BigTV English

Viswam Twitter Review : ‘విశ్వం’ ట్విట్టర్ రివ్యూ.. యాక్షన్స్ సీన్స్ వేరే లెవల్.. ట్రైన్ సీన్స్ హైలెట్..

Viswam Twitter Review : ‘విశ్వం’ ట్విట్టర్ రివ్యూ.. యాక్షన్స్ సీన్స్ వేరే లెవల్.. ట్రైన్ సీన్స్ హైలెట్..

Viswam Twitter Review : టాలీవుడ్ హీరో, మ్యాచో స్టార్ గోపీచంద్ గతంలో రామ బాణం సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ సినిమా భారీ అంచనాలతో రిలీజైన బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కథల ఎంపికైన విషయంలో కాస్త గ్యాప్ తీసుకుని మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు గోపీచంద్.. గోపీచంద్ శ్రీను వైట్ల కాంబోలో వచ్చిన మూవీ విశ్వం.. నిర్మాత విశ్వప్రసాద్ వరుస సినిమాలు చేస్తున్నారు. అయితే అందులో హిట్స్ అయ్యేవి కొన్ని. భారీ బ్లాక్ బస్టర్ కోసం ఈ ముగ్గురు కలిసి చేసిన ప్రయత్నం ‘విశ్వం’.. మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా ఈ థియేటర్లలోకి వచ్చేసింది. ఈ సినిమాతో హీరో కమ్ బ్యాక్ ఇచ్చాడేమో చూడాలి. ఈ సినిమా ప్రేక్షకులను ఎలా అల్లరించిందో నెటిజన్లు చేసిన ట్వీట్స్ ఏంటో.. సినిమాకు ఎంత రేటింగ్ ఇచ్చారో ఒకసారి చూద్దాం..


ఈ సినిమాలో అదిరిపోయే యాక్షన్ సీన్స్ ఉన్నాయి. కొన్ని సీన్స్ తీయడంలో దర్శకుడు బోయపాటి శ్రీనుకు ఒక స్టైల్ ఉంది. ‘విశ్వం’ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ చూశాక… బోయపాటిని శ్రీను వైట్ల గుర్తు చేశారని ఒక నెటిజన్ ట్వీట్ చేశాడు. కొన్ని సన్నివేశాలలో బోయపాటి గుర్తొచ్చాడు అని పేర్కొన్నాడు.. బోయపాటిని రీచ్ అయ్యేలా సీన్స్ చెయ్యడం మామూలు విషయం కాదు.

ఇక డైరెక్టర్ శీను వైట్ల సినిమాలు గురించి అందరికీ తెలుసు.. ఆయన సినిమాల్లో ఒక మార్క్ ఉంది. కామెడీ సన్నివేశాలను తీయడంలో శ్రీను వైట్లకు సపరేట్ స్టైల్ ఉంది. కానీ ఆయన ప్రతి సినిమాలో సేమ్ కాన్సెప్ట్ ఫాలో అవుతారని విమర్శ కూడా ఉంది. అయితే హీరోయిన్ ఇంటికి హీరో వెళ్లడం లేదంటే హీరో ఇంటికి హీరోయిన్ వెళ్లడం వల్ల రొటీన్ స్టోరీలను గతంలో చూశాము.. కానీ ఈ సినిమాలో మాత్రం అలా లేదని చెబుతున్నారు. రొటీన్ శ్రీనువైట్ల ఫార్ములా ను పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ చాలా బాగుందని కామెడీ వర్కౌట్ అయిందని సినిమా చూసిన వాళ్ళు చెబుతున్నారు..

ఇక మరొకరు ట్రైన్ ఎపిసోడ్ చాలా బాగా వర్క్ అవుట్ అయిందట. ఈ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ గురించి శ్రీను వైట్ల సైతం ముందు నుంచి చెబుతూ వస్తున్నారు. వెంకీ సినిమాలో ట్రైన్ సీక్వెన్స్ మూవీ అవుతుందని ట్వీట్ చేశారు.

విశ్వం ప్రీమియర్ షోస్ బాగానే అనిపించాయి. ఈ మూవీ క్లైమాక్స్ పోర్షన్ 30 మినిట్స్ సరిగా తీసి ఉంటే ఇంకా బాగుండేదని ట్విట్టర్ టాక్. మొత్తం మీద వింటేజ్ శ్రీను వైట్ల ఇస్ బ్యాక్ అని ఎన్ఆర్ఐ ఆడియన్స్ సర్టిఫికెట్ ఇచ్చేశారు.. మరి తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.. మొత్తానికి ఈ మూవీ అయితే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. మరి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి…

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×