంది. టమాటో రసం సన్‌బర్న్ , టాన్ మార్కులను తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. టమాటోలో విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. ఇవి టానింగ్‌ను తొలగించడంలో సహాయపడతాయి. టమాటోలో ఉండే లైకోపీన్ వడదెబ్బ నుండి చర్మాన్ని రక్షిస్తుంది.

2. మొటిమలు: కౌమారదశలో మొటిమల సమస్య చాలా సాధారణం. టమాటోలో ఉండే విటమిన్లు మరియు అందులో ఉండే అసిడిక్ గుణాలు చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తాయి. టమాటో రసం చర్మం యొక్క pH స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇది మొటిమల సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది.

3. జిడ్డు చర్మం: జిడ్డు చర్మం చాలా మందికి అతి పెద్ద సమస్య. కొంత మంది ముఖం కడుక్కున్న కొద్దిసేపటికే ముఖంపై ఆయిల్ రావడం ప్రారంభమవుతుంది. ఈ సమస్య ఉన్న వారు టమాటో రసాన్ని అప్లై చేయడం మంచిది. తరిగిన టొమాటోను ముఖానికి రాసుకుని 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత సాధారణ నీటితో ముఖం కడగాలి. ఈ రెమెడీతో చర్మం మృదువుగా మారి ముఖంపై జిడ్డు తొలగిపోతుంది.

4. స్కిన్ డెడ్ సెల్స్ : వయసు పెరిగే కొద్దీ ముఖంపై మృతకణాలు పెరగడం ప్రారంభిస్తాయి. చర్మం తేమ కోల్పోవడం వల్ల కూడా ఇది జరుగుతుంది. టమాటో రసాన్ని ముఖానికి రాసుకోవడం వల్ల సహజసిద్ధమైన ఫేస్ మాస్క్‌లా పనిచేసి చర్మంపై ఉన్న మృతకణాలను తొలగిస్తుంది. ఇది చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడంలో సహాయపడుతుంది. తద్వారా చర్మం మృదువుగా ,మెరుస్తూ కనిపించడం ప్రారంభిస్తుంది.

Also Read: మీరు తెల్లగా మెరిసిపోవాలా ? ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి

5. చర్మ రంద్రాలు: టమాటో రసాన్ని ముఖానికి రాసుకోవడం వల్ల చర్మ రంధ్రాలు బిగుతుగా మారతాయి. టమాటో రసం ముఖ రంధ్రాలలో పేరుకుపోయిన మురికిని తొలగించి, బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది ముఖ చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. అంతే కాకుండా కాంతిని పెంచుతుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Big Stories

×