E-Paper
Advertisement

చదువుకున్న స్కూల్‌కే టీచర్‌గా… పిల్లలతో ఈ మాజీ స్టూడెంట్ పడుతున్న కష్టాలు చూస్తే నవ్వులే నవ్వులు

చదువుకున్న స్కూల్‌కే టీచర్‌గా… పిల్లలతో ఈ మాజీ స్టూడెంట్ పడుతున్న కష్టాలు చూస్తే నవ్వులే నవ్వులు
Advertisement

Teen Comedy Series OTT : స్కూల్లో చదువుకునే రోజుల్లో కొందరు విద్యార్థులు క్లాస్‌లో అల్లరి చేస్తూ, టీచర్ల మాట వినకుండా ఇబ్బంది పెడుతుంటారు. అప్పుడు ఒకరోజు మనమే టీచర్‌ అయితే ఎలా ఉంటుందో అని సరదాగా అనుకున్న సందర్భాలు కూడా ఉంటాయి. కానీ నిజంగా అదే స్కూల్‌కు టీచర్‌ గా తిరిగి వెళ్లాల్సి వస్తే, ముఖ్యంగా ఆ పని చేయడానికి అవసరమైన అర్హతలు కూడా మన దగ్గర లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది ? విద్యార్థుల ముందు గౌరవం నిలబెట్టుకోవడం, తరగతిని అదుపులో పెట్టడం, మనకే తెలియని విషయాలను నేర్పించాల్సి రావడం… ఇవన్నీ కలిస్తే కామెడీకి కొదవ ఉండదు. అలాంటి కథతో వచ్చిన సిరీస్‌ ‘హాలీవుడ్‌ ఆర్ట్స్‌’ (Hollywood Arts). మరి ఈ సిరీస్ స్ట్రీమింగ్ ఎక్కడ ? అన్న విషయంలోకి వెళ్తే…

కథలోకి వెళ్తే…

ట్రినా వేగా ఒకప్పుడు హాలీవుడ్‌ ఆర్ట్స్‌ అనే ఆర్ట్ పాఠశాలలో చదువుకుంది. నటిగా పేరు సంపాదించాలని కలలు కన్న ఆమెకు కెరీర్‌ లో మాత్రం ఆశించిన స్థాయి విజయాలు దక్కవు. అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉండే ట్రినాకు అదే పాఠశాలలో తాత్కాలిక ఉపాధ్యాయురాలిగా పని చేసే అవకాశం వస్తుంది. అయితే టీచర్‌ ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు ఆమెకు పూర్తిగా లేవు. అయినప్పటికీ ఆ అవకాశాన్ని వదులుకోకుండా తరగతి గదిలోకి అడుగు పెడుతుంది.

Advertisement

అక్కడి నుంచే అసలు సరదా మొదలవుతుంది. ప్రతిభావంతులైన విద్యార్థులు తమ కళలో ఎదగాలని, పెద్ద వేదికపై గుర్తింపు పొందాలని ఆశపడుతుంటారు. అలాంటి విద్యార్థులకు మార్గనిర్దేశం చేయాల్సిన ట్రినా మాత్రం తన జీవితాన్నే ఇంకా సరిదిద్దుకునే ప్రయత్నంలో ఉంటుంది. పుస్తకాల్లో ఉన్న పద్ధతులు ఒకలా ఉంటే, నిజ జీవితంలో విద్యార్థులను ఎదుర్కోవడం మరోలా ఉంటుంది. తన మాట ఎవ్వరూ వినరు. కొంతమంది పిల్లలు ప్రశ్నిస్తే, మరికొందరు తనకంటే ఎక్కువ తెలివిగా వ్యవహరిస్తారు. ఈ పరిస్థితులు ఆమెను ఇబ్బందుల్లో పడేస్తాయి.

అయితే ట్రినా పాత్రను కేవలం అజ్ఞానంతో నవ్వులు పండించే వ్యక్తిగా మాత్రమే చూడలేం. తనకు సరైన అర్హతలు లేకపోయినా, విద్యార్థుల జీవితాల్లో ఏదో ఒక మార్పు తీసుకురావాలనే ప్రయత్నం ఆమెను కొత్త అనుభవాల వైపు నడిపిస్తుంది. విద్యార్థులు కూడా తమ కలలు, వ్యక్తిగత సమస్యలు, స్నేహాలు, పోటీల మధ్య తమ దారిని వెతుక్కుంటుంటారు. ఈ క్రమంలో ట్రినా వారితో గొడవపడే సందర్భాలే కాకుండా, అనుకోకుండా వారికి ఉపయోగపడే సందర్భాలు కూడా ఎదురవుతాయి.

Advertisement

Also Read : బర్త్‌డే పార్టీకి వెళ్లి తుఫానులో… ఒక్కొక్కరి నిజ స్వరూపం చూస్తే మైండ్ బ్లాక్… గూస్‌బంప్స్ తెప్పిస్తున్న డార్క్ కామెడీ

ఏ ఓటీటీలో ఉంది ?

‘హాలీవుడ్‌ ఆర్ట్స్‌’ అక్టోబర్‌ 15 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో విడుదలైంది. తొలి సీజన్‌లో 26 ఎపిసోడ్‌లు ఉన్నాయి. డానియెల్లా మోనెట్‌ ట్రినా వేగా పాత్రలో కనిపిస్తారు. ఈ సిరీస్‌ గతంలో వచ్చిన విక్టోరియస్‌ ప్రపంచానికి కొనసాగింపుగా రూపొందింది. కొత్త తరం విద్యార్థులతో ట్రినా ఎదుర్కొనే చిక్కులు, తన సొంత జీవితాన్ని సరిచేసుకోవాలనే ప్రయత్నం, పాఠశాలలో జరిగే అల్లరి సంఘటనలు కథకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

Tags

Related News

భర్తనే నమ్మలేని పరిస్థితి… అమెరికా రాజకీయాల్లో మరో భారీ కుట్ర… ఓటీటీలో తాజా సీజన్ రచ్చ

బర్త్‌డే పార్టీకి వెళ్లి తుఫానులో… ఒక్కొక్కరి నిజ స్వరూపం చూస్తే మైండ్ బ్లాక్… గూస్‌బంప్స్ తెప్పిస్తున్న డార్క్ కామెడీ

ఫ్రెండ్స్‌తో కలిసి కేఫ్‌ మొదలుపెడితే… మన ఫ్రెండ్స్ గ్యాంగ్‌ని గుర్తుచేసే మలయాళం కామెడీ సిరీస్ తెలుగులో

కోమా నుంచి లేచాక ఎదుటివాళ్ల మనసులోని మాటలు వినిపిస్తే ? కడుపుబ్బా నవ్వించే మలయాళ సూపర్ హిట్ కామెడీ డ్రామా

బంగారు లాకెట్‌తో మొదలైన చిక్కులు… కోర్టును షేక్ చేసే మత్స్యకారుడి పోరాటం… ఓటీటీలో తెలుగులో ఎమోషనల్ డ్రామా

వయసు 50 దాటినా యాక్షన్‌లో తగ్గేదేలే… పాత గూఢచారులు మళ్లీ రంగంలోకి… అదిరిపోయే కొరియన్ యాక్షన్ కామెడీ సిరీస్

కాబోయే భార్యకు కుక్కలంటే అలర్జీ… ప్రాణంగా పెంచుకున్న పెట్‌ను ఏం చేశాడంటే ? డాగ్ లవర్స్ డోంట్ మిస్

Big Stories

Advertisement
×